ఈగలకు చెక్ పెట్టాలంటే…

01.jpg072893c9-ab03-4841-bf3d-076fbe86cb1dLarger
వర్షాకాలంలో ఈగలకు చెక్ పెట్టాలంటే.. తులసి కొమ్మల్ని వంటగది, డైనింగ్ టేబుల్ వద్ద ఉంచాలి. ఒకవేళ తాజా కొమ్మలు దొరక్కపోతే ఎండిపోయిన ఆకుల్ని మస్లిన్‌ వస్త్రంలో ఉంచి వేలాడదీస్తే సరిపోతుంది. అలానే లావెండర్‌, తమలపాకులూ, పుదీన వంటివి కూడా ఈగల్ని పారదోలతాయి.

టేస్టీ క్యాప్సికమ్ వ్రాప్ ఎలా తయారుచేయాలో చూద్దాం…హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి…

images (18)

కావల్సిన పదార్థాలు:

గోధుమలు పిండి: 2 cups

క్యాప్సికమ్: 2 (పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి)

టమోటాలు: 2(మీడియంసైజువి సన్నగా తరిగినవి)

ఉల్లిపాయలు: 1 (చిన్న, చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)

పచ్చిమిర్చి: 2 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)

బ్లాక్ మిరియాలు పొడి: 1tsp

జీలకర్ర పొడి: 1tsp

పసుపు పొడి: ½ tsp

టమోటో కెచప్: 1tbsp

ఉప్పు : రుచికి సరిపడా

నూనె: 2tbsp

నీరు- 2 cups

తయారుచేయు విధానం:

1. ముందుగా గోధుమపిండిలో కొద్దిగా ఉప్పు నీళ్ళు పోసి మృదువుగా కలిపి పెట్టుకోవాలి.

2. 10-15నిముషాల తర్వాత పిండి నుండి కొద్దిగా తీసుకొని, చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీల ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి.

3. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లి పాయ ముక్కలు వేసి 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

4. తర్వాత అందులోనే క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, పెప్పర్ పౌడర్, జీలకర్ర, పసుపు వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.

5. తర్వాత టమోటో, పచ్చిమిర్చి మరియు టమోటో కెచప్ కూడా వేసి మరో రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

6. మొత్తం ఫ్రై అయిన తర్వాత అరకప్పు నీళ్ళు పోసి , మూత పెట్టి 5నిముషాలు ఉడికించుకోవాలి.

7. ఒకసారి ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.

8. తర్వాత పాన్ ను వేడి చేసి రుద్దిపెట్టుకొన్న చపాతీలను ఒక టీస్పూన్ నూనె చిలకరిస్తూ పాన్ మీద రెండు వైపులా కాల్చుకోవాలి.

9. ఒక వైపు కాలిన తర్వాత ఆ చపాతీని మరో వైపు కూడా రెండు నిముషాలు కాల్చుకోవాలి.

10. చపాతీ రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్ లోకి తీసుకొని ఈ చపాతీ రోల్ ల్లో ముందుగా రెడీ చేసి పెట్టుకొన్న క్యాప్సికమ్ స్టఫ్ ను పెట్టి రోల్ చేయాలి.తర్వాత చేత్తో రెండు వైపులా కవర్ చేయాలి.

11. ఇలా మొత్తం చపాతీలను స్టఫ్ చేసి క్యాప్సికమ్ రోల్స్ తయారుచేసుకోవచ్చు. అంతే టేస్టీ క్యాప్సికమ్ రిసిపి రెడీ.

శీతాకాలం వచ్చేసింది… ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి…

tips-for-glowing-skin-in-winter-season

సాధరణంగా మనకు ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఐతే శీతాకాలంలో కాఫీ తాగడం వల్ల కఫం పేరుకుంటుంది. ముక్కు దిబ్బడ వంటి సమస్యలు తలెత్తవచ్చు. కనుక కాఫీ, హెర్బల్‌ టీలకు దూరంగా ఉండండి. ఇంకా నీళ్లు ఎక్కువ తాగండి.

ఆకుకూరలు అధికంగా తీసుకోండి. చేతులను శుభ్రంగా ఉంచుకోండి. అవసరమైతే మందులు వాడండి. ఉదయం వాకింగ్‌ చేయండి. త్వరగా నిద్రపోండి. శరీరానికి మాయిశ్చర్‌ అప్లై చేయండి. యోగాసనాలు వేయండి. తక్కువగా వేగించిన ఆహారపదార్థాలను తీసుకోండి. ఇలా చేస్తే శీతాకాలంలో అనారోగ్య సమస్యలు దాదాపు దరిచేరే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

తల్లిపాలు వృద్ధి చెందడానికి చిట్కాలు…

download (6)

– బియ్యపు పిండిని పాలలో వేసి ఉడికించి రోజుకు మూడు పూట్ల జావగా తాగుతుంటే తల్లిపాలు వృద్ధి చెందుతాయి.

– రోజూ బొప్పాయి పండ్లు తింటుంటే పాలు వృద్ధి చెందుతాయి.

– పత్తి చెట్టువేళ్ళు, చెరుకు వేళ్ళు రెండింటినీ మెత్తగా నూరి, చిక్కని పేస్ట్‌లా చేసుకుని, ఒక చెంచా పేస్ట్‌ను గ్లాసుపాలలో వేసి, నాలుగోవంతు మిగిలేలా కాచి, వడకట్టి తాగితే పాలు పెరుగుతాయి.

ప్రతిరోజు క్రమంతప్పకుండా వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తీసుకుంటే…

honey-and-garlic1
వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని ప్రతిరోజు పరకడుపున తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రక్త నాళాల్లో ఏర్పడే కొవ్వుని తొలగించి, గుండెకు రక్తప్రసరణ వేగంగా జరగడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి, తేనె మిశ్రమం గొంతు నొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్‌ని నివారిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల వాపును తగ్గిస్తుంది.
జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎలాంటి వ్యాధినైనా నయం చేసే శక్తి వెల్లుల్లి, తేనె మిశ్రమంలో ఉంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ నేచర్ కోలన్‌లో ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ, సైనసైటిస్‌లు దరిచేరవు. ఈ మిశ్రమంలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల శరీరంలో ఏర్పడే ఎలాంటి బ్యాక్టీరియానైనా నాశనం చేస్తుంది. శరీరంలోని మలినాలను, హానికారక క్రిములను శరీరం నుంచి బయటకు పంపుతుంది.

భోజనం ఇలా చేస్తే ఆరోగ్యం… తెలుసుకోండి…

lean_family_lead
చాలామందికి అసలు భోజనం ఎలా చేయాలో తెలియదు. అంటే, తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఐతే భోజనం ఎలా చేయాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భోజనం చేసే సమయంలో కడుపును నాలుగు భాగాలుగా ఊహించుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మహిళలు ఆహారం తీసుకునేటప్పుడు కడుపును నాలుగు భాగాలుగా భావించి రెండు భాగాలను ఘనపదార్థాలకూ, ఒక భాగం ద్రవపదార్థాలకు, మిగతా మరో భాగాన్ని వాయువుకు విడవాలి. ఈ నిష్పత్తిలో భోజనం చేయడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం.
అయితే పెరుగును తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. కేవలం పెరుగును మాత్రమే తినకూడదు. పెరుగు తినదలచినవారు అందులో కొద్దిగా తేనెనుగాని, ఉసిరిక కలుపుకుని తినాలి. పెరుగును యథాతథంగా రాత్రిపూట తినడం నిషిద్ధం. పెరుగు గుణం వల్ల వాపును, కఫాన్ని పెంచుతుంది. అదే మజ్జిగ ఆ ప్రభావాన్ని తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

భోజనం తర్వాత ఈ పొరపాట్లు చేస్తున్నారా?

hand-washing-2
“అన్నం పరబ్రహ్మ స్వరూపం”.. సాక్షాత్తూ శ్రీ అన్నపూర్ణా దేవి ఆ పరమశివుడికి అన్నం ప్రసాదించింది. అదీ అన్నానికి ఉన్న గొప్పదనం. అందుకే భోజనం చేయడమంటే నోట్లోకి అన్నం వెళ్ళడమే కాదు.. వడ్డించడం నుంచి తిన్న తర్వాత చేసే పనులు కూడా భోజన ప్రక్రియలోకే వస్తాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అలాంటప్పుడు ఆహారం తినేప్పుడు మనం చేయకూడని పనుల గురించి మన ధర్మశాస్త్రాలు ఏం చెబుతున్నాయో? ఓ సారి తెలుసుకునేందుకు ప్రయత్నిద్ధాం.
భోజనం ఆరగించిన తర్వాత చేతులని కంచం లేదా పళ్లెంలో ఎట్టి పరిస్థితుల్లో కడుగరాదు. తిన్నాక కేవలం చేతులని వేరొక చోట మాత్రమే కడగాలి.
అన్నం ఆరగించిన కంచాన్ని ఎప్పుడూ కూడా తిన్నచోటే వదిలేయకూడదు.
అలాగే, భోజనం పూర్తయ్యాక ఎవరైనా చేసే పని కుడి చేతిని మాత్రమే కడగడం.. ఒక్క చేత్తోనే కదా తినేది రెండు చేతులు ఎందుకు అనే లాజిక్‌ని పాటిస్తారు. కానీ, భోజనం ఆరగించిన తర్వాత తప్పకుండా రెండు చేతులూ పరిశుభ్రంగా కడుక్కోవాలి.
చివరగా అన్నం ఆరగించి, చేతులు శుభ్రంగా కడిగిన తర్వాత చేతులతో పాటు.. మూతిని పరిశుభ్రమైన గుడ్డతో తుడుచుకోవాలి. అపుడే భోజనం పుష్టిగా ఆరగించినట్టు లెక్క.

షవర్‌హెడ్‌ను శుభ్రం చేయడానికి సులువైన మార్గం…

download (15)

షవర్‌హెడ్‌లో ఏదో అడ్డుపడినట్లయి, నీళ్ళు సరిగ్గా  రానట్లైతే అలాంటప్పుడు దాన్ని ఊడదీసి, రాత్రి తెల్లవార్లూ వెనిగర్‌లో ముంచి ఉండాలి. తెల్లవారాక బలమైన బ్రష్‌తో దాన్ని రుద్దాలి.

వేపనూనె, కర్పూరంతో దోమలు పరార్…

mosquito-illustration_360x286
దోమలతో డెంగ్యూ వంటి జ్వరాలు వచ్చేస్తున్నాయి. వర్షాకాలం వచ్చేసిందంటే.. ఇక దోమల బాధ తాళలేక గుడ్ నైట్లు, ఆలౌట్లకు నెల పొడవునా భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నారా? అయితే ఇక అలాంటి దోమల లిక్విడేటర్లకు గుడ్ బై చెప్పేయండి. ఎలాగంటే.. ముందుగా పచ్చకర్పూరాన్ని లిక్విడేటర్ బాటిల్‌లో వేసి ఆపై అందులో వేపనూనెను పోయండి. తర్వాత బాటిల్‌కు మూతపెట్టి.. ప్లగ్గులో పెట్టండి. అంతే దోమల బెడద ఉండదు.
అలాకాకుంటే.. కప్పు వేప నూనెలో మెత్తగా పొడి చేసిన కర్పూరం వేయాలి. ఈ మిశ్రమాన్ని దోమల రిపెల్లెంట్‌లో ఉంచి.. ప్లగ్‌లో పెట్టుకోవాలి. గదిలో దోమలూ, ఇతర పురుగులు ఉంటే వెంటనే చనిపోతాయి.

బ్లాక్ ఫారెస్ట్ కేక్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

d18ab2dd369a82c4bdcbd63ca08ae9cd

కావాల్సిన పదార్ధాలు:

కేక్ కోసం:

చాకొలేట్ కేక్ – 1

మెత్తని క్రీమ్ – 4 కప్పులు (బీట్ చేసింది)

కాన్ చెర్రీలు – 16 (ముక్కలుగా కట్ చేసినవి)

పంచదార సిరప్ కోసం :

పంచదార – ½ కప్పు

నీళ్ళు – ¾ వంతు కప్పు

అలంకరణకు:

చాక్లెట్ కర్ల్స్ – 1 ¼ కప్పు

కాండ్ చెర్రీలు – 10 (మొత్తం)

తయారుచేసే విధానం:

1. ఒక చాకొలేట్ కేక్ కొనండి. ఎగ్ లేనివి కూడా తేలికగా అందుబాటులో ఉన్నాయి. దాన్ని 3 పొరలుగా కట్ చేయండి. ఇప్పుడు, మీరు పంచదార సిరప్ ని తయారుచేసి అందులో ఈ కేక్ ని ముంచండి. ఒక గిన్నెను తీసుకుని అందులో నీరు, పంచదార వేయండి. పంచదార నీటిలో కరిగే వరకు మరగనివ్వండి.

2. ఫ్లేవర్ కలపడానికి, మీరు బ్రాందీ, రమ్ వంటి ఎటువంటి లిక్కర్ నైనా కలపొచ్చు. మరగనిచ్చి స్టవ్ ఆపేయండి. షుగర్ సిరప్ గది ఉష్ణోగ్రతకు వచ్చే దాకా చల్లారనివ్వండి. ఇప్పుడు, పెద్ద గిన్నె తీసుకుని, క్రీమ్ ని బాగా కలపడం మొదలుపెటండి. ఆ క్రీమ్ నురగగా, మృదువుగా అయ్యేవరకు కలపండి.

3. కేక్ స్టాండ్ తీసుకుని, దానిలో ఒక కేక్ లేయర్ పెట్టండి. ఇప్పుడు, దానిమీద పంచదార సిరప్ పోయండి, దానిమీద బీట్ చేసిన క్రీమ్ ని కూడా రాయండి.

4. కేక్ పొరల మీద క్రీమ్ ని బాగా మందంగా పూయండి. ఇప్పుడు, కేక్ లేయర్ మీద చేర్రీస్ పెట్టండి. మీరు చెర్రీ మొత్తాన్ని పెట్టొచ్చు లేదా ముక్కలుగా చేసి పెట్టొచ్చు.

5. రెండవ పోరని పెట్టండి, మళ్ళీ పైలాగే అప్లై చేయండి. అలాగే మూడవ పొరను కూడా పెట్టి పై విధానాన్ని అనుసరించండి. తరువాత, కేక్ మొత్తాన్ని క్రీమ్ తో కవర్ చేసి, మృదువుగా ఉండేట్టు చేయండి. చాకొలేట్ బర్ నుండి చాకొలేట్ కర్ల్స్ తయారుచేసి, కర్ల్స్ తో కేక్ అలంకరించి, చేర్రీస్ తో కేక్ ని అలంకరించండి.

6. కేక్ పక్కల వైపు చాకొలేట్ కర్ల్స్ పుల్లలు పెట్టడం మరవకండి. మీరు ఇంట్లో చేసిన బ్లాక్ ఫారెస్ట్ కేక్ తయారైనట్టే.

7. దాన్ని కట్ చేసి, మీ అతిధులకు సర్వ్ చేయండి.