Archive for the ‘అందానికి చిట్కాలు’ Category

జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే కొబ్బరినీళ్ళు…

images (4)

కొబ్బరినీళ్లలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తలలో దురద, చుండ్రు మరియు ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. అలాగే జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కాబట్టి, తరచుగా కొబ్బరినీళ్లతో తలను మర్దనా చేయడం మంచిది.

సమ్మర్‌లో ఆయిల్ స్కిన్ నివారించడానికి సులభ చిట్కాలు…

download (18)

– పాలు, గుడ్డులోని తెల్లసొన, క్యారెట్‌ తురుము కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించినట్లైతే అధిక జిడ్డు తత్వాన్ని తగ్గిస్తుంది. జిడ్డు చర్మం వారు అప్పుడప్పుడు చన్నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి.

– మజ్జిగని ముఖంపైన అప్లైచేసి కొంత సేపు తర్వాత శుబ్రపరచినట్లైతే జిడ్డుని తగ్గిస్తుంది. అలాగే పెరుగు కూడా జిడ్డు చర్మానికి బాగా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో కార్న్ పౌడర్, నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని కాసేపయ్యాక కడిగేస్తే జిడ్డుతత్వం తొలగిపోతుంది.

కీరారసం, నిమ్మరసం, చందనం పొడి, బాదం పౌడర్‌, పెరుగు మరియు బంగాళదుంప రసాన్ని సమానంగా తీసుకొని వాటిని ముఖానికి పట్టించి కొంత సేపు తర్వాత కడిగేయాలి. ఈ విధంగా క్రమంగా చేసినట్లైతే జిడ్డు తగ్గుతుంది.

అల్‌బకర పండ్లు తినండి.. పెదవుల్ని అందంగా మార్చండి..

7
అల్‌బకరలో ఉండే విటమిన్ ‘ఇ’, బీటాకెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు చర్మకణాలను ఫ్రీరాడికల్స్ బారినుంచి రక్షిస్తాయి. అలాగే దీనిలో యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల, అవి వదులుగా మారిన చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. ఫలితంగా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనిపిస్తుంది.
కొంతమంది పెదవులు నల్లగా, అందవిహీనంగా ఉంటాయి. అలాంటి వారు అల్‌బకర్ పండ్లను తీసుకోవడం ద్వారా పెదవుల అందాన్ని మెరుగుపరుస్తుంది. దీంతోపాటు అల్‌బకర్ తొక్కతో పెదవులను కాసేపు సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే నల్లగా ఉన్న పెదవులు ఎర్రగా, మృదువుగా తయారవుతాయి.
మొటిమలను గిల్లడం, దెబ్బలు తగలడం లాంటి కారణాల వల్ల ఆయా ప్రదేశాల్లోని చర్మకణాలు పాడైపోతాయి. తిరిగి అక్కడ చర్మకణాలను ఉత్పత్తి చేయడానికి చర్మం కొలాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే కొన్నిసార్లు కొలాజెన్ తక్కువగా విడుదలవడం వల్ల అక్కడ చర్మకణాలు పూర్తిగా ఏర్పడవు. ఫలితంగా మచ్చలు ఏర్పడతాయి. అయితే అల్‌బకరను తినడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.

డార్క్ లిప్స్‌ని పింక్ లిప్స్‌గా మార్చే షుగర్ స్క్రబ్…

images (20)

పంచదార తీసుకుని స్క్రబ్‌లా ఉపయోగించండి. ఇది పెదాలపై డార్క్ నెస్, డెడ్ స్కిన్‌ని తొలగించి పింక్ కలర్ లిప్స్ పొందేలా చేస్తుంది. రోజూ పంచదారతో స్క్రబ్ చేస్తూ ఉంటే డార్క్ లిప్స్‌ని పింక్ లిప్స్‌గా మార్చేయవచ్చు.

తలస్నానానికి ముందు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

hairclean-e1454936828815

ఆయిల్ మసాజ్: తలస్నానానికి ముందు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల జుట్టు మెరుస్తూ, ఆరోగ్యంగా ఉంటుంది.

వేడి నీటిని: తలస్నానానికి ఎప్పుడూ ఎక్కువ వేడి నీటిని ఉపయోగించరాదు. హాట్ వాటర్ వల్ల జుట్టు పొడిబారడమే కాకుండా రఫ్‌గా మారిపోతుంది.

తేనె, పెరుగు: జుట్టు శుభ్రం చేసుకోవడానికి ముందు తేనె, పెరుగు కలిపి జుట్టుకి పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తేనె మాయిశ్చరైజింగ్‌లా పనిచేసి కండిషనర్ లుక్ ఇస్తుంది.

మినప్పప్పు: మూడు టేబుల్ స్పూన్ల మినుములను రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే మెత్తటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఇందులో ఒక ఎగ్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి, ఒక కప్పు పెరుగు మిక్స్ చేయాలి. బాగా కలిపి జుట్టుకి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆయిలీ స్కిన్‌కి సూప‌ర్ ప‌వ‌ర్ ఉన్న న్యాచుర‌ల్ ఫేస్ వాష్…

tips-for-oily-skin-300x225

చ‌ర్మాన్ని గోరువెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఒక టీ స్పూన్ తేనె, చిటికెడు ప‌సుపు మరియు అర టీ స్పూన్ బేకింగ్ సోడా అర‌చేతిలో వేసుకోవాలి. వీటన్నింటినీ రెండు చేతుల‌తో మొఖంపై బాగా రుద్దాలి. సర్కుల‌ర్ మోష‌న్‌లో 2 నిమిషాల పాటు స్క్ర‌బ్ చేయాలి. ఎక్కువ ఆయిలీగా అనిపించే ప్రాంతంలో ఎక్కువ‌గా రుద్దుకోవాలి. త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే హోంమేడ్ ఫేస్ వాష్ అయిపోతుంది.

గ్లిట్టర్ ఐ షాడో ను అప్లై చేసే పద్దతులు…

images (91)

ఎక్కువ శ్రమ లేకుండా కళ్ళకు గ్లిట్టర్ ఐషాడోను ఎలా అప్లై చేయాలనే కొన్ని సులభ చిట్కాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి వాటిని పరిశీలించండి…

గ్లిట్టర్ సెలక్షన్: కళ్ళ మేకప్ వేసుకోవడానికి ఎంపిక చేసుకొనే, ఐషాడోలు మరియు గ్లిట్టర్ కలర్స్ రెండు ఒకే విధంగా ఉండాలి. గోల్డ్, సిల్వర్, బ్లాక్, మరియు పింక్ ఐషాడోలు చాలా మంచి ఎంపికలు. గ్లిట్టర్ నాణ్యమైనది ఎంపిక చేసుకోవడం లో కాస్త జాగ్రత్త పాటించాలి.ఎక్కువ సమయం నిలిచి ఉండే నాణ్యమైన ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాలి. అందుకు బ్రాండ్ ఐషాడోలను ఎంపిక చేసుకోవాలి.

ఐషాడోకు ముందు ప్రిమియర్ ను ఉపయోగించాలి: ఒక మంచి ఐషాడో ప్రిమియర్ ను ఎంపిక చేసుకవడం ఫర్ ఫెక్ట్ గా ఉంటుంది . ఇది మీరు గ్లిట్టర్ ఐషాడో అప్లై చేయడానికి ముందు ఇది సహాయపడుతుంది.

జెల్ లేదా వాసెలిన్ ను అప్లై చేయాలి: ఐషాడో వేయడానికి ముందు జెల్ లేదా వాజిలైన్ తో పాటు ఐలాష్ లైన్ అప్లై చేయడం వల్ల , ఐషాడో మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది. తగినంత జెల్ అప్లై చేయడం వల్ల ఐషాడో బాగా అతుక్కోవడానికి సహాయపడుతుంది. ఇది మీకు పరిపూర్ణ ఫర్ ఫెక్షన్ ను ఇస్తుంది.

క్రీమ్ ఐషాడోను ఉపయోగించండి: గ్లిట్టర్ ఐషాడో అప్లై చేయడానికి ముందు ఏదైనా క్రీమ్ బేస్డ్ ఐషాడో అప్లై చేయడం మంచిది. ఇది గ్లిట్టర్ మీ ముఖం మొత్తం వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది.

బేస్ కలర్స్ తో ప్రారంభించాలి: ఐషాడో వేయడానికి ముందు బేస్ కలర్స్ అప్లై చేసి, తర్వాత ఐషాడోను అప్లై చేయడం వల్ల మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. బేస్ కలర్ అప్లై చేసిన తర్వాత గ్లిట్టర్ ను అప్లై చేయాలి. అధికంగా అప్లై చేయకండి.

ఫైనల్ టచ్: మేకప్ పూర్తి అయిన తర్వాత కూడా కొంచెం గ్లిట్టర్ మీ ముఖంలో మిగిలి ఉండిపోయినట్లైతే, శాంతంగా మాస్కింగ్ టేప్ ను ముఖం మీద వేసి నిధానంగా తొలగించాలి.

ఆరోగ్యానికి, అందానికీను… నెయ్యి మేలు…

images (85)
సువాసనలు వెదజల్లే నెయ్యి ఆహారంలో రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి, సౌందర్యానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కొంచెం నెయ్యిని గోరువెచ్చగా వేడి చేసి, చిట్లిన జుట్టుకు రాసుకోవాలి. ఓ గంట తరువాత కడగాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకల్లో పగుళ్లు పోయి జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది. పొడిబారిన చర్మం ఉన్న వాళ్లకి నెయ్యి మంచి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది.
పెదవులు బాగా పొడిబారినప్పుడు పడుకునే ముందు పెదాలకు నెయ్యి రాసుకోవడం వల్ల అవి చాలా మృదువుగా తయారవుతాయి. ప్రతి రోజూ స్నానానికి ముందు రెండు చుక్కల నెయ్యితో ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ముఖం ఫేషియల్ చేసుకున్నట్టుగా మెరిసిపోతుంది.
నెయ్యి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. స్నానం చేయడానికి ముందు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవలసిన అవసరం ఉండదు. నిద్ర సరిపోకపోవడం వలన కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. పడుకునే ముందు కళ్ల చుట్టూ ఉండే బాగాన్ని నెయ్యితో మసాజ్ చేసుకోవాలి. పొద్దున్నే లేచిన తరువాత ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు చాలా త్వరగా పోతాయి.
కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్‌కి కొన్ని చుక్కలు గోరువెచ్చని నెయ్యి కలిపి, ఆ నూనెను మాడుకు మసాజ్ చేయాలి. తరువాత జుట్టుకు రాసుకోవాలి. పావు గంట తర్వాత తలస్నానం  చేయాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన జుట్టును మృదువుగా, ఆరోగ్యవంతంగా చేసుకోవచ్చు. కొంచెం శెనగ పిండిలో కొన్ని చుక్కలు నెయ్యి, పాలు పోసి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడుక్కోవాలి.

చిట్లిన జుట్టుకు పరిష్కార మార్గాలు…

images (5)

మసాజ్: తలకు మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు మెరుస్తూ, బలంగా ఉండటమే కాదు, జుట్టు చివర్ల చిట్లిపోవడాన్ని అరికడుతుంది. కొబ్బరినూనె, ఆల్మండ్ ఆయిల్ మరియు ఆలివ్ ఆయిల్‌ని సమానంగా తీసుకోవాలి. మూడింటిని కలిపి తలకు పట్టించుకోవడానికి ముందు గోరువెచ్చగా చేయాలి. తర్వాత తల మాడుకి బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వల్ల చివర్లు చిట్లిపోవడాన్ని అరికట్టవచ్చు.

హెన్నా: హెన్నా బెస్ట్ నేచురల్ కండీషనర్. హెన్నా పౌడర్‌ను, గ్రీన్ టీతో మిక్స్ చేసి పేస్ట్‌లా చేసి, అందులో అరకప్పు వేడిగా ఉండే ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించాలి. దీన్ని రెండు గంటల పాటు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికొకసారి చేస్తుంటే జుట్టు డ్యామేజ్ కాకుండా నివారించుకోవచ్చు.

అలోవెరా జెల్: అరకప్పు అలోవెర జెల్‌లో 3 చెంచాల కోకోనట్ వాటర్ మిక్స్ చేసి, ఈ మిశ్రామాన్ని తలకు పట్టించాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయడం ద్వారా చిట్లిన జుట్టును నివారించుకోవచ్చు. మరియు జుట్టు డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు.

పాదాలు మెరవాలంటే…

 

foot

వస్తున్నది వర్షాకాలం..ఈ వర్షాకాలంలో నీళ్లలో ఎక్కువగా నిలవడం..పనిచేయడం వల్ల పాదాలు నిర్జీవంగా అయిపోతుంటాయి. మరి పాదాలు మెరవాలంటే ఏం చేయాలి. ఏం లేదు. కొన్ని చిట్కాలు పాటిస్తే సరి..

టమాట గుజ్జు తీసుకోండి. ఈ గుజ్జును పాదాలకు రాసుకోవాలి. ఇలా పావు గంట ఉంచేయాలి. అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా రోజుకొకసారి చేయాలి.

కాసింత పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగును పాదాలకు రాయాలి. పావుగంట అలానే ఉంచి తరువాత నీళ్లతో శుభ్రం చేయాలి.
సమపాళ్లలో కీరదోస, నిమ్మరసం కలిపి పాదాలకు రాయాలి. పది నిమిషాల తరువాత శుభ్రం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.