Archive for the ‘ఆరోగ్యానికి చిట్కాలు’ Category

శీతాకాలం వచ్చేసింది… ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి…

tips-for-glowing-skin-in-winter-season

సాధరణంగా మనకు ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఐతే శీతాకాలంలో కాఫీ తాగడం వల్ల కఫం పేరుకుంటుంది. ముక్కు దిబ్బడ వంటి సమస్యలు తలెత్తవచ్చు. కనుక కాఫీ, హెర్బల్‌ టీలకు దూరంగా ఉండండి. ఇంకా నీళ్లు ఎక్కువ తాగండి.

ఆకుకూరలు అధికంగా తీసుకోండి. చేతులను శుభ్రంగా ఉంచుకోండి. అవసరమైతే మందులు వాడండి. ఉదయం వాకింగ్‌ చేయండి. త్వరగా నిద్రపోండి. శరీరానికి మాయిశ్చర్‌ అప్లై చేయండి. యోగాసనాలు వేయండి. తక్కువగా వేగించిన ఆహారపదార్థాలను తీసుకోండి. ఇలా చేస్తే శీతాకాలంలో అనారోగ్య సమస్యలు దాదాపు దరిచేరే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

భోజనం ఇలా చేస్తే ఆరోగ్యం… తెలుసుకోండి…

lean_family_lead
చాలామందికి అసలు భోజనం ఎలా చేయాలో తెలియదు. అంటే, తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఐతే భోజనం ఎలా చేయాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భోజనం చేసే సమయంలో కడుపును నాలుగు భాగాలుగా ఊహించుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మహిళలు ఆహారం తీసుకునేటప్పుడు కడుపును నాలుగు భాగాలుగా భావించి రెండు భాగాలను ఘనపదార్థాలకూ, ఒక భాగం ద్రవపదార్థాలకు, మిగతా మరో భాగాన్ని వాయువుకు విడవాలి. ఈ నిష్పత్తిలో భోజనం చేయడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం.
అయితే పెరుగును తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. కేవలం పెరుగును మాత్రమే తినకూడదు. పెరుగు తినదలచినవారు అందులో కొద్దిగా తేనెనుగాని, ఉసిరిక కలుపుకుని తినాలి. పెరుగును యథాతథంగా రాత్రిపూట తినడం నిషిద్ధం. పెరుగు గుణం వల్ల వాపును, కఫాన్ని పెంచుతుంది. అదే మజ్జిగ ఆ ప్రభావాన్ని తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

భోజనం తర్వాత ఈ పొరపాట్లు చేస్తున్నారా?

hand-washing-2
“అన్నం పరబ్రహ్మ స్వరూపం”.. సాక్షాత్తూ శ్రీ అన్నపూర్ణా దేవి ఆ పరమశివుడికి అన్నం ప్రసాదించింది. అదీ అన్నానికి ఉన్న గొప్పదనం. అందుకే భోజనం చేయడమంటే నోట్లోకి అన్నం వెళ్ళడమే కాదు.. వడ్డించడం నుంచి తిన్న తర్వాత చేసే పనులు కూడా భోజన ప్రక్రియలోకే వస్తాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అలాంటప్పుడు ఆహారం తినేప్పుడు మనం చేయకూడని పనుల గురించి మన ధర్మశాస్త్రాలు ఏం చెబుతున్నాయో? ఓ సారి తెలుసుకునేందుకు ప్రయత్నిద్ధాం.
భోజనం ఆరగించిన తర్వాత చేతులని కంచం లేదా పళ్లెంలో ఎట్టి పరిస్థితుల్లో కడుగరాదు. తిన్నాక కేవలం చేతులని వేరొక చోట మాత్రమే కడగాలి.
అన్నం ఆరగించిన కంచాన్ని ఎప్పుడూ కూడా తిన్నచోటే వదిలేయకూడదు.
అలాగే, భోజనం పూర్తయ్యాక ఎవరైనా చేసే పని కుడి చేతిని మాత్రమే కడగడం.. ఒక్క చేత్తోనే కదా తినేది రెండు చేతులు ఎందుకు అనే లాజిక్‌ని పాటిస్తారు. కానీ, భోజనం ఆరగించిన తర్వాత తప్పకుండా రెండు చేతులూ పరిశుభ్రంగా కడుక్కోవాలి.
చివరగా అన్నం ఆరగించి, చేతులు శుభ్రంగా కడిగిన తర్వాత చేతులతో పాటు.. మూతిని పరిశుభ్రమైన గుడ్డతో తుడుచుకోవాలి. అపుడే భోజనం పుష్టిగా ఆరగించినట్టు లెక్క.

గోంగూరలో ఏముందో తెలుసా?

gongurapappucopyrightedimage1
– గోంగూర తింటే చలవ చేస్తుంది అంటుంటారు. అయితే గోంగూర వల్ల ఎన్నో లాభాలున్నాయి. గోంగూరలో విటమిన్ ఎ, బి1, బి9, సి పుష్కలంగా ఉంది. పొటాషియమ్‌, కాల్షియమ్‌, ఫోస్పర్స్, సోడియం, ఐరన్ సమృద్థిగా ఉన్నాయి. దీనిలో ప్రోటీన్స్, కార్బోహైడ్రైట్స్ అధికంగా ఉండి క్రొవ్వు చాలా తక్కువగా ఉండును. ఆక్సలిన్‌ ఆసిడ్‌ ఉన్నందున కొంచెం వగరుగా ఉంటుంది.
గోంగూరలోని విటమిన్‌ ఎ కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. రేచీకటిని కూడా తగ్గిస్తుంది. చాలా తక్కువ కొవ్వు, క్యాలరీస్‌ ఉండి, మినరల్స్ విటమిన్స్ కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్ ఉన్నందున గోంగూర శరీర అధిక బరువు తగ్గించును. యాంటీ ఆక్సిండెంట్స్ సమపాళ్లలో ఉన్నందున చెడు కొలెస్ట్రాల్‌ని తొలగించి రక్తపోటుని సక్రమంగా ఉంచును.
ఒక కప్పు గోంగూర తాజా రసంలో మనిషికి ఒక రోజుకి కావాల్సిన విటమిన్‌ సి లో 53 శాతం లభించును. అందువల్ల గోంగూర చర్మ సంబంధమైన సమస్యలు పరిష్కరించును. ఎండిన గోంగూర ఆకులు పేస్ట్ చేసి గజ్జి, తామరపై రాసిన కొంతకాలానికి మంచి ఫలితం వస్తుంది. తాజా ఆకులు పేస్టు చేసి పేస్‌ప్యాక్‌‌లాగా వాడిన చర్మపు ముడతు తగ్గి గట్టిగా కాంతివంతం అవుతుంది.
గోంగూరని క్రమంగా వాడితే నిద్రలేమి, అధిక రక్తపోటు తగ్గును. ప్రతి రాత్రి నిద్రకు ముందు కప్పు గోంగూర రసం తాగితే మంచి నిద్రపడుతుంది. గోంగూర ఆకుల పేస్ట్ తలకు పట్టించి ఉదయం స్నానం చేస్తే వెంట్రుకలు ఊడడం తగ్గి బట్టతల రాకుండా కాపాడుతుంది. గోంగూరలోని కాల్షియమ్‌ ఎముకలు తగ్గిపడటంలో మంచి ఫలితం ఇస్తుంది.
ముఖ్యంగా మూడు పదులు దాటినా మహిళలు గోంగూర ఒక వరం. ఐరన్‌, సోడియం, పొటాషియం అధిక పాళ్ళలో ఉన్నందున గోంగూర క్రమంగా ఇతర ఆహారంతో కలిపి తీసుకున్నచో, మహిళలకు రుతుక్రమ సమయంలో తగ్గిన శక్తి వస్తుంది.

దంతపుష్టి కోసం వేరుశెనగ…

yer-fistigi-144838144030
వేరుశెనగపప్పులో పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటుంది. కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. వేరు శెనగమిక్కిలి బలవర్థకమైన ఆహారం. దీనిలో బి విటమిన్‌ కూడా అధికంగా ఉంటుంది. వేరుశెనగ గింజలను పాలను కూడా కొన్ని ఔషధాలలో ఉపయోగిస్తుంటారు.
పాలలో వేయించిన వేరు శెనగపప్పు, బెల్లం కలిపి పిల్లలకు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఆహారంగా ఇస్తుంటే మంచి టానిక్కులుగా పనిచేస్తాయి. పచ్చివేరుశెనగ పప్పులో కొంచెం ఉప్పు కలిపి తింటుంటే పండ్లు గట్టిపడడమే కాకుండా దంతాలపైన ఉండే ఎనామిల్‌ను కాపాడుతుంది.
లావుగా ఉండేవారు ఆహారానికి ఒక గంట ముందుగా గుప్పుడు వేరుశెనగపప్పులు తిని ఒక కప్పు కాఫీ గానీ టీ గానీ త్రాగితే ఆకలి మందగిస్తుంది. ఈవిధంగా ప్రతిరోజూ చేస్తుంటే కొద్దికాలంలో శరీర బరువు తగ్గిపోతుంది. జీర్ణశక్తి సరిగా లేని వారు పచ్చకామెర్లు వ్యాధి గల వారు వేరుశెనగపప్పును వైద్య సలహాలేకుండా తినకూడదు. గుండెజబ్బులవారు ఎక్కువ రక్తపోటు ఉన్నవారు వేరుశెనగలను ఎక్కువగా వాడరాదు.

చిలకడదుంపలు తింటే కలిగే మేలు ఏమిటి?

sweet-potato-istock
చౌకగా లభించే చిలకడదుంపలను తినటానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఈ దుంపలు పిండిపదార్థాలను కలిగి ఉండి, అధిక మొత్తంలో చక్కెరలను కలిగి ఉంటుంది. ఇవి పోషకాలను కలిగి ఉండటమే కాకుండా, వివిధ రకాలుగా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. చిలకడదుంప పొటాషియంను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇది హృదయ స్పందన మరియు నరాల సంకేతాలను నియంత్రిస్తుంది. మూత్రపిండాల వ్యాధులు, వాపులు, కండరాల తిమ్మిరులను పొటాషియం తగ్గిస్తుంది.
కడుపు (జీర్ణాశయంలో) ఏర్పరిచే అల్సర్‌లను తగ్గించి వేస్తాయి. ఫైబర్లను అధిక మొత్తంలో కలిగి ఉన్న, ఈ పిండి పదార్థాలతో కూడిన ఆహారం, అసిడిటీ సమస్యలను మరియు మలబద్దకం వంటి వాటిని కలుగకుండా చూస్తాయి. విటమిన్ ‘ఎ’, యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉండి, క్యాన్సర్ కలుగచేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేయటమే కాకుండా ఈ దుంపలలోని అతినీలలోహిత కిరణాల వలన కలిగే ప్రమాదాల నుండి, మరియు వీటి వలన ప్రమాదానికి గురైన కణాలను భర్తీ చేయటానికి ఈ విటమిన్ సహాయపడుతుంది.
చిలకడ దుంప, శరీర రక్తంలో తెల్ల రక్తకణాలను మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని అధికం చేసి, ఒత్తిడిని తగ్గిస్తుంది. చిలకడ దుంప, విటమిన్ ‘డి’ని పుష్కలంగా కలిగి ఉండటం వలన రోగనిరోధక శక్తిని మెరుగుపరచి, మానసిక కల్లోలాలను తగ్గించి, శక్తిని పెంచి, ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. గుండె కండరాలు బలంగా ఉండేలా నిర్మిస్తుంది. చిలకడదుంప పుష్కలమైన విటమిన్ ‘సి’ కలిగి ఉండి, జలుబు మరియు ఫ్లూలను తగ్గించటమేకాకుండా, దంతాలు, ఎముకల ఏర్పాటు, రక్త కణాల మరియు కొల్లజన్ ఉత్పత్తిలను పెంచుతుంది. కొల్లాజన్ చర్మ కణాలకు స్టితిస్థాపకతను చేకూర్చి ఒత్తిడి మరియు క్యాన్సర్ వ్యాధిని కలుగచేసే కారకాల చర్యలను అడ్డుకుంటుంది.

ఆస్తమా పేషంట్స్ తీసుకోకూడని ఆహారాలు…

download (17)

ఆస్తమా పేషంట్స్ మాంసం, ఎగ్స్, పాల ఉత్పత్తులు, ఫిష్, పోర్క్ మరియు బీఫ్ వంటివి తీసుకోకూడదు. ఇవి శ్వాసలో మరింత సమస్య తీసుకొస్తాయి.

కొన్ని రకాల పచ్చళ్లలో సల్ఫైట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్రీతింగ్‌కి మరింత ప్రాబ్లమ్ తీసుకొస్తాయి. కాబట్టి ఆస్తమాతో బాధపడేవాళ్లు పచ్చళ్లు తీసుకోకూడదు.

సోడియంకి దూరంగా ఉండటం చాలా అవసరం. అలాగే మోనోసోడియం గ్లూటమైట్ అనేది శ్వాస తీసుకోవడంతో ఇబ్బందికి కారణమవుతుంది. కాబట్టి ఆస్తమాతో బాధపడేవాళ్లు దీనికి దూరంగా ఉండటం మంచిది.

సాఫ్ట్ డ్రింక్స్‌లో ఉండే కొన్ని రకాల పదార్థాలు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి. కాబట్టి ఆస్తమా పేషంట్స్ ఎట్టిపరిస్థితుల్లో ఈ డ్రింక్స్ తీసుకోకూడదు.

ఫ్రెంచ్ ఫ్రైస్, ప్యాక్ చేసిన ఆలూ చిప్స్‌లో సల్ఫైట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఆస్తమా పేషంట్స్ తీసుకోకూడదు.

ఆస్తమాతో బాధపడేవాళ్లు ఆల్కహాల్ తీసుకుంటే సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎలాంటి ఆల్కహాల్ అయినా దూరంగా ఉండటం మంచిది.

విశ్రాంతితో ఆరోగ్యానికి మేలెంతో తెలుసుకోండి…

images (5)
విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. విశ్రాంతి టెక్నిక్స్ వల్ల హార్ట్ రేట్ తగ్గుతుంది. కాబట్టి హెల్దీ హార్ట్‌ను కోరుకుంటున్నట్లైతే శరీరానికి రెగ్యులర్‌గా విశ్రాంతి అందివ్వడం మంచిది. ప్రతి రోజూ అలసిన శరీరానికి తగినంత విశ్రాంతిని అందివ్వడం వల్ల స్ట్రెస్ హార్మోన్లు కంట్రోల్ అవుతాయి. ఒత్తిడి తగ్గించుకొన్నట్లైతే శరీర, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది
విశ్రాంతి తీసుకోవడం వల్ల కండరాలు వదులవుతాయి. తద్వారా అలసట ఆవహిస్తుంది. ప్రతి రోజూ విశ్రాంతి తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది. రోజూ ఎనిమిది గంటల పాటు నిద్రతో పాటు ఒత్తిడిని సునాయాసంగా అధిగమించే తత్త్వం ఉంటే.. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. అంతేగాకుండా ఏకాగ్రత పెంచుకోవచ్చు. విశ్రాంతి తీసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగవుతుంది.

కొబ్బరి పాలతో క్యాన్సర్‌కి చెక్…

images

కొబ్బరి పాలలో ఉండే ఖనిజాలు క్యాన్సర్ ని అరికడతాయి. ప్రేగు క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ లను నివారించడానికి సహాయపడుతుంది. క్యాన్సర్ సెల్స్ అభివృద్దిని నిరోధించగల యాంటియాక్సిడెంట్ గా పనిచేస్తుంది. కాబట్టి తరచుగా కొబ్బరిపాలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

మెదడు చురుగ్గా పని చేయడానికి చిట్కాలు…

download (1)

చేపలు, అక్రోట్ కాయలు, విటమిన్ సమృద్ధిగా లభించే బొప్పాయి, నిమ్మ జాతి పండ్లు తినాలి. విటమిన్ E పుష్కలంగా ఉండే గుడ్లు, బాదం, ఆకుకూరలు బాగా తీసుకోవాలి.

చక్కటి సంగీతం వినాలి, లేత ఎండలో రోజూ కాసేపు గడపాలి, బొమ్మలు వేయడం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం, యోగా చేయడం వల్ల కూడా మెదడు చురుగ్గా పని చేస్తుంది.

అన్నింటికీ మించి కంటినిండా హాయిగా నిద్రపోవాలి.