Archive for the ‘ఇంటి మెరుగుదలకు చిట్కాలు’ Category

ఈగలకు చెక్ పెట్టాలంటే…

01.jpg072893c9-ab03-4841-bf3d-076fbe86cb1dLarger
వర్షాకాలంలో ఈగలకు చెక్ పెట్టాలంటే.. తులసి కొమ్మల్ని వంటగది, డైనింగ్ టేబుల్ వద్ద ఉంచాలి. ఒకవేళ తాజా కొమ్మలు దొరక్కపోతే ఎండిపోయిన ఆకుల్ని మస్లిన్‌ వస్త్రంలో ఉంచి వేలాడదీస్తే సరిపోతుంది. అలానే లావెండర్‌, తమలపాకులూ, పుదీన వంటివి కూడా ఈగల్ని పారదోలతాయి.

షవర్‌హెడ్‌ను శుభ్రం చేయడానికి సులువైన మార్గం…

download (15)

షవర్‌హెడ్‌లో ఏదో అడ్డుపడినట్లయి, నీళ్ళు సరిగ్గా  రానట్లైతే అలాంటప్పుడు దాన్ని ఊడదీసి, రాత్రి తెల్లవార్లూ వెనిగర్‌లో ముంచి ఉండాలి. తెల్లవారాక బలమైన బ్రష్‌తో దాన్ని రుద్దాలి.

వేపనూనె, కర్పూరంతో దోమలు పరార్…

mosquito-illustration_360x286
దోమలతో డెంగ్యూ వంటి జ్వరాలు వచ్చేస్తున్నాయి. వర్షాకాలం వచ్చేసిందంటే.. ఇక దోమల బాధ తాళలేక గుడ్ నైట్లు, ఆలౌట్లకు నెల పొడవునా భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నారా? అయితే ఇక అలాంటి దోమల లిక్విడేటర్లకు గుడ్ బై చెప్పేయండి. ఎలాగంటే.. ముందుగా పచ్చకర్పూరాన్ని లిక్విడేటర్ బాటిల్‌లో వేసి ఆపై అందులో వేపనూనెను పోయండి. తర్వాత బాటిల్‌కు మూతపెట్టి.. ప్లగ్గులో పెట్టండి. అంతే దోమల బెడద ఉండదు.
అలాకాకుంటే.. కప్పు వేప నూనెలో మెత్తగా పొడి చేసిన కర్పూరం వేయాలి. ఈ మిశ్రమాన్ని దోమల రిపెల్లెంట్‌లో ఉంచి.. ప్లగ్‌లో పెట్టుకోవాలి. గదిలో దోమలూ, ఇతర పురుగులు ఉంటే వెంటనే చనిపోతాయి.

కిచెన్ టవల్స్ శుభ్రం చేయడానికి సులభ చిట్కాలు…

images

కిచెన్ టవల్స్ ను మరింత శుభ్రంగా ఉతకాలంటే, వేడి నీళ్ళలో నానబెట్టి, తర్వాత శుభ్రం చేయడం ఉత్తమ పద్దతి. వేడి నీళ్ళలో నానబెట్టిన తర్వాత డిటర్జెంట్ తో ఉతికి, ఎండలో ఆరబెట్టుట వల్ల మురికి మరియు దుర్వాసన పోయి తాజాగా ఉంటాయి. వీటిని శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా లేదా వెనిగర్ ను ఉపయోగించవచ్చు.

కిచెన్ టవల్స్ ను శుభ్రం చేయడానికి మరో ఉత్తమ చిట్కా. మరకలను వదిలించే మంచి క్లీనర్ ను ఉపయోగించాలి. వాటిని శుభ్రం చేయడానికి ముందు కొంత సమయం క్లీనర్ లో నానబెట్టి, తర్వాత బ్రష్ వేసి శుభ్రం చేయాలి.

బ్లీచింగ్ మరియు సోడియం బైకార్బోనేట్ లో రాత్రంత నానబెట్టి, తర్వాత శుభ్రం చేసి, ఎండలో ఆరబెట్టాలి. దాంతో కిచెన్ టవల్స్ క్లీన్ గా మంచి సువాసనతో ఉంటాయి.

సెల్లో టేప్‌ను ఇలానూ వాడొచ్చు…

mexim-cello-tapes-multi-colour-packaging-and-marking-48mm-400x400-imae3xzreaqyzayf

గోడలకు పోస్టర్లు అంటించడానికి, విద్యుత్ తీగల అతుకలను కప్పి ఉంచడానికి ఎక్కువగా ఉపయోగించే టేపును ఇంకా చాలా విధాలుగా ఉపయోగించొచ్చు.

– స్టైన్‌లెస్ గ్లాసులు, మూతలు ఇలా ఇతరత్రా వస్తువులు కొన్నపుడు వాటి మీద స్టిక్కర్‌లు అంటించి ఉంటాయి. వాటిని మాములుగా తీసేస్తే ముక్కలు ముక్కలుగా వచ్చేసి, స్టిక్కర్‌కు ఉన్న జిగురు పాత్రల మీద మిగిలిపోతుంది. అలా కాకుండా చక్కగా స్టిక్కర్ ఊడి వచ్చెయ్యాలి అంటే దాని మీద టేపు అంటించి బలంగా లాగితే దానికున్న స్టిక్కర్ ఊడి వస్తుంది.

– ఇంట్లో గాజు వస్తువులు పగిలిపోతే పెద్ద పెద్ద ముక్కలను తీసేస్తాం. కాని కంటికి కనిపించని చిన్న గాజు ముక్కల్ని ఏరి వేయలేము. అలాంటపుడు కాస్త వెడల్పుగా ఉండే టేపుని తీసుకుని గాజు పగిలిన చోట అలికినట్లు అద్దాలి. ఆలా చేస్తే జిగురుకు గాజు పలుకులు అంటుకు పోతాయి.

– ఇంటి గోడలకు రంధ్రాలు పడినపుడు అందులోకి చీమలు, పురుగులు దూరిపోతుంటాయి. ఆ సమస్యను అరికట్టాలంటే రంధ్రంలో పేపర్లు దూర్చి బయట టేపుతో మూసెయ్యాలి. మర్నాడు టేపు చక్కగా అంటుకున్నాక గోడలకు వేసే పెయింట్ తీసుకుని టేపు మీద వేస్తే సరిపోతుంది.

బెడ్ ఎంపిక చేసుకోవడానికి ముందు గమనించాల్సిన విషయాలు…

images (82)

మీరు పరుపులు ఎన్నుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ ఇవ్వబడ్డాయి…

1. ఇప్పటికే ఉన్న మీ పరుపు వయస్సు(గడువు): మీరు నిద్రపోయేటపుడు సమస్యగా ఉంటే, ఆ సమస్య మీ పరుపులో లేదు, దాని వయసులో ఉండవచ్చు. ప్రతి పరుపుకి గడువు తేదీ ఉంటుంది. కొంత సమయం అయిన తరువాత, పరుపులు వాటి సహజ సౌకర్య నాణ్యతను ఎక్కువకాలం కలిగి ఉండవు.

2. మీరు నిర్ధారించుకునే ముందు పరీక్షించండి: ఒకసారి మీ మనసు నిర్దిష్ట పరుపుపై ఉన్నట్లయితే, కనీసం 10 నుండి 15 నిముషాలు దానిపై కూర్చుని ప్రయత్నించండి. దీనివల్ల దాని సౌకర్యాన్ని, మన్నికను తెలుసుకోవచ్చు. కొనుగోలులో పెద్ద హడావిడి పడొద్దు, అమ్మకందారుని ప్రభావం వల్ల మీరు నిర్ణయం తీసుకోవద్దు.

3. అన్ని ఎంపికలని, వ్యత్యాసాలని తనిఖీ చేయండి: పరుపు సంస్ధ, దాని అందమైన శైలి, పైన ది౦డుతో కలిసి ఉందో లేదో, దాని బ్రాండ్ హామీ అన్నీ చూడండి. మధ్యవర్తి ద్వారా నిర్ణయం తీసుకోవద్దు. నిజమైన పరుపుల దుకాణంలో కొనుగోలు చేయండి.

4. డిపార్టుమెంటు స్టోర్ లో కొనుగోలు మానండి: పరుపుల దుకాణంలోని అమ్మకందారులు సాధారణంగా బాగా శిక్షణ పొంది ఉంటారు, మీరు సరైన ఎంపిక చేసుకోవడానికి వారి నైపుణ్యం ఎంతో సహాయ పడుతుంది.

5. వారెంటీ తనిఖీ చేయడం మరిచిపోవద్దు: మంచి పరుపులకు కనీసం 10 సంవత్సరాల ‘పూర్తి’ వారెంటీ లేదా ‘నాన్-ప్రోరేటేడ్ వారెంటీ’ ఉంటుంది.

ఐస్ క్యూబ్ ట్రే వల్ల ఉపయోగాలు…

images (75)

పిల్లలవి చెవిపోగులూ, ఉంగరాలూ, హారాలూ..ఒకేచోట పెడుతుంటే ఒకదానితో ఒకటి కలసి చిక్కుపడిపోతున్నాయ? పాత ఐస్ క్యూబ్ ట్రే ని పారేయకుండా ఈ ఆభరణాలని విడివిడిగా ఉంచుకోవడానికి ఉపయోగించుకోండి..వెతుక్కోవాల్సిన శ్రమ ఉండదు, సమయం కూడా ఆదా అవుతుంది.

అలాగే మనం ఇంట్లో వివిధ హస్తకళాకృతులు చేయడానికి ఉపయోగించే రంగురంగుల కుందన్స్, బటన్స్, స్టోన్స్, బీడ్స్..మొదలైనవన్నీ విడిగా జాగ్రత్తగా ట్రేల్లో భద్రపరచుకోవచ్చు.

విండో గ్రిల్స్ నీట్ గా క్లీన్ గా ఉంచే కొన్ని సింపుల్ టిప్స్…

images (53)

1. బ్రషింగ్ : విండో గ్రిల్స్ కు పట్టిన దుమ్ము మరియు ధూళి తొలగించడానికి ఒక మృదువైన bristle బ్రష్ తీసుకోవాలి. అందుకు మీరు డస్టర్ లేదా మృదువైన వస్త్రం ఉపయోగించవచ్చు. నీళ్ళతో కడగడం లేదా తుడవడానికి ముందు దుమ్ము, ధూళిని తొలగించడం చాలా ముఖ్యం.

2. తుడవడం: విండో గ్రిల్స్ కు డస్ట్ ను తొలగించడానికి బ్రషింగ్ చేసిన తర్వాత, నాణ్యమైన సోపును లేదా సోప్ వాటర్ ను గ్రిల్స్ కు రాయాలి. తర్వాత మెత్తటి కాటన్ క్లాత్ ను ఉపయోగించి శుభ్రంగా తుడవాలి. వాటి మీద ఎటువంటి గీతలు పడకుండా తుడవాలి. దుమ్ము ధూళి చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లైతే సబ్బులను ఉపయోగించవచ్చు.

3. వాటర్ అండ్ వెనిగర్: గ్రిల్స్ అంతగా మురికి పట్టకుండా ఉంటే అందుకు వెనిగర్ మరియు నీళ్ళను ఉపయోగించి తుడవచ్చు. విండో గ్రిల్స్ శుభ్రం చేయడానికి వెనిగర్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

4. చేతి తొడుగులు: విండో గ్రిల్స్ శుభ్రం చేసే ముందు చేతులకు కాటన్ హాడ్ సాక్స్ లను తొడుగులను తొడుగుకోవాలి. దాంతో మీరు శుభ్రం చేయాడానికి సులభం అవుతుంది.

5. వేడి నీళ్ళు: విండో గ్రిల్స్ నుండి డస్ట్ మరియు ఏదైన అంటుకొన్న పదార్థాలను తొలగించడానికి వేడి నీళ్ళు చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా మీ వంటగది విండోను శుభ్రం చేయాడానికి ఈ పద్దతి బాగా సహాయపడుతుంది. కాటన్ క్లాత్ ను వేడినీటిలో ముంచి తర్వాత విండో గ్రిల్స్ ను తుడవాలి.

6. రసాయనాలు ఉపయోగించకూడదు: విండోకు పట్టిన దుమ్ము,ధూళి తొగించడానికి ఎటువంటి కఠినమైన రసాయనాలను ఉపయోగించకూడదు. ముఖ్యంగా ఐరన్ విండ్ గ్రిల్స్ ను రసాయనాలను ఉపయోగించకూడదు. లేదంటే అవి తుప్పు పట్టడానికి దారితీస్తుంది. కాబట్టి అందుకు తేలికపాటి డిటర్జెంట్స్ ను ఉపయోగించండి.

వాషింగ్ మిషన్ శుభ్రం చేయడానికి సులభ చిట్కాలు…

images (95)

మీ వాషింగ్ మెషీన్ చూడటానికి కొంచెం అధ్వాన్నంగా ఉంటే, మీరు ఈ క్రింద ఇచ్చిన చిట్కాలతో తిరిగి జీవం తీసుకురండి.

1. డిటర్జెంట్ సొరుగు శుభ్రం: డిటర్జెంట్ సొరుగు పురుగుల స్వర్గంగా, ఇరుక్కుపోయిన వాషింగ్ పౌడర్ తో అచ్చుగా ఉంటుంది. సాధ్యమైతే, మొత్తం సొరుగును బయటకు తీసి మరియు ఒక పాత టూత్ బ్రష్ తో శుభ్రం చేసి తిరిగి పెట్టండి. ఒక సాధారణ గృహ క్లీనర్ అయితే ఇంకా సులభంగా ఉంటుంది.

2. ఫిల్టర్ ను అన్ బ్లాక్ చెయ్యండి: ఈ ఫిల్టర్ వెచ్చని మరియు తేమతో కూడి ఉంటుంది కనుక, దీనిలో కూడా పురుగులు ఎక్కువ జమ అవుతాయి. దీనిని ఎప్పటికప్పుడు ఖాళీగా ఉంచండి మరియు లోపలి చెత్త తీసేయండి మరియు లోపల జమ అయిన మురికిని అంతా తీసేయండి.

3. డ్రమ్ శుభ్రపరచండి: మీకు వాషింగ్ మషీన్ లోపలిభాగం శుభ్రంగా మెరుస్తూ కనపడినా, దీనిలో ఉన్న రంధ్రాలలో మరియు పగుళ్ళలో పురుగులు ఉంటాయి. నెలలో రెండుసార్లు దీనిని ఖాళీగా ఉంచి వాష్ రన్ చేయటం మంచిది. దీనిని శుభ్రపరచటానికి సోడా స్పటికాలు లేదా డిష్వాషర్ మాత్రలు ఉపయోగించండి మరియు వేడినీటి వాష్ (ప్రాధాన్యంగా 60 డిగ్రీల వరకు)చేయండి. ఇలా చేయటం వలన పురుగులు చస్తాయి, చెడు వాసనలు తొలగిపోతాయి మరియు సబ్బు తెట్టే తొలగిపోతుంది మరియు లైంస్కేల్ తొలగిపోతుంది.

4. దుర్వాసనలను తొలగించండి: దుస్తులు ఉతికిన తరువాత బయటి గాలి డ్రం లోపలికి వెళ్ళేట్లుగా వాషింగ్ మషీన్ డోర్ కొద్దిగా తెరిచి ఉంచండి. దీనివలన పురుగుల ఉత్పత్తిని అరికట్టవొచ్చు.

5.సరి అయిన డిటర్జెంట్ పౌడర్ వాడండి: పౌడర్ కాకుండా ద్రవరూపంలో ఉపయోగించండి. ఇలా ఉపయోగించటం వలన ద్రవంలో అదనంగా సడ్స్, సున్నితత్వం ఉంటాయి మరియు డ్రంలో ఇర్రుక్కుపోయి దుర్వాసన రావటం ఉండదు.

కఠిన మరకలను సులువుగా వదిలించే నెయిల్ పాలిష్ రిమూవర్…

images (94)

బేస్డ నెయిల్ పాలిష్ రిమూవర్:

టైల్స్ క్లీనింగ్: 

మీ ఇంట్లో టైల్స్ చాలా డర్టీగా మారి ఉంటే, చూడటానికి చాలా అసహ్యంగా ఉన్నా అటువంటి ప్రదేశంలో కొద్దిగా నెయిల్ పాలిష్ రాయడం వల్ల దుమ్ము, దూళి ఏర్పడ్డ మరకలు మాయం అయిపోతాయి.

ఇంక్ (సిరా )మరకల్ని అతి సులభంగా పోగొడుతుంది:

ఇంక్ మరకలను పోగొట్టడానికి వివిధ రకాల ఉపాయలే ఉన్నాయి. ఇంక్ మరక ఉన్న ప్రదేశంలో నీళ్ళు, సోపు, వేయడం వల్ల ఆ ప్రదేశంలో బ్లూ లేదా బ్లాక్ లేదా రెడ్ కలర్ లోనికి మారిపోతుంది. కాబట్టి నెయిల్ పాలిష్ రిమూవర్ అప్లై చేయడం వల్ల ఈ మరకలను తొలగించడానికి చాలా సులభం అవుతంది.

పర్మనెంట్ మార్కర్ పెన్ మరకలను తొలగించడానికి:

సాధారణంగా ఆఫీస్ బోర్డ్ మీద మనం ఉపయోగించేటటువంటి పర్మనెంట్ మార్కర్ పెన్ తో గ్లాస్ మీద పెయింటింగ్ చేయడం వల్ల భయపడాల్సిన పనిలేదు. దానికి నెయిల్ పాలిష్ రిమూవర్ ను కొద్దిగా రాస్తే సరిపోతుంది. నెయిల్ పాలిస్ రిమూవర్ తో సులభంగా తొలగించవచ్చు.

మెటల్ ప్రొడక్ట్స్:

మెటల్ తో తయారు చేసినటువంటి వస్తువులు చాలా త్వరగా తుప్పు పడుతుంటాయి. తుప్పు, ఫన్గూ, మరియు బ్యాక్టీరియాను నెయిల్ పాలిష్ రిమూవర్ తొలగిస్తుంది. మెటల్ వస్తువులు మిలమిల మెరవడానికి ఇదొక చక్కటి అవకాశం. కాబట్టి నెయిల్ పాలిస్ రిమూవర్ ను ఉపయోగించే ఇటువంటి చిన్నచిన్న ప్రయోజనాలను గ్రహించండి.