Archive for the ‘ఇంటి మెరుగుదలకు చిట్కాలు’ Category

కంట్లో నీళ్ళు రాకుండా ఉల్లిపాయలు తరగడం ఎలా…

download (11)

నీళ్ళలో వేయాలి: ఉల్లిపాయ పొట్టు తీసిన తర్వాత నీటిలో వేయడం అందరికీ తెలిసిందే. అయితే వీటిని సగానికి ముక్కలుగా కోసిన తర్వాత నీటిలో వేయడం మంచిది. దీనివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

గాలి ప్రసరించే చోట: గాలి బాగా ప్రసరించే చోట మాత్రమే ఉల్లిపాయలను కోయాలి. అలాగని ఫ్యాక్ కింద కూర్చుని కోయడం కూడా మంచిది కాదు. కిచెన్ లో ఉల్లిపపాయలు కోస్తున్నప్పుడు ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ కి దగ్గరలో నిల్చుంటే కళ్లు ఎక్కువగా మండకుండా ఉంటాయి.

ఫ్రిజ్ లో : కోసే ముందు ఉల్లిపాయలను కాసేపు ఫ్రిజ్ లో పెట్టడం ద్వారా కూడా కంటి నుంచి నీరు రాకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయల్లో ద్రవరూపంలో ఉన్న రసాయనాలు గడ్డకట్టడం వల్ల వాటిని కోసినప్పుడు అవి తక్కువగా విడుదలవుతాయి.

చాపింగ్ బోర్డ్: సగానికి తరిగిన ఉల్లిపాయను చాపింగ్ బోర్డుపై బోర్లించడం ద్వారా కూడా రసాయనాల విడుదల తగ్గి కంటి నుంచి నీరు రాకుండా ఉంటుంది.

కొద్దిగా వేడిగా ఉండేలా: ఉల్లిపాయలు కోసే ప్రదేశంలో ఒక కొవ్వొత్తిని వెలిగించినా కూడా కంటి నుంచి నీరు రాకుండా ఉంటుంది. మండుతున్న గ్యాస్ స్టౌవ్ కి దగ్గరగా ఉల్లిపాయల్ని కోసినా కళ్లు మండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఉల్లిపాయ కట్ చేసేప్పుడు ఈ చిట్కాలు పాటించండి..కన్నీళ్ళకు చెక్ పెట్టండి.

గ్యాస్ సిలిండర్లు ఉపయోగించే వారికోసం ముఖ్యమైన జాగ్రత్తలు…

images (2)

గ్యాస్ సిలిండర్ ను ట్రాన్స్ పోర్ట్ చేయడం: గ్యాస్ సిలిండర్ ను ట్రాన్స్ పోర్ట్ చేయడానికి ఒక సమయం అంటూ ఉంటుంది. కొన్ని రకాల సిలిండర్లను వినియోగించేటప్పుడు సురక్షితంగా ఏవిధంగా ఉపయోగించాలి, అందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటి అని తెలుసుకోవాలి. గ్యాస్ సిలిండర్ ను తరలించేటప్పుడు నిలువుగా ఉంచాలి . సిలిండర్ ను ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి తరలించడానికి ముందు క్యాప్స్ మరియు కవర్స్ కరెక్ట్ గా ఫిట్ చేసి ఉండాలి . ఇలా చేయడం వల్ల ఏదైన దుమ్ము, ధూళి వాల్వ్ లోనికి ప్రవేశించకుండా ఉంటుంది.

నిల్వచేసే ప్రదేశం : గ్యాస్ సిలిండర్ ను అవసరం ఉన్నప్పుడు మాత్రం నిల్వచేసుకోవడం చాలా ముఖ్యం. వాతావరణం పొడిగా మరియు సురక్షితంగా ఉండే ప్రదేశంలో సిలిండర్ ఉంచడం క్షేమకరం. ముఖ్యంగా గాలి వెలుతురు బాగా ప్రదేశించే స్థలంలో ఉండటం మంచిది. గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రదేశంలో ఎటువంటి వేడి వాతావరణం కలిగించకూడదు. అలాగే సిలిండర్ ఉన్న ప్రదేశంలో బయటి నుండి కూడా వేడి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా గ్యాస్ సిలిండర్ ఇంట్లో సురక్షితంగా నిల్వచేయడానికి సహాయపడే కొన్ని జాగ్రత్తలు. సూచనలు.

ట్యూబ్స్ మరియు రెగ్యులేటర్స్: అన్ని రకాల ట్యూబ్స్ మరియు రెగ్యులేటర్స్ సరిగా ఉన్నాయో లేదో అప్పుడప్పుడు గమనిస్తుండాలి . ఒక్కో సందర్భంలో లీక్ అవుతుంటాయి . సిలిండర్స్ వినియోగించేటప్పుడు పీరియాడిక్ మెయింటెనెన్స్ చాలా అవసరం మరియు మంచిది కూడా. మరో ముఖ్యమైన విషయం ట్యూబ్స్ ను తరచూ మార్చుతుండాలి. పాతబడిన లేక విరిగిపోయిన గ్యాస్ పైప్ లను(రబ్బర్ ట్యూబ్ లను) వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు సంవత్సరాలకు మించి రబ్బర్ ట్యూబ్ ను వాడకూడదు.

మీ బుక్ షెల్ఫ్‌ను అమర్చుకోండి ఇలా…

images (22)

మీరు ఒక పుస్తకాల పురుగు అయి ఉండి, ఆ పుస్తకాలను ఎలా నిర్వహించాలో తెలియకపోతే, మీ ఇల్లంతా ఖచ్చితంగా టన్నుల కొద్ది పుస్తకాలతో నిండి ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న పుస్తకాలను చిన్ని చిన్ని చిట్కాలను పాటించి చక్కగా అమర్చుకుందాము.

అక్షర క్రమంలో అమరిక: రచయత యొక్క మొదటి అక్షర క్రమంలో పుస్తకాలను అమర్చుకోవడం ఉత్తమమైన, సులభమైన పద్దతి.

కళల ప్రకారం అమరిక: కళల ప్రకారం పుస్తకాలను అమర్చుకోవడం మరియొక ఉత్తమమైన పద్దతి. హాస్యాలను, థ్రిల్లర్‌లను, కావ్యాలను, భక్తి ప్రవచనాలను, సస్పెన్స్‌లను ఇలా విభాగాలుగా పుస్తకాలను అమర్చుకోవాలి. మీ మూడ్‌ను బట్టి పుస్తకాన్ని ఎంచుకోవడానికి ఈ పద్దతి ఉపయోగ పడుతుంది.

రంగుల ప్రకారం అమరిక: పుస్తకాల రంగుల ప్రకారం వాతిని వివిధ విభాగాలగా అమర్చితే ఇంట్లో ఇంద్రధనస్సులాగా అందంగా కనపడుతుంటాయి.

స్పాంజ్ తో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు…

images

ప్లాంట్ కంటైనర్ లో ఉపయోగించాలి: మొక్కలు పెట్టిన కుంపటి క్రింద స్పాంజ్ ఉంచడం వల్ల మొక్కలకు పోసే నీరు కుంపటి నుండి లీక్ అయినప్పుడు, స్పాంజ్ ఆనీటిని పీల్చుకొంటుంది. దాంతో ఫ్లోర్ మీద మట్టి మరకలు పడకుండా సహాయపడుతుంది. అంతే కాదు, స్పాంజ్ లోని నీరు మొక్కను ఎప్పుడూ తేమగా ఉండేలా చేస్తుంది.

గ్లాస్ వేర్ ను ప్రొటెక్ట్ చేస్తుంది: ఇంట్లో ఏవైనా గాజు వస్తువులు పగిలినప్పుడు, వాటిని తొలగించడానికి స్పాంజ్ చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. అలాగే గాజు వస్తులను ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మీరు మార్చాలనుకున్నప్పుడు, స్పాంజ్ ఒక కుషన్ లాగా పనిచేస్తుంది. పగిలిపోకుండా ఉంటాయి.

మీ కార్పెట్ ను శుభ్రం చేస్తుంది: మీ ఇంట్లో పెట్స్ ఉన్నట్లైతే, కార్పెట్ మీద పెంపుడు కుక్కల యొక్క బొచ్చు పడినప్పుడు , స్పాంజ్ తో తుడిస్తే చాలా సులభంగా తొలగిస్తుంది.

గీతలు పడకుండా నివారిస్తుంది: మన ఇంట్లో కనుక, ఒక మంచి మోడ్రన్ గ్లాస్ టీ పాయ్ ఉన్నప్పుడు, దాని మీద ఫ్లవర్ వాజ్ గీతలు పడకుండా ఉండాలంటే పల్చగా ఉండే స్పాంజ్ ను పెట్టి, దాని మీద ఫ్లవర్ వాజ్ ను అమర్చుకోవచ్చు. దాంతో గీతలు పడకుండా కొత్తవాటిలా ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి.

టేబుల్ ను శుభ్రం చేస్తుంది: డైనింగ్ టేబుల్, మరియు ఇతర టేబుల్స్ కూడా శుభ్రంచేస్తుంది. క్లాత్ ను శుభ్రం చేయడం కంటే, స్పాంజ్ తో మరింత శుభ్రంగా క్లీన్ చేయవచ్చు. టేబుల్ మీద చాలా శుభ్రంగా క్లీన్ అవుతుంది. అయితే క్లాత్ తో శుభ్రం చేస్తే వాటిని శుభ్రం చేయడానికి కొంత ఒత్తిడి, కష్టంతో కూడిన పని.

సాఫ్ట్ టాయిస్ ను శుభ్రం చేయడానికి సులభ మార్గాలు…

images (1)

1. ముందుగా వదులుగా ఉండే పార్ట్స్: హ్యాండ్ వాష్ చిట్కాలో ఇది ఒక ముఖ్యమైనది, మీ పిల్లలకు ఇష్టమైన బొమ్మలు ఏమైనా మరమ్మత్తులు చేయాల్సి ఉందేమో గమనించాలి . ఏదైనా పార్ట్స్ వదులుగా ఉంటే, వాటిని టైట్ చేసి తర్వాత వాటిని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

2. వాటిని కొత్తవాటిలా మెరిపించాలి: మీ సాఫ్ట్ టాయ్ క్లీన్ గా మరియు కొత్తవాటిలా మెరిపించాలంటే, 3చెంచాలా బేకింగ్ పౌడర్, రెండు చుక్కల పుదీనా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ ద్రవాన్ని బొమ్మమీద చిలకరించి, తర్వాత బ్రెష్ తో రుద్ది కడగాలి. ఇలాంటి సాఫ్ట్ బొమ్మలను శుభ్రంగా ఉంచడంలో బేకింగ్ సోడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

3. దుమ్మ దులపడం: సాఫ్ట్ బొమ్మలను శుభ్రం చేయడానికి ముందుగా డస్ట్ దులపాల్సి ఉంటుంది. అందుకు వాక్యూమ్ క్లీనర్ ను ఉపయోగించాలి. హ్యాండిల్ బ్లో డ్రయ్యర్ ను ఉపయోగించడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

4. హోం మేడ్ క్లీనర్: డస్ట్ తొలగించిన తర్వాత హ్యాండ్ వాషింగ్ చిట్కాను అనుసరించాలి. బొమ్మల మీద ఏర్పడ్డ మరకలను తొలగించడానికి హోం మేడ్ క్లీనర్ బాగా ఉపయోగపడుతుంది. అందుకు 3చెంచాల డిష్ సర్ఫ్ లిక్విడ్ ను , 1/4చెంచా అమ్మోనియం మరియు 3/4నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ లిక్విడ్ ను అప్లై చేసి టూత్ బ్రష్ తో కడిగి శుభ్రం చేయాలి. తర్వాత నీళ్ళతో కడిగి శుభ్రం చేయాలి.

5. డిటర్జెంట్ సోప్: తర్వాత డిటర్జెంట్ సోప్ తో శుభ్రం చేసి కడిగేయాల్సి ఉంటుంది. సాఫ్ట్ టాయ్స్ ను శుభ్రం చేయడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

6. వెనిగర్: రెగ్యులర్ క్లీనింగ్ లో మరో పద్దతి. వెనిగర్ క్లీనర్. ఒక బౌల్ల్ వాటర్ లో కొద్దిగా వెనిగర్ మిక్స్ చేసి తర్వాత బొమ్మలకు అప్లై చేసి తర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి.

మీ మార్బల్ ఫ్లోరింగ్ గురించి జాగ్రత్త తీసుకోండి…

images (81)

మార్బల్ ఫ్లోర్ మిళమిళ..తళతళ మెరవాలంటే…

మార్బుల్‌ ఫ్లోర్‌పై మరకలు పడితే బేకింగ్‌ సోడా, బ్లీచ్‌ కలిపి పేస్ట్‌లాగా తయారు చేసి మరకల్ని పూర్తిగా కవర్‌ చేస్తూ రాయాలి. తరువాత దానిమీద తడి వస్త్రం కప్పి రాత్రంతా అలా ఉంచేసి ఉదయాన్నే తుడిచేయాలి. మరక ఇట్టే పోతుంది.

పాలరాతి నేలల మీద ద్రవాలు కానీ ఆహార పదార్ధాలు గానీ ఒలికితే, ఉపరితలం మీద అవి చెరగని మరకలు పడిపోతాయి. అందువల్ల పొరపాటున ఏవైనా పళ్ళ రసాలు, కూల్ డ్రింక్ లు లేదా టీ పాలరాతి నేల మీద పడితే, వెంటనే హైడ్రోజన్ పెరాక్సైడ్, అమ్మోనియా కలిపిన మిశ్రమంలో ముంచిన మెత్తటి గుడ్డతో ఆ పాలరాతి నేల భాగాన్ని మళ్ళీ మెరుపు వచ్చే దాకా మెల్లిగా రుద్దండి.

– నేల మీద ఉంచిన కుండలు, ఇనప ఫర్నిచర్ కాళ్ళు, నూనె, ఇంకు, మురికి నీరు లాంటివి పడితే రంగు కోల్పోతాయి. వంట నూనెలు లేదా జిడ్డు పదార్ధాలు పాలారాతి నేల మీద మరకలు పడేలా చేస్తాయి. అందువల్ల సబ్బు, నీళ్ళు పెట్టి వెంటనే అలాంటి వాటిని కడిగి వేయాలి.

కూరల్లో ఉప్పు ఎక్కువైందా?గాభరాపడకండి.. ఈ చిట్కాలు ఫాలోఅయిపోండి.

images

వంటచేసేటప్పుడు అప్పుడప్పుడూ అనుకోకుండా కూరల్లో ఉప్పు ఎక్కువగా వేసేస్తుంటాము. అయితే అలా ఎక్కువైన ఉప్పుని వెనక్కి తీయలేకపోయినా దాని వల్ల కూర రుచి చెడిపోకుండా మాత్రం జాగ్రత్త పడవచ్చు. అదెలాగంటే…

1. కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు దానికి కొద్దిగా కొబ్బరిపాలు జత చేయాలి. ఇలా చేడయం వల్ల కూరల్లో ఉప్పదనం తగ్గి రుచికరంగా ఉంటుంది.

2. మరో చిట్కా ఒక బంగాళదుంప తీసుకొని ఓవెన్ లో 5నిముషాలు బేక్ చేసుకొని, తర్వాత తొక్క తీసేసి, నాలుగు ముక్కలుగా కోసి కూరలో వేయాలి. 5నిముషాల పాటు అందులోనే బంగాళదుంప ముక్కలను ఉంచడం వల్ల ఎక్కువైన ఉప్పుని ఇవి గ్రహించేస్తాయి.

3.మరో అద్భుత చిట్కా, రెండు లేదా మూడు కప్పుల పెరుగును కూరలో కలపడం వల్ల ఉప్పు తగ్గడమే కాదు రుచి కూడా పెరుగుతుంది. పెరుగు వేయడం ఇష్టం లేని వారు దానికి బదులుగా కొద్దిగా మీగడని కూడా ఉపయోగించవచ్చు.

4.ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, నూనెలో వేయించి కూరలో కలపడం వల్ల రుచికి రుచి మరియు ఉప్పదనం కూడా తగ్గుతుంది.

5.మీరు చేసే వంటకాన్ని బట్టి టమోటో ముక్కలు లేదా టమోటో పేస్ట్ ని కూడా జత చేయవచ్చు.

6.గోధుమ పిండికి కొద్దిగా నీటిని జతచేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, వీటిని కూరలో వేసి 3 నుండి 4నిముషాలు ఉడకనివ్వాలి. ఇవి కూరలో ఎక్కువగా ఉప్పుని గ్రహించేస్తాయి. తర్వాత వీటిని బయటకు తీసేయవచ్చు.

ఇవి కొన్ని చిట్కాలు మాత్రమే..ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ మీరు గుర్తుంచుకుని, సందర్భం ఎదురైనప్పుడు ఉపయోగించడానికి ప్రయత్నించండి. ‘కుకింగ్ క్వీన్’ అనిపించుకోండి.

సిల్వర్ ప్లేట్స్ శుభ్రం చేయడానికి చిట్కాలు…

images (39)

ప్రతి రోజూ సిల్వర్ ప్లేట్స్ పాలిష్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా రెగ్యులర్ గా శుభ్రం చేయడం వల్ల సిల్వర్ నాశనం అవుతుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక మృదువైన వస్త్రం లేదా మృదువైన పళ్ళు ఉన్న బ్రెష్ తో తుడిచి శుభ్రం చేయాలి. ఇంకా మీరు కొన్ని సోప్ నీళ్ళు ఉపయోగించి వాటిని శుభ్రం చేయవచ్చు. మరకలు తొలగిపోతాయి. నీటితో శుభ్రం చేసిన తర్వాత ఒక మృదువైన వస్త్రం ఉపయోగించి నీటిని పూర్తిగా తుడవడానికి నిర్ధారించుకోవాలి.

బేకింగ్ సోడా : బేకింగ్ సోడా సిల్వర్ ప్లేట్స్ శుభ్రం చేయడానికి మరో క్లినింగ్ ట్రిక్. గోరువెచ్చని నీటిలో ఒక గుప్పెడు బేకింగ్ సోడా వేసి, నీటిలో బేకింగ్ సోడా పూర్తిగా కరిగిపోయేవరకూ రెండు మూడు నిముషాలుండి, తర్వాత అందులో సిల్వర్ ప్లేట్స్ వేసి, నీటిలో కిద్దిసేపు నానబెట్టాలి. పదినిముషాల తర్వాత ఆ నీటిలో నుండి తీసి ఒక ఒక మృదువైన పొడి గుడ్డతో శుభ్రంగా తుడవాలి.

దుస్తులకు గంజి పెట్టడానికి సహజ పద్దతులు…

images (8)

కాటన్ దుస్తులు స్టిఫ్ గా ఉంటేనే చూడటానికి అందంగా కనబడుతాయి. ఇంట్లో నేచురల్ పదార్థాలతో రెగ్యులర్ గా దుస్తులకు గంజి పెట్టుట వల్ల దుస్తులకు ఎటువంటి హాని జరగదు, చిరగడం లేద కలర్ పోవడం వంటివి జరగవు.నేచురల్ పద్దతుల్లో దుస్తులకు గంజి పెట్టుట వల్ల మీ దుస్తులు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. మరి ఆ నేచురల్ పదార్థాలేంటి మరియు వాటిని ఎలా ఉపయోగించాలని తెలుసుకుందాం…

రైస్ వాటర్(గంజి) : ప్రెజర్ కుక్కర్ లో అన్నం వండకుండా సపరేట్ గా గిన్నెలో వండుకొంటే మంచిది. అన్నం వండటానికి సరిపడా కంటే మరికొన్ని ఎక్కువ నీళ్ళు పోసి అన్నం ఉడికిన తర్వాత గంజి సపరేట్ గా వంపుకోవాలి . తర్వాత గంజి చల్లబడిన తర్వాత అందులో మరికొన్ని నీళ్ళు పోసి తర్వాత దుస్తులను ఆ నీటిలో డిప్ చేయాలి. ఇది ఎక్కువ మంది ఉపయోగించే నేచురల్ పద్దతి.

గోధుమలు : బియ్యం లాగే వీటిని కూడా నేచురల్ గా గంజి పెట్టించవ్చు. గోధుమలు ఉడికించిన నీటిని వేరే గిన్నెలోకి వంపుకొని, చల్లారిన తర్వాత దుస్తులను అందులో డిప్ చేసి ఎండలో వేయడం వల్ల దుస్తులు స్టిఫ్ గా ఉంటాయి.

కార్న్ స్ట్రార్చ్కార్న్ స్టార్చ్ (మొక్కజొన్న పిండి) ని 15mlతీసుకొని, చల్లటి నీటిలో వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ నీటిలో ఒక నిముషం బాగా మరిగించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని స్పే బాటిల్లో వేసి ఉపయోగించుకోవచ్చు. లేదా పూర్తింగా బకెట్లో వేసి జాలించవచ్చు.

బంగాళదంపు నీళ్ళు : నేచురల్ పద్దతిలో గంజి తయారుచేయడానికి రెండు మూడు బంగాళదుంపలు తీసుకోవాలి. ఈ బంగాళ దుంపలను నీటిలో వేసి ఉడికించాలి. తర్వాత ఈ నీటిని రాత్రంతా అలాగే ఉంచాలి. తర్వాత రోజు ఉదయం నీరు వడగట్టుకొని దుస్తులకు పట్టించవచ్చు.

గుడ్డు వాసను మాయం చేసే సింపుల్ చిట్కాలు…

images (52)

గుడ్డు పగిలి క్రిందపడినప్పుడు, లేదా పాత్రలకు అట్టుకొన్నప్పుడు వెంటనే శుభ్రం చేయకపోతే, కెమిక్ గ్యాస్ హైడ్రోజన్ ఉత్పత్తై బ్యాక్టీరియా చేరి దుర్వాసన మరింత ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి, గుడ్డు వల్ల వచ్చే దుర్వాసను తొలగించడానికి కొన్ని సులభమైన మార్గాలున్నాయి…

1. నిమ్మరసం: నిమ్మరసంతో గుడ్డు వాసను దూరం చేయవచ్చు. గుడ్డ పడ్డ మరకల మీద కొద్దిగా నిమ్మరసం చిలకరించండి. రెండు మూడు నిముషాలు అలాగే ఉంచి తర్వాత పొడి వస్త్రంతో తుడిచేయాలి. ఇలా చేస్తే తక్షణం వాసన పోతుంది.

2. రోజ్ వాటర్: గుడ్డు పడ్డ చోట బాగా ఎండిపోయి, మొండి మరకలుగా తయారైతే రోజ్ వాటర్ తో శుభ్రం చేయడం ఒక సులభమైన పద్దతి. అంతే కాదు, రోజ్ వాటర్ తో శుభ్రం చేసిన తర్వాత ఒక మంచి సువాసన వస్తుంటుంది.

3. వెనిగర్: ఎగ్ స్మెల్ నిర్మూలించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక ఎఫెక్టివ్ మార్గం. అందుకు మీరు చేయాల్సిందల్లా, వెనిగర్ లో కాటన్ క్లాత్ ను డిప్ చేసి, మరకపడ్డ ప్రదేశంలో రుద్దాలి. ఇలా రెండు మూడు సార్లు చేస్తే దుర్వాసన మాయం అవుతుంది.

4. ఆరెంజ్ తొక్క: ఎగ్ స్మెల్ తొలగించడానికి ఆరెంజ్ ఒక ఉత్తమమైన మార్గం. ఇది ఒక స్ట్రాంగ్ అండ్ పవర్ ఫుల్ సువాసన అందించే బెస్ట్ హోంరెమడీ. ఆరెంజ్ తొక్కతో ఎగ్ మరకలున్న చోట రుద్ది శుభ్రం చేయాలి.