Archive for August, 2017

బటర్ చికెన్ మసాలా రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (5)

కావల్సిన పదార్థాలు:

చికెన్: 1/2kg (బోన్ లెస్)

కారం పొడి: 1tsp

పసుపు పొడి: 1tsp

కస్తూరి మేతి: 4tbsp

తాజా క్రీమ్: 1cup

అల్లం: 1 ముక్క

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: 4tbsp

బట్టర్: 100grms

అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp

టమోటాలు: 4(పేస్ట్ చేసుకోవాలి)

తయారుచేయు విధానం:

1. డీప్ బాటమ్ పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి.

2. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు చికెన్ ముక్కలు వేసి తక్కువ మంట మీద 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

3. చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారిన తర్వాత, అందులో బటర్ వేయాలి.

4. తర్వాత, అందులో టమోటో గుజ్జును వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి మరో 5 నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.

5. ఇప్పుడు అందులో కారం, పసుపు, ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని వేగిస్తూ ఉండాలి. చికెన్ నుండి నూనె పైకి తేలే వరకూ వేగించుకోవాలి.

6. ఇప్పుడు అందులోనే కస్తూరి మేతి చిన్న ముక్కలుగా కట్ చేసి చిలకరించుకోవాలి.

7. చివరగా తాజా క్రీమ్ ను కూడా జోడించి, అల్లం ముక్కలు లేదా అల్లం తురుమును వేసి మూత పెట్టి కొన్ని నిముషాలు ఉడికించుకోవాలి.

8. ఇప్పుడు బటర్ చికెన్ కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే బటర్ చికెన్ రెడీ.

చికెన్ పన్నీర్ గ్రేవీని ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (12)

కావల్సిన పదార్థాలు:

చికెన్ – 1/2 kg

పన్నీర్ – 100 g

టమోటో గుజ్జు – 1/2 cup

ఉల్లిపాయ గుజ్జు – 1/2 cup

ఉల్లిపాయలు – 1/2 cup

గరం మసాలా – 2 tsp

కారం – 1 tsp

ధనియాలపొడి – 1/2 tsp

పచ్చిమిర్చి- 7 to 8

ఆవాలు: – 1/4th tsp

నూనె: తగినంత

నిమ్మరసం – 2 tsp

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయువిధానం:

1. ముందుగా పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకొన్న పనీర్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చాక పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు వేయాలి.

3. తర్వాత అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.

4. పచ్చివాసన పోయే వరకూ వేగించి తర్వాత అందులో టమోటో, ఉల్లిపాయ గుజ్జు, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్ మరియు ధనియాల పొడి వేసి ఫ్రై చేయాలి.

5. ఇప్పుడు అందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న పన్నీర్ వేయాలి.

6. వెంటనే చిన్నగా కట్ చేసుకొన్న చికెన్ ముక్కలు వేసి మొత్తం మిశ్రమం కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.

7. రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసి పైన నిమ్మరసం చిలకరించాలి.

8. అంతే హాట్ అండ్ స్పైసీ పన్నీర్ గ్రేవీ రిసిపి రెడీ.

మటన్ సీక్ కబాబ్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం… రంజాన్ స్పెషల్…

download (7)

మటన్ సీక్ కబాబ్ :

రంజాన్ స్పెషల్ మటన్ ఖీమా – 500 g

గరం మసాలా – ¾ teaspoon

ఉల్లిపాయ – 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

అల్లం పేస్ట్ – 2 teaspoons

వెల్లుల్లిపేస్ట్ – 2 teaspoons

పచ్చిబొప్పాయి పేస్ట్ – 1 tablespoon

నిమ్మరసం – 1 teaspoon

ఉల్లిపాయ పేస్ట్ – 1 tablespoon

జీడిపప్పు పేస్ట్ – 2 tablespoons

కార్న్ ఫ్లోర్ – 1 tablespoon

కారం – 1 teaspoon

క్రీమ్ – 2 teaspoons

పెప్పర్ పౌడర్ – చిటికెడు

బ్లాక్ పెప్పర్ పౌడర్ – చిటికెడు

జీలకర్ర – 1 tablespoon

ధనియాలపొడి – 1 teaspoon

యాలకలు – 2 teaspoons

పసుపు – ½ teaspoon

డ్రై మ్యాంగో పౌడర్(Aamchur) – 1 teaspoon

డ్రై జింజర్ పౌడర్ – ¼th teaspoon

ఉప్పు – 2 tablespoons

గసగసాలు – 1 tablespoon (optional)

నట్ మగ్ పౌడర్ – ½ teaspoon

గుడ్డు పచ్చసొన – 1

ఛాట్ మసాలా – కొద్దిగా చిలకరించాలి

నూనె లేదా నెయ్యి: కొద్దిగా

తయారుచేయు విధానం:

1. ముందుగా మటన్ ఖీమాను శుభ్రంగా కడిగి, నీరు పూర్తిగా వంపేసి, పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పదార్థాలన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి.

3. అందులోనే కీమా కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలిపి పెట్టుకోవాలి. ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.

4. ఒక గంట తర్వాత మైక్రోవేవ్‌ను 350డిగ్రీల ఫారెన్ హీట్‌లో పెట్టాలి.

5. అంతలోపు ఉడెన్ స్కీవర్స్‌ను వాటర్‌తో శుభ్రంగా కడిగి, నీటితో తుడిచి పెట్టుకోవాలి.

6. తర్వాత ఉడెన్ స్కీవర్స్‌కు నెయ్యి లేదా ఆయిల్‌ను అప్లై చేయాలి.

7. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొన్న ఖీమా మిశ్రమాన్ని మరో సారి మిక్స్ చేసి, కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకొని, స్వీవర్స్‌కు చుట్టి బాగా ప్రెస్ చేయాలి.

8. స్కీవర్‌కు మటన్ పూర్తిగా స్టిక్ అవుతుంది. ఇలా అన్ని తయారుచేసుకోవాలి.

9. ఇప్పుడు మైక్రోవోవెన్ గ్రిల్ మోడ్‌లో స్కీవర్స్‌ను ఫిక్స్ చేసి 350డిగ్రీల ఫారెన్ హీట్‌లో ఉడికించుకోవాలి. స్టౌ మీద కాల్చుకొనేటట్లైతే, స్కీవర్స్‌ను అన్ని వైపులా తిప్పుతూ ఉడికించుకోవాలి. మద్యమద్యలో కొద్దిగా నెయ్యి లేదా నూనెను చల్లుతూ కాల్చుకోవాలి.

10. సీక్ కబాబ్స్ పూర్తిగా ఉడికిన తర్వాత ఓవెన్ నుండి మటన్ సీకర్స్‌ను తీసి, పేపర్ నాప్కిన్స్ మీద ఉంచాలి.

11. స్టౌ మీద తవా పెట్టి, కొద్దిగానూనె వేసి వేడయ్యాక అందులో సీకర్స్ పెట్టి, కొన్ని నిముషాలు రొటేట్ చేస్తూ వేడి చేసుకోవాలి. అన్నివైపులా పూర్తిగా కాలిన తర్వాత తవా నుండి సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవాలి.

12. సర్వ్ చేయడానికి సీక్ కబాబ్స్ రెడీ. చాట్ మసాలా మరియు కొద్దిగా నిమ్మరసం చిలకరించి సర్వ్ చేయాలి.

గోధుమ రవ్వ పొంగలి ఎలా తయారుచేయాలో చూద్దాం… వినాయక చవితి స్పెషల్…

download (1)

కావల్సిన పదార్థాలు:

గోధుమ రవ్వ: 1/4kg

పెసరపప్పు: 100grm

బెల్లం: 100grm(పొడి చేసుకోవాలి)

యాలకులపొడి: 1tsp

నెయ్యి: 4tbsp

జీడిపప్పు: 10

బాదం: 4

తయారుచేయు విధానం:

1. ముందుగా పెసరపప్పును కడిగి నానబెట్టి తగినన్ని నీటితో మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత మరొక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పును వేయించి పక్కన పెట్టి, ఆ పాత్రలోనే మిగిలిన నేతిలో గోధుమ రవ్వను వేసి బంగారు రంగు వచ్చే వరకూ సన్న మంట మీద వేయించాలి.

3. రవ్వ వేగిన తర్వాత మూడు గ్లాసుల నీటిని పోసి ఉడికించాలి. ఈ మిశ్రమంలో ఇప్పుడు ముందుగా ఉడికించిన పెసరపప్పు, బెల్లం పొడి, వేసి బాగా కలిపి క్రిందికి దించుకోవాలి.

4. తర్వాత యాలకుల పొడి, జీడిపప్పు, బాదంతో అలంకరించాలి. అంతే గోధుమరవ్వ పొంగలి రెడీ.

పచ్చిబఠాణీ శాండ్ విచ్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

carrot-and-green-peas-sandwich

కావల్సిన పదార్థాలు:

బ్రౌన్ బ్రెడ్ స్లైసులు: 8(కొద్దిగా వెన్న రాయాలి)

టమోటో: 1(పెద్దది/సన్నగా స్లైసుల్లా తరిగేయాలి)

ఫిల్లింగ్ కోసం :

ఉడికించి మెత్తగా చేసిన పచ్చిబఠాణీ పేస్ట్: 1cup

కొత్తిమీర తురుము: 1tbsp

టాపింగ్ కోసం:

గట్టి పెరుగు: 2tbsp

క్రీమ్: 1tbsp

ఆవపొడి, పంచదార: 1/2tspచొప్పున

టమోటో కెచప్: 2tsp

చిల్లీ సాస్: 1/2tsp

క్యాప్సికమ్ తరుగు: 1tsp

పచ్చిమిర్చి ముక్కుల: 1/2 tsp

ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:

1. ముందుగా వెడల్పాటి గిన్నెలో పెరుగు, క్రీమ్ వేసి బాగా గిలకొట్టాలి. తర్వాత మిగిలిన పదార్థాలన్నీ కలిపేస్తే టాపింగ్ సిద్దం.

2. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ మీద బ్రెడ్ స్లైసులను రెండు వైపులా దోరగా కాల్చాలి. ఒక్కో బ్రెడ్ స్లైస్ తీసుకొని ఒక్కోదానిపై టమాటా స్లైసులను ఉంచాలి. వాటి మీద కొద్దిగా ఉప్పు చిలకరించాలి.

3. తర్వాత ముందుగా సిద్దం చేసుకొన్న మిశ్రమాన్ని టాపింగ్ లా రాసి…మిగిలిన నాలుగు స్టైసులను వాటిపై ఉంచేయాలి. వీటిని త్రీకోణాక్రుతిలో లేదా గుడ్రంగా కట్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.

ఓట్స్ కోకనట్ దోసె ఎలా తయారుచేయాలో చూద్దాం… హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి…

dosa_625x350_51462306354

కావల్సిన పదార్థాలు: 

బియ్యం పిండి: 1cup

గోధుమ పిండి: 1cup

ఓట్స్ పౌడర్: 1cup

కొబ్బరి తురుము : 1/4cup

పచ్చిమిర్చి: 2

పెప్పర్ పౌడర్: 1/2tbsp

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: తగినంత

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండి, గోధుమపిండి, ఓట్స్ పౌడర్, పచ్చిమిర్చి, కొబ్బరి, పెప్పర్ పౌడర్, మరియు ఉప్పు మరియు నీళ్ళు వేసి బాగా కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి.

2. మరుసటి రోజు ఉదయం పాన్ తీసుకొని స్టౌ మీద పెట్టి, నూనె రాయాలి. తవా వేడయ్యాక గరిటతో పిండితీసుకొని దోసెను వేసుకొని, తవా మొత్తం సర్దాలి. తర్వాత దోసె మీద కొద్దిగా నూనె చిలకరించాలి . తర్వాత మీడియం మంట మీద కాల్చుకోవాలి. రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకోవాలి. అంతే రుచికరమై ఓట్స్ దోసె రిసిపి రెడీ. దీనికి కొబ్బరి చట్నీ, సాంబార్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

పెరుగు వంకాయ ఎలా తయారుచేయాలో తెలుసుకోండి…

download (3)

కావల్సిన పదార్థాలు:

వంకాయలు: 7-8

పసుపు: 1-2tsp

పంచదార: 1tsp

ఉల్లిపాయ పేస్ట్: 2-3tbsp

అల్లం వెల్లుల్లి పేస్ట్ :1 ½tbsp

పచ్చిమిర్చి: 2-3 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)

కారం: 2tsp

ధనియాల పొడి: 1tsp

పెరుగు : 2cups

వెజిటబుల్ ఆయిల్: 1cup

ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా వంకాయలను తీసుకొని వాటిని మద్యలోకి కట్ చేసి, నీళ్ళలో వేసి, పసుపు,పంచదార మరియు ఉప్పు వేసి మీడియంగా ఉడికించిపెట్టుకోవాలి.

2. తర్వాత 3/4కప్పు నూనెను పాన్లో వేసి ఉడికించుకొన్న వంకాయ ముక్కలకు మీడియం మంట మీద డీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు మిగిలిన నూనె వేడయ్యాక అందులో ఉల్లిపాయ పేస్ట్ , అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పచ్చిమిర్చి వేసి 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఫ్రై చేయాలి.

4. ఇప్పుడు అందులో కొద్దిగా కారం, ధనియాల పొడి మరియు కొద్దిగా పసుపు వేసి, మొత్తం మిశ్రమాన్ని మరో 5నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.

5. తర్వాత అందులో పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. వేగుతున్న మసాలాలన్నీ కూడా పెరుగుతో బాగా మిక్స్ అయ్యే వరకూ మిక్స్ చేయాలి. చాలా తక్కవు మంట మీద ఫ్రై చేసి 2,3 నిముషాలు ఉడికించుకొని తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.

6. తర్వాత ఒక బౌల్ లేదా డీప్ ప్లేట్ లో వంకాయలను సర్ధి తర్వాత వాటిమీద పెరుగు మిశ్రమాన్ని పోయాలి. మీ పెరుగు బ్రింజాల్ తినడానికి రెడీ . చివరగా గార్నిష్ చేయాలి. అంతే కర్డ్ బ్రింజాల్ రెడీ…

క్రాన్ బెర్రీ జ్యూస్ హార్ట్ కు చేసే మేలు…

images (90)

క్రాన్ బెర్రీ జ్యూస్ హార్ట్ కు చాలా మంచిది. ఈ లిటిల్ బెర్రీస్‌లో ఉండే లక్షణాలు హార్ట్‌లో ఉన్న ఎలాంటి క్లాట్స్ (రక్తం గడ్డలను) కరిగించేస్తుంది. దాంతో హార్ట్ అటాక్ రిస్క్ నుండి ప్రాణాలను కాపాడుతుంది.

నోటి వాసనను నివారించే ఎఫెక్టివ్ రెమెడీస్…

badbreath14-56a5a4435f9b58b7d0ddcb89

– పెరుగు: పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉన్నాయి. ఇవి నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. రిఫ్రెషింగ్ బ్రీత్ ను అందిస్తుంది.

– గ్రీన్ టీ: గ్రీన్ టీలో ఫాలీ ఫినాల్స్ అనే కాంపౌండ్స్ ఉండటం వల్ల ఇవి బ్యాడ్ బ్రీత్ ను తొలగించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. నోట్లో, నోటి లాలాజలంలో ఉన్న చెడు బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ఈ ఫాలీఫినాల్స్ ఉపయోగపడుతాయి.

– యాపిల్ జ్యూస్: యాపిల్ జ్యూస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ నోట్లో యాసిడ్స్ ను క్రమబద్దం చేస్తుంది. బ్రీతింగ్ ను రిఫ్రెష్ చేస్తుంది, ముఖ్యంగా గార్లిక్ ఎక్కువ తినే వారిలో ఇటువంటి సమస్యను కంట్రోల్ చేస్తుంది.

– లవంగాలు: లవంగాలు మంచి ఆరోమా వాసనతో, మంచి రుచి కలిగి ఉంటుందన్న విషయం మనందరికీ తెలుసు, కాబట్టి, నోట్లో ఒకటి రెండు లవంగాలు వేసుకుని నమిలినా,ఇన్ స్టాంట్ గా ఫ్రెష్ బ్రీత్ పొందుతారు.

– సోంపు: సోంపులో యాంటీ సెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది నోట్లో పెరిగే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దాంతో మీ నోటి వాసన ఫ్రెష్ గా ఉంటుంది.

ప్రతిరోజూ ఒక కప్పు ఆకుకూర తీసుకుంటే… మధుమేహం మటాష్…

baby-spinach
ప్రతిరోజూ ఒక కప్పు ఆకుకూర తీసుకునే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం 14శాతం తగ్గించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. లేదంటే ఆకుకూరలు వారానికి మూడు సార్లు తీసుకుంటూ వుండాలని వారు సూచిస్తున్నారు. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆకుకూరల్లోని విటమిన్‌-బీ పాలెట్స్‌ జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
వీటిల్లోని విటమిన్‌-ఏ కంటిచూపును మెరుగు పరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే అమైనో ఆమ్లాలనూ నియంత్రిస్తాయి. ముఖ్యంగా పొన్నగంటి కూరలో ఏ విటమిన్‌ అధికం. దీనిని తింటే రేచీకటి రాదు. శరీరానికి చలువ కూడా. పేగుల్లోకి వెళ్లిన వెంట్రుకలను సైతం కరిగించే శక్తి దీనికుంది. ఇక కూరల్లోగానీ, పచ్చడిగా గానీ పుదీనా తీసుకుంటే మెదడు చురుగ్గా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
ఇక బరువు తగ్గించడంలోనూ ఆకుకూరలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆకుకూరల్లోని విటమిన్ కె బరువును తగ్గిస్తుంది. ఇక ఆకుకూరల్లో క్యాలరీలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.