Archive for September, 2017

వెజిటేబుల్ పొంగల్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

bisi-bele-bhath

కావల్సిన పదార్థాలు:

బియ్యం: 200grms

పెసరపప్పు: 100grms

క్యారెట్,బీన్స్, పచ్చిబఠాణీ, టమోటో(అన్నీ కలిపి): 100grms

పచ్చిమిరపకాయలు: 2

కరివేపాకు: రెండు రెమ్మలు

మిరియాలు: 1tsp

జీలకర్ర: 1tsp

అల్లం: చిన్న ముక్క

ఇంగువ: చిటికెడు

నూనె : 2tbsp

నెయ్యి: 2tbsp

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా బియ్యం, పెసరపప్పును కలిపి కడిగి తగినన్ని నీళ్ళు పోసి, అరగంట సేపు నాననివ్వాలి.

2. తర్వాత కూరగాయలన్నీ చిన్న ముక్కలుగా తరగాలి.

3. ఇప్పుడు ఒక పద్దగిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఇంగువ, జీలకర్ర, మిరియాలువేసి దోరగా వేగినివ్వాలి.

4. వేగిన తర్వాత అందులో మద్యలోకి కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి.

5. అవి వేగిన తర్వాత అందులో క్యారెట్, బీన్స్ ముక్కలు, బఠాణీ గింజలు వేసి సన్న మంట మీద మగ్గనివ్వాలి.

6. ఇప్పుడు అందులో టమోటో ముక్కలు వేసి, అవీ మగ్గిన తర్వాత నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి మరుగనివ్వాలి.

7. నీరు బాగా మరిగేటప్పుడు అందులో బియ్యం, పెసరపప్పు, వేసి మెత్తగా ఉడికించాలి. అంతే చివరగా కొద్దిగా నెయ్యి వేసి దింపుకోవాలి అంతే వెజ్ పొంగల్ రెడీ.

దగ్గు, జలుబు నివారించడం కోసం చిట్కా…

dry cough_094

గ్లాసుడు పాలు వేడి చేసి దానిలో తేనె వేసి తాగితే రాత్రిపూట వచ్చే దగ్గు తగ్గుతుంది. పాలల్లో తేనె, చిటికెడు పసుపు వేసి బాగా కాచి, ఆ పసుపు పాలు తీసుకున్నా దగ్గు, జలుబు తగ్గుతాయి.

సీలింగ్ ఫ్యాన్స్ శుభ్ర పరచడమెలా?

cleaning_fan

ఇంటిని శుభ్రపరచడంలో ఎంత నిపుణులైనప్పటికి సీలింగ్ ఫ్యాన్ శుభ్రం చేయాలంటే కష్టం తప్పదు. ఎంత పొడవాటి వారికైనా వీటి శుభ్రత సమస్యే. కనుక మీ ఫ్యాన్ శుభ్రం చేయాలంటే నిపుణుల సలహా పాటించండి.

ఎత్తు స్టూలుపై ఎక్కవ సేపు నించోరాదనుకుంటే మీరు సీలింగ్ ఫ్యాన్ ఊడదీసి శుభ్రపరచటం మంచిది. అన్ని బ్లేడ్లు ఊడదీసి ఒక్కొక్కదానిని శుభ్రం చేయవచ్చు. వాటిని వేడి సబ్బు నీటిలో ముంచి దానిపై పేరుకున్న మురికినంతా వదలగొట్టటానికి బాగా రుద్దండి. నీటితో శుభ్రంగా కడిగేయండి. అన్ని వస్తువులను కడిగి ఎలా శుభ్రం చేస్తామో బ్లేడ్ లను కూడా అదే విధంగా సౌకర్యవంతంగా శుభ్రం చేయవచ్చు. అయితే సమస్యల్లా మళ్ళీ దానిని ఫిట్ చేయటమే. మనలో చాలామంది మళ్ళీ ఫిట్ చేయాలంటే అశ్రద్ధ చేస్తారు. సరి అయిన అవగాహన లేకుంటే, బ్లేడ్లు ఊడతీయవద్దు. అవి ఫిటింగ్ సమయంలో ఏ మాత్రం లూజ్ గా వున్నా ఎగిరి కిందపడి యాక్సిడెంట్ చేస్తాయి.

– ఊడతీయకుండా శుభ్రం చేయాలంటే, ఒక ఎత్తైన స్టూలుపై నిలుచుని రెక్కలను శుభ్రం చేయవచ్చు. అయితే నీటితో కడగటం సాధ్యం కాదు. అయితే, ఒక బ్రష్ ను నీటిలో ముంచి శుభ్రం చేయవచ్చు. బ్రష్ తో శుభ్రం చేసిన తర్వాత ఒక స్పాంజి తీసుకొని సబ్బు నీళ్ళలో ముంచి దానితో బ్లేడ్లను శుభ్రం చేయండి. దీని తర్వాత వేడినీటిలో ముంచిన గుడ్డతో బ్లేడ్లను తుడవాలి. తర్వాత మంచి పొడి బట్టతో ఫ్యాను తుడిచేయండి. ఫ్యాన్ తళతళలాడుతూ శుభ్రంగా వుంటుంది. కొన్ని జాగ్రత్తలు పాటించండి.

– ఎత్తులో వుండటం వలన, దానిని శుభ్రం చేయాలంటే అశ్రధ్ధ చేస్తాము. పదునైన బ్లేడ్లు చేతి వేళ్ళను కోసే ప్రమాదం వుంది. మీరు నిలబడేటపుడు గట్టి అయిన స్టూలు పై నిలబడ్డామా లేదా అనేది పరిశీలించండి. దుమ్ము పీల్చకుండా ముక్కుకు గుడ్డ కట్టండి. ఫ్యాన్ లను శుభ్రం చేయటం అవసరం. లేదంటే దానిపై పేరుకునే దుమ్ము కణాలను అది తిరిగినంత సేపూ పీల్చటం లేదంటే, ఆహార పదార్ధాలలో పడే అవకాశం కూడా వుంది.

కలబంద రసంలో కొబ్బరి నూనె కలిపి రాసుకుంటే?

9101036_f520

కలబంద రసంలో కాస్తా కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. దీన్ని మోచేతులు, పాదాల వద్ద నల్లగా ఉన్న చోట పూస్తే నలుపు పోతుంది.

గోళ్ళ సంరక్షణకు సులభ మార్గాలు…

images (83)

మెత్తగా రుబ్బిన గోరింటాకు ముద్దలో కొద్దిగా పసుపు, నిమ్మరసం కలిపి పేస్టులా చేసుకొని గోళ్లకు రాత్రి పూట పట్టించాలి. గోరింటాకు రాలిపోకుండా పలచని తెల్లగుడ్డను చుట్టి పడుకుని ఉదయాన్నే కడిగేయాలి. దీని వల్ల ఫంగస్‌ ఏర్పడిన పిప్పి గోళ్లు, పగుళ్లు, ముడతలు, మచ్చలు మొదలైన సమస్యలు తగ్గిపోతాయి.

– పై పొరను తీసిన బంగాళదుంపను మెత్తగా పేస్ట్ చేయాలి. ఆ మిశ్రమానికి కొద్దిగా పసుపు కలిపి రాత్రి గోళ్లకు పట్టించి ఉదయాన్నే కడగాలి. ఇలా చేస్తే ఫంగస్‌ వల్ల ఏర్పడిన నలుపుదనం పోయి గోళ్లు కాంతివంతంగా తయారవుతాయి.

కొద్దిగా పసుపు తీసుకుని నీటితో గాని, నిమ్మరసంలో గాని కలిపి ముద్దగా చేసి వ్యాధి సోకిన భాగాల్లో గోళ్లకు పట్టించి రాలిపోకుండా తెల్లని పలుచని గుడ్డను కట్టి రాత్రి పడుకుని ఉదయాన్నే కడిగేయాలి. ఇలా చేస్తుంటే గోళ్ల సమస్యలు త్వరగా తగ్గిపోతాయి.

రాత్రి పడుకునే ముందు పలుచని తెల్లగుడ్డను నిమ్మరసంలో కొద్దిసేపు తడిపి వ్యాధి సోకిన గోళ్లకు చుట్టాలి. ఇలా చేస్తుంటే గోళ్ల సమస్యలు రావు. దీంతో పాటు గోళ్లపై ఉండే సహజమైన రంగు పోకుండా ఉంటుంది.

పల్చటి తెల్ల గుడ్డను ఉల్లిపాయ రసంలో బాగా తడిపి వ్యాధి ఉండే గోళ్లకు చుట్టాలి. దీని వల్ల చక్కని ఫలితం కలుగుతుంది.

డయాబెటీస్‌తో బాధపడుతున్నారా? వంకాయ తినండి…

download
వంకాయ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వంకాయ తొక్కలో ఉండే యాంథోసియానిన్స్ , యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. వయస్సు ఛాయలు కనిపించనీయవు. శరీరంలో వాపు, నరాల బలహీనత తగ్గించే శక్తి వంకాయలకు ఉందని డైటీషియన్లు చెబుతున్నారు.
ముఖ్యంగా డయాబెటీస్‌తో బాధపడేవారు దీన్ని ఎంత ఎక్కువ తీసుకుంటే అంతమంచిదట. దీనిలో తక్కువ మోతాదులో గ్లిజమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీని కారణంగా దీన్ని ఎంత ఎక్కువ తీసుకున్నా ఆరోగ్యానికి హాని చేయదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇంకా వంకాయలో వుండే ఫొటో న్యూట్రియంట్స్… ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడి నష్టం నుంచి కణత్వచాన్ని రక్షిస్తాయి. బి-కాంప్లెక్స్ విటమిన్లు ఒత్తిడి లేకుండా ప్రశాంతతను కలిగిస్తాయి. నాడీ చర్య సులభతరంగా మార్చి, షార్ప్ మెమొరీ నిధులను జరిగేలా చేస్తాయి. వంకాయలో ఎక్కువ మోతాదులో విటమిన్ – సీ సమృద్ధిగా లభిస్తుంది.
ఇది ఎంతో ప్రతిభావంతమైన యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియా లక్షణాలను కలిగి వుంటుంది. శరీరంలో హాని కలిగించే బాక్టీరియాలను అంతం చేయడంలో వంకాయ ఎంతోగానో మెరుగ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

మటన్ కడై రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…బక్రీద్ స్పెషల్…

images (8)

కావల్సిన పదార్థాలు:

మటన్: 250grm

టమోటో: 2(సన్నగా కట్ చేయాలి)

ఉల్లిపాయ పేస్ట్: 1/4cup

అల్లం పేస్ట్: 1/2tbsp

వెల్లుల్లి పేస్ట్: 1/2tbsp

జీలకర్ర: 1/2tbsp

పచ్చిమిర్చి: 3

పెరుగు: 1/4cup

గరం మసాలా : 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

పసుపు: 1tsp

కారం: 1tsp

ధనియాల పొడి: 1/2tsp

బిర్యానీ ఆకు: 2

నూనె: 3tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి తర్వాత పెరుగు మరియు ఉప్పుతో మ్యారినేట్ చేసి 20 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.

2. పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి వేసి వేగించి ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పడు అదే పాన్ లో మటన్ ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకొని ఒకగిన్నెలోనికి తీసి పక్కన పెట్టుకోవాలి.

4. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి అందులో జీలకర్ర వేసి ఒకనిముషం వేగించుకోవాలి.

5. ఆ తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి మరికొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

6. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో 2-3 నిముషాలు వేగించుకోవాలి.

7. తర్వాత టమోటో, ధనియాలపొడి, గరం మసాలా, కారం, పసుపు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ మరో 5-10 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

8. ఇప్పుడు అందులోనే మ్యారినేట్ చేసుకొన్న మిశ్రమాన్ని అందులో వేసి బాగా మిక్స్ చేయాలి.

9. తర్వాత మటన్ ముక్కలు వేసి మొత్తం మిశ్రమాన్నికలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 15-20 నిముషాలు మీడియం మంట మీద మటన్ పూర్తిగా ఉడికే వరకూ ఉడికించుకోవాలి.

10. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత అందులో ఫ్రై చేసుకొన్న పచ్చిమిర్చి వేసి మిక్స్ చేసి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే మటన్ కడాయ్ రిసిపి సర్వ్ చేయడానికి రెడీ.

సాబుదాన కిచిడీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

sabudana-khichdi-recipe (1)

కావలసిన పదార్థాలు:

సాబుదాన/సగ్గుబియ్యం: 1cup

ఆలుగడ్డలు: 1లేదా 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

పచ్చిబఠానీ: గుప్పెడు

కొబ్బరి తురుము: 1cup(అవసరం అయితేనే)

జీలకర్ర: 1tsp

నెయ్యి: 1tsp

పచ్చిమిర్చి: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

కొత్తిమీర తరుగు: కొద్దిగా

పంచదార: 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేసే విధానం:

1. ముందుగా సాబుదాన/సగ్గుబియ్యంను నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. నీరు సరిపడా మాత్రమే పోయాలి. ఒక కప్పు సాబుదానకు రెండు కప్పులు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.

2. తర్వాత రోజు ఉదయాన్నే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి, కరిగిన తర్వాత అందులో జీలకర్ర, పచ్చిమిర్చి వేసి ఒక నిముషం వేగించుకోవాలి.

3. అలాగే అందులో కట్ చేసిన బంగాళదుంప ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ మీడియం మంట మీద వేగించుకోవాలి.

4. తర్వాత అందులో పచ్చిబఠానీలను వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే కొబ్బరి తురుము మీరు కలుపుకోవాలంటే, ఇప్పుడే వేసేయండి. (కొంత మంది కొబ్బరి తురుమును కిచిడికి వాడరు/కాబట్టి మీకు అవసరం అయితేనే ఉపయోగించండి)

5. ఇప్పుడు అందులో రాత్రి నీళ్ళలలో నానబెట్టుకొన్ని సాబుదాన వేసి మిక్స్ చేయాలి. తర్వాత ఉప్పు, పంచదార వేసి మరో 10 నిముషాలు ఉడికించుకోవాలి.

6. చివరగా స్టౌ ఆఫ్ చేసి, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే వేడి వేడి సాబుదాన కిచిడి రెడీ. రైతా లేదా పండ్లతో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

టేస్టీ జీర చికెన్ కర్రీ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (1)

కావల్సిన పదార్థాలు:

చికెన్ బ్రెస్ట్: 4 (1 అంగుళాలుగా కట్ చేయాలి)

నెయ్యి: 2tbsp

ఆవాలు: 1tsp

జీలకర్ర పొడి 1tbsp

వైట్ జీలకర్ర: 1tsp

స్ప్రింగ్ ఉల్లిపాయలు -4 (తురుము)

వెల్లుల్లి గుజ్జు 1tbsp

అల్లం గుజ్జు 1tbsp

తాజా పచ్చి మిరపకాయలు: 3(చిన్నసైజ్ లో కట్)

చికెన్ స్టాక్: 1cup (250ml)

టమోటో: 1 కప్ (తరిగిన)

కారం 1tbsp

బెల్ పెప్పర్-1 (ఒక అంగుళం చతురస్రాలు లోకి కట్)

వైట్ ఉల్లిపాయ -1 (దివ్యముగా ముక్కలుగా చేసి)

గరం మసాలా: 1tsp

ఉప్పు మరియు మిరియాలు: రుచికి సరిపడా

కొత్తిమీర: గార్నిషింగ్ కోసం

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి మీడియం మంట మీద వేగించుకోవాలి. నూనె వేడయ్యాక అందులో ఆవాలు మరియు జీలకర్ర వేసి వేగించుకోవాలి.

2. ఇప్పుడు అందులో జీలకర్ర పొడి, కారం, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి మరియు అల్లం వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయలు మరియు బెల్ పెప్పర్ వేసి వేయించుకోవాలి.

3. తర్వాత అందులో చికెన్ ముక్కలు వేసి 50%వేగే వరకూ ఉడికించుకోవాలి. ఇలా సగభాగం ఉడకడానికి కొంత సమయం తీసుకుంటుంది.

4. తర్వాత అందులో కట్ చేసిన టమోటో ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి.

5. తర్వాత అందులో చికెన్ స్టాక్ వేసి, చికెన్ ముక్కలు మొత్తగా ఉడికే వరకూ వేయించుకోవాలి.

6. తర్వాత చివరగా రుచికి సరిపడా ఉప్పు, మరియు పెప్పర్ పౌడర్ వేసి వేయించుకోవాలి. చివరగా కట్ చేసుకొన్న కొత్తమీర తరుగును గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

కొరియాండర్- లెమన్ రైస్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

JksafYhPbp

కావల్సిన పదార్థాలు:

పొడవుగా ఉన్న బాస్మతి రైస్: 1cup

ఆలివ్ ఆయిల్: 1tbsp

వెల్లుల్లి రెబ్భలు: 3-4(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

వెజిటేబుల్ స్టాక్: 2cups

నిమ్మరసం: 2tsp తాజా కొత్తిమీర తరుగు: 3tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా బియ్యంను శుభ్రంగా కడిగి నీటిలో 15-20నిముషాలు నానబెట్టుకోవాలి.

2. తర్వాత ఆలివ్ ఆయిల్ ను పాన్ లో వేసి, వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్భలు వేసి వేయించుకోవాలి.

3. వెల్లుల్లి లైట్ కలర్ లోనిక మారే వరకూ తక్కువ మంట మీద వేయించుకోవాలి.

4. ఇప్పుడు బియ్యం నుండి నీరు వంపేసి, బియ్యాన్ని వేగుతున్న వెల్లుల్లి ఫ్రైలో వేసి ఒక నిముషం వేయించుకోవాలి.

5. ఇప్పుడు అందులో వెజిటేబుల్ స్టాక్ మరియు ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి.

6. మూత పెట్టి బియ్యం మెత్తగా ఉడికే వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి.

7. ఇప్పుడు అందులో కొత్తిమీర మరియు నిమ్మరసం చిలకరించి ఒక సారి మిక్స్ చేయాలి అంతే నిమ్మరసం కొత్తిమీర రైస్ రెడీ.