Archive for October, 2017

బరువు తగ్గించుకోవడానికి సహాయపడే బేరిపండ్లు…

fresh-pear-250x250

బేరిపండులో 6గ్రాముల సోలబుల్ ఫైబర్ ఉండటం వల్ల ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బేరిపండ్లలో 100క్యాలరీలుంటాయి. ఇంత శాతం క్యాలరీలు మరే పండ్లలోనూ ఉండవు.

ప‌చ్చ‌గా ఉన్న‌ ప‌ళ్ల‌ను తెల్ల‌గా మార్చే హోం రెమిడీ…

images

చార్‌కోల్(బొగ్గు)తో ప‌ళ్ల‌ను బ్ర‌ష్ చేసుకోవ‌డం వ‌ల్ల క్రిములు, ప‌సుపు ద‌నం ఎఫెక్టివ్ గా తొల‌గిపోతుంది. చార్‌కోల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ‌గా ఉండ‌ట‌టం వ‌ల్ల ప‌ళ్ల‌పై ఉండే క్రిముల‌ను తొలగిస్తాయి.

సాఫ్ట్ అండ్ పింక్ లిప్స్ పొంద‌డానికి…

images (11)

ఆల్మండ్ ఆయిల్, రోజ్ వాటర్ ని పెదాలకు పట్టించడం వల్ల వాటికి అందాల్సిన పోషణ అందుతుంది. అలాగే అవి సాఫ్ట్ గా, పింక్ కలర్ లో కనిపించడానికి సహాయపడుతుంది.

ఒంటిలో నీరు చేరిందా?… ఇలా చేసి చూడండి…

 images
ఒంటిలో నీరు చేరిందా? లావుగా కనిపిస్తున్నామని ఫీలింగా ఉందా..? అయితే ఈ టిప్స్ పాటించండి. నీరు ఎక్కువగా తీసుకోకపోవడం ద్వారా శరీరం ఉబ్బినట్లు కనిపిస్తుంది. అందుచేత నీటిని కూడా నిత్యం తగిన మోతాదులో తీసుకోవాల్సిందే. అలాగే శరీరంలో చేరిన నీటిని వెలివేయడంలోనూ మనం శ్రద్ధ చూపాలి. ఇందుకు ఏం చేయాలంటే..? నీటిని బయటికి పంపించడంలో విటమిన్ బి6 బాగా ఉపయోగ పడుతుంది.
ఈ బి6 విటమిన్ ఎక్కువగా పిస్తా, చేపలు, అరటి పండ్లు, పాలకూర, డ్రై ఫ్రూట్స్‌ళో పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా నీటిని శరీరం నుంచి యూరిన్, చెమట రూపంలో తొలగించుకోవచ్చు. అలాగే పొటాషియం కూడా అధిక నీటిని శరీరం నుంచి పంపించడంలో మెరుగ్గా పనిచేస్తుంది. అరటి పండ్లు, అవకాడోలు, బీన్స్ , పాలకూర వంటి ఆహార పదార్థాలను తీసుకుంటే శరీరంలో అధికంగా ఉన్న నీరు బయటికి పోతుంది.
ఇంకా శరీరంలో ఉప్పు చేరకుండా చూసుకోవాలి. ఉప్పును అధికంగా తీసుకుంటే.. సోడియం శరీరంలో ఎక్కువ నీరు నిల్వ ఉండేలా చేస్తుంది. కాబట్టి ఉప్పు తీసుకోవడం తగ్గిస్తే చాలు. శరీరంలో అధికంగా ఉన్న నీరు బయటికి పోతుంది. వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో నిల్వ అయ్యే అధిక నీటి సమస్య నుంచి బయటపడవచ్చు. చక్కెర, పిండిప దార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని మానేయడం మంచిది. లేదంటే శరీరంలో నీటి నిల్వ అధికమవుతుంది.

అలెప్పే ఫిష్ కర్రీ రిసిపి ఎలా తయారు చేయాలో చూద్దాం… కేరళ స్టైల్ ఫిష్ కర్రీ…

images (1)

కావల్సిన పదార్థాలు:

చేప ముక్కలు – 1/2kg

ఆవాలు – 1tsp

కొబ్బరి నూనె – 50grm

మెంతిపొడి – 1/4tsp

అల్లం తురుము- 1tsp

వెల్లుల్లి తరుగు – 1/4cup

పచ్చిమిర్చి – 8-10(సన్నగాతరిగిపెట్టుకోవాలి)

కరివేపాకు – రెండు రెమ్మలు

పసుపు – 1/4tsp

కాశ్మీరి చిల్లీ పౌడర్ – 1tsp

ధనియాల పొడి – 1tsp

కొబ్బరి పాలు – 1cup(చిక్కటివి), పల్చనివి: 1/2cup

ఉప్పు – రుచికి సరిపడా

ఉల్లి తరుగు – 1/2cup

పచ్చి మామిడి కాయ ముక్క – 1చిన్నది

టమోటో: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

తయారు చేయు విధానం:

1. ముందుగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, కరివేపాకు వేసి వేగించాలి.

2. తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి, ఉల్లి తరుగులు, పచ్చిమిర్చి, టమోటో ముక్కలు వేసి వేగించాలి.

3. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా వేగిన తర్వాత అందులో ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం వేసి మామిడి ముక్కలు, చేప ముక్కలు వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోయాలి.

4. తర్వాత రెండవసారి మిక్సీ వేయగా వచ్చిన పల్చని కొబ్బరిపాలు పోసి చేప ముక్కలు మెత్తబడే వరకూ ఉడికించాలి.

5. కొద్దిగా చేపలు ఉడికిన తర్వాత చిక్కటి కొబ్బరిపాలు పోసి పొయ్యి నుంచి దింపి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే అలెప్పె ఫిష్ కర్రీ రిసిపి రెడీ.

వేడినీళ్లు లేదా గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు…

images (8)

శరీరంలో పేరుకున్న క్రిములను చల్లటి నీటి కంటే వెచ్చటి నీళ్లు చాలా ఈజీగా తొలగిస్తాయి. అలాగే హాట్ వాటర్ తీసుకోవడం వలన శరీరంలో ఉండే ఫ్యాట్‌ని తగ్గించి బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి. క్యాలరీలను చాలా వేగంగా కరిగడానికి వేడినీళ్లు ఉపయోగపడతాయి.

ఉదయాన్నే అల్పాహారానికి ముందు ఒక గ్లాసు వేడినీళ్లు తాగడం వల్ల అన్ హెల్తీ ఫుడ్ తీసుకోకుండా ఫ్యాట్ ఫుడ్‌కి దూరంగా ఉంచడంతోపాటు మన పొట్ట నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది. వేడినీళ్లు తాగడం వల్ల ఆకలి చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి వేడి లేదా గోరువెచ్చని నీళ్లు తాగితే బరువు తగ్గడం చాలా ఈజీ.

సగ్గుబియ్యం(సాబూదాన) – క్యారట్ పాయసం ఎలా తయారుచేయాలో చుద్దాం…

images (6)

కావలసినపదార్థాలు:

సగ్గుబియ్యం (సాబూదాన్) – 1/2cup

పాలు – 1/2ltr

పంచదార – 250grms

క్యారట్ తురుము – 1cup

బాదంపప్పులు – 1/2cup (దోరగా వేయించి పొడి చేయాలి)

ఏలకుల పొడి – 1tsp

కుంకుమపువ్వు – 1/4tsp

నెయ్యి – 2tbsp

జీడిపప్పు, కిస్‌మిస్ – గార్నిషింగ్ కు సరిపడా

తయారు చేయు విధానం:

1. ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక కప్పు నీటిలో సుమారు అరగంటసేపు నాననివ్వాలి.

2. తర్వాత పాలను మరిగించాలి.

3. అదే సమయంలో సగ్గుబియ్యంలో తగినంత నీరు పోసి ఉడికించి ఎక్కువగా ఉన్న నీటిని ఒంపేయాలి.

4. పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక, క్యారట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి తీసేయాలి.

5. అదే పాన్ లో మరి కాస్త నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేయించి తీసేయాలి.

6. ఒక గ్లాసులో కొద్దిగా పాలు, కుంకుమపువ్వు వేసి కలపాలి.

7. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో వేసి ఉడికించిన సగ్గుబియ్యం, వేయించి ఉంచుకున్న క్యారట్ తురుము, ఏలకులపొడి, కుంకుమపువ్వు పాలు వేసి బాగా కలిపి 10 నిముషాలు ఉంచాలి.

8. చివరగా వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్‌మిస్‌లు వేసి కలిపి దించేయాలి. అంతే క్యారెట్ సాబుదాన పాయసం రెడీ.

రోజ్ వాటర్, ఆల్మండ్ ఆయిల్ కలిపిన మిశ్రమం చర్మానికి చేసే అద్భుతం…

images (80)

ఆల్మండ్ ఆయిల్ 2 టీస్పూన్లు రోజ్ వాటర్ 2 టీస్పూన్లు సమానంగా తీసుకోవాలి. రెండు పదార్థాలను ఒక గిన్నెలో బాగా  మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించాలి. 15 నిమిషాలు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో మైల్డ్ సోప్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.

– ఈ న్యాచురల్ ఫేస్ ప్యాక్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఈ రిచ్ గా ఉంటాయి. ఇవి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీనివల్ల చర్మంలో ముడతలు, వయసు పెరుగుతున్న లక్షణాలు, ఫైన్ లైన్స్, ఏజ్ స్పాట్స్ తగ్గుతాయి.

రోజ్ వాటర్, ఆల్మండ్ ఆయిల్ రెండింటిలోనూ స్కిన్ హైడ్రేటింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఇవి చర్మ రంధ్రాల్లో మాయిశ్చరైజర్ ని రీస్టోర్ చేస్తాయి. దీనివల్ల చర్మం స్మూత్ గా, సాఫ్ట్ గా మారుతుంది.

ఈ హోంమేడ్ ఫేస్ ప్యాక్ లో విటమిన్ E ఉంటుంది. ఇది డార్క్ సర్కిల్స్ ని తగ్గిస్తాయి. కళ్ల కింద, నోటి చుట్టూ ఏర్పడే ఈ వలయాలను తగ్గించడమే కాకుండా చర్మ కణాలకు పోషణ అందిస్తుంది.

ఆయిల్ బేస్డ్ ఫేస్ ప్యాక్ యాక్నెని మరింత పెంచుతాయని భావిస్తారు. కానీ ఈ ఆల్మండ్ ఆయిల్, రోజ్ వాటర్ మిశ్రమం రంధ్రాల్లో ఉండే బ్యాక్టీరియా, దుమ్ముని బయటకు పంపి యాక్నెను నివారిస్తాయి.

ఆల్మండ్ ఆయిల్, రోజ్ వాటర్ కాంబినేషన్ దురద నివారించి చర్మాన్ని స్మూత్ గా మారుస్తుంది. అలాగే చిన్న చిన్న గాయాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలుంటాయి.

సర్వాంగాసనం చేయు విధానం మరియు ఉపయోగాలు…

images (36)

సర్వాంగాసనం:

వెల్లకిలా పడుకుని సుధీర్ఘ శ్వాస తీసుకుంటూ మెల్లగా ఒక్కసారిగా కాళ్ళను పైకి తీసుకెళ్ళాలి.

చేతులు నడుము భాగమున సహాయంగా ఉంచాలి.

ఉండగలిగినంత సేపు ఉండి పూర్వపుస్థితికి రావలయును. (3 సార్లు)

ఉపయోగం:

1. ఈ ఆసనం చాలా ఉత్తమమయినది. శీర్షాసన ఉపయోగములు వచ్చును.

2. నడుము, వెన్నుముక, గ్యాస్ట్రిక్, మలబద్ధకం, అజీర్తి, థైరాయిడ్, మెడ నరాలు, సయాటికా మొదలగు ఎన్నో సమస్యలు తొలగించుకోవచ్చు, ఆస్త్మా, సైనస్, ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలు నయమగును. గుండేకు బలం చేకూరి రక్తప్రసరణ సక్రమమగును.

దహీ పూరి యమ్మీ ఈవెనింగ్ స్నాక్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (8)

కావల్సిన పదార్థాలు:

పూరిలు: 10

పెరుగు – 1cup

సేవ్(సన్నని మిక్షర్) – 1cup

ఉడికించిన బంగాళ దుంపలు – 1cup

ఉడికించిన బఠానీలు – 1cup

మింట్ పచ్చడి – 1tbsp

కొత్తిమీర పచ్చడి – 1tbsp

మసాలా చాట్ – 1 tsp

కారం – 1/4 tsp

తరిగిన కొత్తిమీర – 1/2 tsp

ఉప్పు – రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా బంగాళదుంపలను ఉడికించి, తొక్క తీసి పెద్ద గిన్నెలో వేసి మెత్తగా చిదిమి పెట్టుకోవాలి.

2. ఇప్పుడు అందులో ఛాట్ మసాలా, చిల్లీపౌడర్ మరియు ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.

3. తర్వాత రెడిమేడ్ పూరీలను ఒక ప్లేట్ లోకి తీసుకొని మద్యలో ఒకసైడ్ మాత్రమే రంద్రం పెట్టుకోవాలి . ఆ పూరిల్లో బంగాళదుంప మిశ్రమాన్ని ఫిల్ చేయాలి.

4. తర్వాత వాటి మీద పెరుగు ఒకటి లేదా రెండు చెంచాలతో ఫిల్ చేయాలి .

5. అలాగే పెరుగు మీద మీకు నచ్చే రుచిని బట్టి కొత్తిమీర లేదా పుదీనా చట్నీని కూడా వేయాలి .

6. చివరగా సేవ్ మరియు కొత్తిమీర తరుగు చిలకరించాలి . 7. అంతే యమ్మీ డెలిషియస్ దహీ పూరి రెడీ. దీన్ని తయారచేసిన వెంటనే అందిస్తే కమ్మని రుచిని కలిగి క్రిస్పీగా ఉంటుంది.