Archive for November, 2017

హోం మేడ్ చికెన్ పిజ్జా రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (27)

కావలసిన పదార్థాలు:

రెడీమేడ్ పిజ్జా బేస్: 1

చికెన్ కీమా: 100grm

జీడిపప్పు పేస్ట్: 1/2cup

వెన్న: 100grm

ఛీజ్ తురుము: 50grm

ఛీజ్ పేస్ట్: 50grm

మంచినీళ్లు: 1cup

టొమోటో సాస్: 1tsp

కొత్తిమీర తురుము: 2tsp

పుదీనా తురుము: 1tsp

కారం: 1/4 tsp

ధనియాలపొడి: 1/4 tsp

గరంమసాలా: 1/4 tsp

మిరియాలపొడి: 1/4 tsp

ఉప్పు: రుచికి సరిపడా

పంచదారపొడి: చిటికెడు

వెల్లుల్లి ముక్కలు: కొద్దిగా

తయారు చేయు విధానము:

1. ఒక పాత్రలో కాస్తంత ఛీజ్ పేస్ట్, జీడిపప్పు పేస్ట్, పంచదార పొడి వేసి బాగా స్సూన్‌తో కలిపి పక్కన పెట్టుకోవాలి.

2. పాన్‌లో మిగిలిన వెన్న వేసి కరిగాక పుదీనా, వెల్లుల్లి వేసి కాసేపు వేయించాలి. అందులోనే చికెన్ కీమా వేసి, మిగిలిన జీడిపప్పు పేస్ట్, తగినింత ఉప్పు వేసి కలుపుతూ రెండు నిమిషాల పాటు వేయించాలి.

3. తర్వాత పై మిశ్రమంలోనే కారం, ధనియాలపొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి సగం టొమోటో సాస్, కొత్తమీర, తగినంత ఉప్పువేసి బాగా కలిపి నీళ్లు పోసి కాస్త గ్రేవీ ఉండేలా ఉడికించి దింపుకోవాలి.

4. చివర్లో పిజ్జా బేస్ మీద, మొదట్లో తయారు చేసుకున్న వెన్న మిశ్రమాన్ని రాసి పైన చికెన్ కీమా కూరని సర్ధాలి. దీనిపైన కొత్తిమీర తురుము, చీజ్ తురుము కూడా చల్లి ఓవెన్‌లో ఒక 5 నిమిషాలపాటు పెట్టి హీట్ అయిన తర్వాత తీసేయాలి. అంతే చికెన్ పిజ్జా రెడీ.

బీట్ రూట్ పనీర్ పులావ్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download

కావలసిన పదార్ధాలు:

బియ్యం: 2 cups

బీట్ రూట్ – 1 (grated)

పన్నీర్ – 100gms

నెయ్యి – 3 tbsp

మిరియాలు – 1 tbsp

ఉల్లిపాయలు- 1 (chopped)

జీడిపప్పు – 200 gms (chopped)

ఎండుద్రాక్ష – 1 cup

కారం- 1 tbsp

గరం మసాలా – ½ tbsp

పుదీనా – ½ cup(chopped)

కొత్తిమీర : కొద్దిగా

ఉప్పు రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి కాగిన తర్వాత అందులో మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిముషాలు వేగించాలి.

2. తర్వాత అందులోనే జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి ఒక నిముషం వేగనివ్వాలి.

3. ఇప్పుడు అందులోనే బీటర్ రూట్ తురుము, పనీర్ తురుము మరియు పచ్చిమిర్చి తరుగు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ ప్రై చేసుకోవాలి.

4. బీట్ రూట్, పనీర్ మెత్తబడ్డాక, అందులో గరం మసాలా, పుదీనా, ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.

5. మసాలా పచ్చివాసన పోయే వరకూ ఫ్రై చేసి అందులో కడిగిపెట్టుకొన్న బియ్యాన్ని వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.

6. ఇప్పుడు ఈ మిశ్రమంలో మూడు కప్పుల నీరు పోసి మొత్తం మిక్స్ చేసి, 2విజిల్స్ వచ్చేవరకూ ఉడికించుకోవాలి.

7. విజిల్స్ వచ్చిన తర్వాత క్రిందికి దింపుకొని, కుక్కర్లో ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత కొత్తిమీర చల్లి తర్వాత సర్వ్ చేయాలి. అంతే పనీర్ అండ్ బీట్ రూట్ పులావ్ రెడీ. గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది.

చర్మంపై ఉండే మృతకణాలను తొలగించే సింపుల్ టిప్…

face-packs-natural-ingredients

నారింజ తొక్కను ఎండబెట్టి, పొడి చేసి, సున్నిపిండిలో కలుపుకుంటే మంచిది. ఈ పిండిని స్నానానికి ముందు ఒంటికి రాసుకుని రబ్ చేస్తే… చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిపోతాయి. చర్మం మృదువుగా అవటమే కాకుండా, కొత్త మెరుపును సంతరించుకుంటుంది.

ఉల్లిపాయ పరోటా ఎలా తయారుచేయాలో చూద్దాం…

download

కావల్సిన పదార్థాలు:

గోధుమ పిండి: 11/2cup

ఉల్లిపాయ: 1cup(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

జీలకర్ర: 1tsp

పచ్చిమిర్చి: 2-4(సన్నగా చిన్న ముక్కలుగా తగిరిపెట్టుకోవాలి)

గరం మసాలా: 1/2tsp

కొత్తిమీర తరుగు: 4tbsp

ధనియాల పొడి: 1tsp

నూనె: ఫ్రై చేయడానికి

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ఒక చిన్నపాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి అవి చిటపటలాడాక అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

2. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, గరం మసాలా, మరియు ధనియాల పొడి, వేసి బాగా మిక్స్ చేసి, రెండు నిముషాలు వేగించి, స్టౌ ఆఫ్ చేసేయాలి. ఈ మిశ్రమాన్ని పది నిముషాల పాటు చల్లారనివ్వాలి.

3. ఫ్రై చేసి చల్లారబెట్టుకొన్న ఆనియన్ మిశ్రమంలో ఒక కప్పు గోధుమ పిండి, రెండు చెంచాల నూనె, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళు కలుపుకొని చపాతీ పిండిలా మృదువుగా, మెత్తగా కలుపుకోవాలి.

4. తర్వాత కలుపుకొన్న పిండికి కొద్దిగా నూనె రాసి, ఒక పల్చటి కాటన్ క్లాత్ లో చుట్టి ఒక పదిహేను నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15నిముషాల తర్వాత పిండిలో నుండి కొద్దికొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి.

5. తర్వాత వీటిని చపాతీ కర్రతో చపాతీల్లా చుట్టుకోవాలి. ఇలా అన్నింటింని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

6. ఇప్పుడు స్టౌ మీద తవా పెట్టి వేడియ్యాక తవా మీద చపాతీల వేసి రెండు వైపులా నూనె రాసి, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. ఇలా మొత్తం అన్ని చపాతీలనూ కాల్చుకోవాలి. వీటిని పొటాటో కర్రీ లేదా దోసకాయ రైతాతో వేడి వేడిగా సర్వ్ చేయాలి.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో మేలు చేసే కొర్రలు…

download (4)

పెద్ద పేగును ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచడంతోపాటు మలబద్దకాన్ని తొలగిస్తుంది. గోధుమలు, వరి అన్నం కన్నా చాలా తక్కువ మొత్తంలో తీపిని కొర్రలు కలిగి ఉంటాయి. దీంతో ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి వారి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.

నెయిల్ పాలిష్‌ను ఫ్రెష్‌గా ఉండేలా నిల్వ చేసే పద్దతులు…

download (6)

1. నెయిల్ పాలిష్ ఎండిపోకుండా వుండాలంటే సీసాను ఫ్రిజ్‌లో వుంచండి. నెయిల్ పాలిష్‌ను రిఫ్రిజరేటర్‌లో ఉంచేటప్పుడు బ్యూటి కిట్ షెల్స్ సెపరేట్‌గా ఉంటుంది. అందులో స్టోర్ చేయాల్సి ఉంటుంది. స్టోర్ చేసిన నెయిల్ పాలిష్‌లను ఒక నెలలోపుల ఎడిపోకుండా లేదా చిక్కబడక ముందే ఉపయోగించవచ్చు.

2. మరో బెస్ట్ ఆప్షన్ సూర్యరశ్మి తగలని ప్రదేశంలో కూడా నెయిల్ పాలిష్‌ను స్టోర్ చేసుకోవచ్చు. అందువల్ల త్వరగా పాడవకుండా ఉంటాయి.

3. నెయిల్ పాలిష్ బాటిల్స్‌ను స్టోర్ చేసేటప్పుడు అవి నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల త్వరగా ఎండిపోకుండా ఉండటమే కాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. ఒక వేళ నెయిల్ పాలిష్ బాటిల్ పడిపోయినా వెంటనే దానిని తిరిగి నిటారుగా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల నెయిల్ పాలిష్ బాటిల్‌లో ఉన్న పదార్థాలు విడిపోకుండా నిరోధిస్తుంది.

కంప్యూటర్ వర్క్… కుర్చీలో ఎక్కువసేపు కూర్చునేవారి కోసం…

download (4)
ఆఫీసులో దాదాపు 8 గంటలపాటు కూర్చునే ఉంటాం. ఆ సమయంలో కూర్చునే పద్ధతి సరిగా ఉండదు. గాలి కూడా సరిగా పీల్చలేం. ఒక్కొక్కసారి ఊపిరి బిగబట్టి కంప్యూటర్‌కు అతుక్కుపోతాం. అలా చేయడం వల్ల శరీరం చాలా అలసిపోతుంది. కాబట్టి కనీసం మూడు గంటలకోసారి అయినా డీప్ బ్రీతింగ్ తప్పనిసరి. అంతేకాకుండా ఈ వ్యాయామాలు కూడా చేస్తే ఒత్తిడి సమస్య నుంచి కూడా దూరం కావచ్చు.
వెన్నెముక నిటారుగా ఉంచి స్థిరంగా సుఖాసనంలో కూర్చోవాలి.
నాసికా రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకోవాలి.
గొంతు పైభాగంలో రాపిడి చేస్తున్నట్టుగా గాలి లోపలికి పోవాలి.
ఉండగలిగినంత సమయం ఉండి నెమ్మదిగా గొంతు వద్ద రాపిడి కలుగజేస్తూ గాలిని మొత్తం బయటకు వదలాలి.
ఈ వ్యాయామాన్నిఓషియానిక్ బ్రీతింగ్ అంటారు.
ఈ వ్యాయామం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. అవేంటో చూద్దాం:
* జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థను శక్తివంతంగా ఉంచేందుకు తోడ్పడుతుంది.
* ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది.
*ఊపిరితిత్తుల్లోకి వెళ్లే వేడిగాలి వలన జలుబు, ఆస్తమా వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
* థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఈ వ్యాయామం అద్భుతంగా పనిచేస్తుంది.

డయాబెటిస్‌ను నివారించే బెస్ట్ పవర్ ఫుడ్స్…

download (65)

ఓట్స్: డయాబెటిస్ వారికి ఓట్స్ ఒక హెల్తీ ఫైబర్ ఫుడ్. పొట్టలో డైజెస్టివ్ ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేయడంలో ఓట్స్‌ గొప్పగా సహాయపడుతుంది. అలాగే మీరు తీసుకొనే భోజనం నుండి శరీరానికి అందిన కార్బోహైడ్రేట్స్ బ్లడ్ షుగర్‌గా మారడాన్ని ఆలస్యం చేస్తుంది.

సాల్మన్ చేపలు: డయాబెటిక్ పేషంట్స్ చేపలు తినవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్‌ను నివారించడంలో ఇవి చాలా ఉపయోగకరమైనవి. చేపల్లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ డయాబెటిస్‌కు చాలా మంచిది. శరీరంలోని ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గిస్తుంది.

బార్లీ: బార్లీ, ఓట్ మీల్, బ్రౌన్ బ్రెడ్ మరియు ఇతర తృణధాన్యాలలో ఫైబర్ ఫుష్కలంగా ఉంది. వీటిలో మెగ్నీషియం, క్రోమియం ఫొల్లెట్ మరియు ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.

బీన్స్: బీన్స్‌లో హై క్యాలరీలు, కిడ్నీబీన్స్, పింటో, నేవీ, బ్లాక్ మరియు ఇతర రకాల బీన్స్ కూడా ఉన్నాయి. వీటన్నింటిలో న్యూట్రీషియన్స్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఈ న్యూట్రీషియన్స్ మరియు ఫైబర్స్ కడుపు ఫుల్‌గా ఉండేలా చేసి, ఎక్కువ సమయం ఆకలి కాకుండా చేస్తుంది.

ముఖం కొత్త అందంతో మెరిసిపోవాలంటే…

face-pic

ఆరెంజ్ పండ్లు తినగా మిగిలిన తొక్కను పడవేయకుండా, వాటిని అలాగే నీడపట్టున ఉంచి ఆరబెట్టాలి. ఇవి మరీ ఒరుగుల్లాగా ఎండిపోతే పొడి చేసుకునేందుకు వీలుకాదు. కాబట్టి ఓ మోస్తరుగా మిక్సీలో పొడి చేసుకునేందుకు వీలుగా, పెళుసుగా ఉండేలా ఎండితే సరిపోతుంది.

ఇలా ఎండబెట్టిన నారింజ తొక్కలను పొడిచేసుకుని పొడిగా ఉండే బాటిల్‌లో భద్రపరచుకోవాలి. వీలు దొరికినప్పుడల్లా ఒక టీస్పూన్ నారింజపొడిని తీసుకుని, దానికి తగినన్ని పాలు కలిపి, మెత్తగా పేస్ట్‌లాగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లాగా వేసుకుని, అరగంట తరువాత తీసివేస్తే సరిపోతుంది. ఇది చాలా సహజమైన బ్లీచింగ్‌లాగా పనిచేస్తుంది కాబట్టి, ముఖం కొత్త అందంతో మెరిసిపోతుంది.

హార్ట్ బర్నింగ్, ఎసిడిటి నివారించుకోవడానికి హెల్తీ మార్గాలు…

images (71)

అల్లం: అల్లంకు మంట తగ్గించే శక్తి వుంది. సుమారు 500 మి.గ్రా. అల్లం పచ్చిది లేదా ఇతర ఆమారంతో కలిపి తీసుకోండి. లేదా అల్లం టీ తాగి రిలీఫ్ పొందండి. అల్లం కొన్ని రకాల జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. హార్ట్ బర్న్ మరియు అసిడిక్ రిఫ్లెక్షన్ నివారించడంలో ఇది బాగా సహాయపడుతుంది. అందుకే రెగ్యులర్ డైట్‌లో దీన్ని చేర్చుకోవడం చాలా అవసరం.

బాదం: బాదంపప్పు గుండెలో మంటను తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. గుండె మంట వచ్చినపుడు రెండు బాదం పప్పులు తినండి. వీటిలో వుండే అధికమైన నూనె పొట్టలో ఏర్పడిన ఎసిడిటీని దూరం చేస్తుంది. వెంటనే గుండెమంట తగ్గుతుంది.

అరటి పండ్లు: అరటి పండ్లు తినడం వల్ల హార్ట్ బర్న్ నివారించుకోవచ్చు. వేసవిలో హార్ట్ బర్న్ నివారించుకోవడానికి ఇది ఒక ఉత్తమ మార్గం. అరటిపండులో అధికంగా పొటాషియంతో పాటు నేచురల్ ఆంటాసిడ్స్(సహజ ఆమ్లహారం) ఉండి గుండె మంట నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణకోశం శుభ్రపరచడానికి మరియు మలబద్ధకం నివారికి బాగా సహయపడుతుంది.