Archive for December, 2017

ఫ్లవర్ వాజ్‌ను శుభ్రం చేయడానికి సులువైన మార్గం…

images (31)

ఫ్లవర్ వాజ్‌లు నీళ్లతో నిల్వ ఉండటం వల్ల లోపల ఫంగస్ పేరుకుపోతుంది. దాని వల్ల పువ్వులు త్వరగా వాడిపోయే అవకాశం ఉంది అందుకే వీటిని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి. అప్పుడప్పుడూ వాజులో కొద్దిగా నీళ్లు పోసి అర చెంచా బియ్యం వేసి అటు ఇటూ బాగా తిప్పి కడిగితే శుభ్రపడుతుంది.

అలాగే ఫ్లవర్ వాజ్‌లో సాల్ట్ కలిపిన నీరు పోస్తే ఫ్లవర్స్ ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటాయి.

కోడి గుడ్డు ఫ్రెష్ గా ఉందా లేదా తెలుసుకోవడం ఎలా?

egg-water

కోడి గుడ్డుని ఫ్రెష్ గా ఉందో లేదో తెలుసుకోవాలి అంటే, దానిని ఒక గ్లాస్ నీళ్లలో వేస్తే సరి, అది నీళ్లలో ఎంత మునిగితే అంత ఫ్రెష్ గా ఉన్నట్లే.

కొబ్బరి వడలను ఎలా తయారుచేయాలో చూద్దాం…

oetuqkiefcdjj_bigger

కావల్సిన పదార్థాలు:

కొబ్బరి: 2 cups(తురిమినది)

సూజి: ½cup

శెనగపిండి: ½cup

ఆవాలు: 1tsp

పచ్చిమిర్చి: 7(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

కరివేపాకు: రెండు రెమ్మలు(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

నెయ్యి: 1tbsp నూనె: 2 cups

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా కొబ్బరి తరుగు, శెనగపిండి మరియు సూజి రవ్వ ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మూడింటిని బాగా మిక్స్ చేయాలి.

2. ఇప్పుడు అందులో అరకప్పు నీళ్ళు పోసి ఉండలు లేకుండా చిక్కగా కలుపుకోవాలి.

3. ఇప్పుడు పాన్ లో నెయ్యి వేసి, వేడి చేయాలి. వేడయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు వేసి వేగించుకోవాలి. ఒక సెకను వేగించుకొన్న తర్వాత వీటిని కలిపి పెట్టుకొన్న పిండిమిశ్రమంలో వేయాలి.

4. తర్వాత అందులో ఉప్పు మరియు పచ్చిమిర్చి తరుగు వేసి, చేత్తో మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.

5. ఇప్పుడు స్టౌ మీద ఒక డీప్ బాటమ్ పాన్ పెట్టి, ఆయిల్ వేసి కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత పిండిని చేతిలోకి తీసుకొని వడలులాగా తట్టుకొని కాగేనూనెలో వేసి డీప్ ఫ్రైచేసుకోవాలి.

6. అంతే కొబ్బరి వడలు రెడీ. ఈ క్రిస్పీ కొబ్బరి వడలను కొత్తమీర చట్నీ లేదా రెడ్ చిల్లీ చట్నీతో సర్వ్ చేయాలి.

ఉత్కటాసనం చేయు విధానం మరియు ఉపయోగాలు…

images (6)

ఉత్కటాసనం:

పాదముల పంజాలు రెండు త్రాకించి మునివ్రేళ్ళ మీద ఉండాలి.

మడమలను మలద్వారం దగ్గర, చేతులను మోకాళ్ళ మీద ఉంచవలెను.

ఉపయోగం:

1. మూలశంక తొలగును, కాలివ్రేళ్ళు, తొడకండరాలు బలపడును.

పనీర్ ఆలూ గ్రేవీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (8)

పనీర్: 250gms (మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)

ఆలూ : 3లేదా 4(మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)

ఉల్లిపాయ: 2

టమోటా: 2

పసుపు: 1tsp

కారం: 1tsp

గరం మసాలా: ½tsp

పచ్చిమిరపకాయలు: 4

టమోటా సాస్: 1tsp

బిర్యానీ ఆకు: 1

జీలకర్ర: ½tsp

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: 2tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా ఫ్రైయింగ్ పాన్‌లో నూనె వేసి, వేడయ్యాక అందులో పన్నీర్ ముక్కలు వేసి మంట మీడియంగా పెట్టి 5-10నిముషాలు వేగించుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోనికి తీసి పక్కన పెట్టుకోవాలి.

2. అంతలోపు బంగాళదుంప ముక్కలను కూడా కావల్సిన సైజ్‌లో కట్ చేసుకొని, కుక్కర్‌లో వేసి ఒక విజిల్ వచ్చే వరకూ ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

3. తర్వాత మిక్సీలో ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి.

4. తర్వాత ఫ్రైయింగ్ పాన్‌లో కొద్దిగా నూనె వేసి, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేగించుకోవాలి.

5. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ వేసి రెండు నిముషాలు వేగించుకోవాలి.

6. అంతలోపు టమోటోను గుజ్జుగా తయారు చేసుకోవాలి(మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి)

7. తర్వాత వేగుతున్న మిశ్రమంలో కొద్దిగా ఉప్పు, పసుపు వేయడం వల్ల టమోటో త్వరగా ఉడుకుతుంది.

8. ఒకసారిగా ఉల్లిపాయ పేస్ట్ బ్రౌన్ కలర్‌కు మారగానే, టమోటో గుజ్జును అందులో వేయాలి. అలాగే కారం, టమోటో సాస్ మరియు గరం మసాలా వేసి, బాగా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.

9. ఎక్కువ మంట పెట్టి 2-3నిముషాలు ఉడకనివ్వాలి. తర్వాత మంటను మీడియంగా పెట్టి, అందులో పన్నీర్ క్యూబ్స్, ఉడికించి పెట్టుకొన్న బంగాళదుంపలు వేసి మరో ఐదు నిముషాలు ఉడికించుకోవాలి. అంతే పన్నీర్ ఆలూ గ్రేవీ రెడీ. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి. రోటీ, రైస్, చపాతీలకు మంచి కాంబినేష్.

హెల్తీ కెసర్ పిస్తా మిల్క్ షేక్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం… సమ్మర్ స్పెషల్…

download (4)

కావల్సిన పదార్థాలు:

పిస్తాచో(పిస్తాపప్పు)-1cup

కేసర్(కుంకుమపువ్వు)- కొద్దిగా

బాదం:1/2cup

పంచదార: 11/2cup

యాలకలు: 4-5

పాలు: 1ltr

తయారుచేయు విధానం:

1. ముందుగా బాదం మరియు పిస్తాలను రెండు డిఫరెంట్ బౌల్స్‌లో విడివిడిగా 6 గంటల సేపు నానబెట్టుకోవాలి.

2. 6 గంటల తర్వాత, గిన్నెలో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి.

3. పాలను బాగా మరిగించి, మంట తగ్గించి మరికొంత సేపే బాగా పాలు కాచాలి.

4. ఇప్పుడు ఒక మిక్స్ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకొన్న బాదం, పిస్తా మరియు యాలకలు వేసి మొత్తం మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

5.ఇప్పుడు ఈ పేస్ట్‌ను కాగుతున్న పాలలో వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు అదే పాలలో పంచదార వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత చివరగా కొద్దిగా కుంకుపువ్వు చిలకరించాలి.

6. పాలను తక్కువ మంటలోనే ఉడికించుకోవాలి.

7. పాలు కొద్దిగా చిక్కపబడుతున్నప్పుడు స్టౌ ఆఫ్ చేసి, ఈ మిల్క్ షేక్ గది ఉష్ణోగ్రతలో చల్లారనివ్వాలి.

సాఫ్ట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం…

images (3)

కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఇందులో ఉండే పోషకాలు చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడి చర్మం సాఫ్ట్ అండ్ గ్లోయింగ్‌గా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి, కొబ్బరినీళ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది.

నౌకాసనం చేయు విధానం మరియు ఉపయోగాలు…

download (6)

 

నౌకాసనం:

వెల్లకిలా పడుకోవాలి.

సుధీర్ఘశ్వాస తీసుకుంటూ చేతులు, కాళ్ళుపైకి తీసుకురావాలి.

కాళ్ళు మరీ పైకి రాకూడదు. ఉండ గలిగినంత సేపు ఉండి పూర్వపుస్ధితికి రావాలి(5సార్లు)

ఉపయోగం:

1. పొట్ట తగ్గుతుంది, మలబద్ధక సమస్య, గర్భాశయ సమస్యలు తొలగును. వెన్నుముక, నడుము బలోపేతమగును. ఋతుక్రమం సక్రమమగును.

రాగి, వెండి, ఇత్త‌డి పాత్ర‌ల‌ను శుభ్రం చేయడానికి సింపుల్ టిప్…

how-to-clean-silver-vessels
ఉప్పులో కొద్దిగా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను కలిపి రాగి, వెండి, ఇత్త‌డి పాత్ర‌ల‌ను తోమితే అవి త‌ళ‌త‌ళా మెరిసిపోతాయి.

బొద్దింకలను తరిమికొట్టడానికి వెల్లుల్లి…

images

 

వెల్లుల్లిపాయను మెత్తగా దంచి కొంచెం నీటితో కలిపి బొద్దింకలు వచ్చేచోట ఉంచితే అవి ఆ ప్రాంతానికి రావు.