Archive for January, 2018

ఉప్పు, మిరియాలు, నిమ్మ కలిపి తీసుకుంటే పొందే బెన్ఫిట్స్…

images (14)

ముక్కుదిబ్బడ: ఉప్పు, మిరియాల పొడి, నిమ్మలతో పాటు గోరువెచ్చని నీళ్లు కలిపి తీసుకుంటే శరీరంలో కావాల్సినంత హీట్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఇన్ల్ఫమేషన్ తగ్గించి, ముక్కు దిబ్బడను నివారిస్తుంది.

గొంతు నొప్పి: ఈ న్యాచురల్ డ్రింక్ యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది గొంతులోని బ్యాక్టీరియాను నివారిస్తుంది. గొంతులో నొప్పి, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను నివారించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

గాల్ బ్లాడర్ స్టోన్స్: ఉప్పు, మిరియాలు, నిమ్మలతో పాటు ఆలివ్ ఆయిల్ కలిపి తీసుకుంటే గాల్ బ్లాడర్‌లో ఇబ్బందిపెట్టే స్టోన్స్ నివారించవచ్చు. రెగ్యులర్‌గా తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

బరువు తగ్గడానికి: ఈ మిశ్రమాన్ని వేడినీటితో కలిపి ప్రతి రోజూ ఉదయాన్నే తీసుకుంటే మీ శరీరం మెటబాలిజం పెరిగి, ఫ్యాట్ బర్నింక్ కెపాసిటీ పెరుగుతుంది. దీనివల్ల బరువు తగ్గడం తేలికవుతుంది.

పంటినొప్పి: గోరు వెచ్చని నీటితో కలిపి ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కలిగి ఉండటం వల్ల పంటినొప్పి నివారిస్తుంది. పుక్కిలించినా పంటినొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఫ్లూ: ఈ మిశ్రమాన్ని తేనెతో పాటు తీసుకుంటే వైరస్‌లతో పోరాడుతుంది. ఫ్లూ లక్షణాలను కూడా నివారిస్తుంది.

వికారం: ఉప్పు, మిరియాలలో పొట్టలోని యాసిడ్స్‌ని న్యూట్రలైజ్ చేస్తుంది. నిమ్మరసం వికారాన్ని తగ్గిస్తుంది. అలాగే పొట్ట సమస్యలు, లక్షణాలను కూడా తగ్గిస్తుంది.

బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్‌ని శాశ్వతంగా దూరం చేసే ఔషధం…

images

కావాల్సిన పదార్థాలు:

ఒక ముక్క తురిమిన అల్లం

1 టీ స్పూన్ వెనిగర్

1 వెల్లుల్లి రెబ్బ ( తురుము కోవాలి )

1 టీ స్పూన్ తేనె

1 టీ స్పూన్ నిమ్మరసం

తయారు చేసే విధానం: అన్ని పదార్థాలను బాగా మిక్స్ చేయాలి. అన్నీ బాగా కలిసిపోయేవరకు కలుపుకోవాలి. పైన చెప్పిన పరిమాణంలో తయారు చేసుకుంటే ఒక వ్యక్తికి సరిపోతుంది. అవసరమైతే ఈ మిశ్రమాలన్ని ఎక్కువ తయారు చేసుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని ఐదు రోజులపాటు నిల్వ ఉంచుకోవచ్చు.

తీసుకునే విధానం: తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజులో ఆహారం తీసుకోవడానికి ముందు మూడుపూటలా తీసుకోవాలి. అయితే ఒక రోజులో పైన చెప్పిన పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు. రెగ్యులర్‌గా ఈ టిప్ ఫాలో అయితే మీరు ఊహించని విధంగా కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్ త్వరలోనే శాశ్వతంగా తగ్గిపోతాయి.

కార్పెట్ కొనే ముందు తెలుసుకోవల్సిన కొన్ని ముఖ్య విషయాలు…

 download (19)

ఫర్ఫెక్ట్ ప్యాడ్ కలిగిన కార్పెట్ ను ఎంపిక చేసుకోవాలి : ఫ్లోర్ మీద పరిచనప్పుడు ప్యాడింగ్ ఫర్ఫెక్ట్ గా ఉండాలి. మంచి మెటీరియల్ తో తయారుచేసిన ప్యాడ్స్ ను ఎంపిక చేసుకోవాలి .ఇలా ఉన్పప్పుడు చాలా త్వరగా పాడవకుండా, చిరిగిపోకుండా ఉంటాయి. రబ్బర్ లేదా ఫోమ్ మెటీరియల్ తో తయారుచేసిన వాటిని వివిధ రకాల కార్పెట్ స్టైల్స్ ను చూసి మరీ ఎంపిక చేసుకోవాలి.

మీ బడ్జెట్ కు సరిపోయేది : మీ బడ్జెట్ కు సరిపోయే కార్పెట్ ను ఎంపిక చేసుకొనేప్పుడు, ముందుగా షాపులను తెలుసుకోండి. లక్సరీ కార్పెట్స్ కు డిస్కౌంట్ కార్పెట్లకు మద్య వ్యత్యాసం తెలుసుకొని, ఖరీదైన మెటీరియల్ స్వభావం తెలుసుకొని ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది.

మీరు సురక్షితమైన ప్రదేశంలో కార్పెట్ ను ఎంపిక చేసుకోవాలి : కార్పెట్ కొనే ముందు సాధ్యమైనంత వరకూ మీబడ్జెట్ కు మరియు మీటేస్ట్ కు సరిపోయే ప్రదేశంలో కార్పెట్ ను ఎంపిక చేసుకోవలి. పెద్దపెద్ద షోరూమ్స్ , ఫ్లోరింగ్ కంపెనీలు, ఫర్నీచర్ స్టోర్స్, లార్జ్ డిపార్ట్ మెంట్ స్టోర్స్ మరియు ఆన్ లైన్ లో కాకుండా మీకు నచ్చిన చోట కొనండి.

నిర్వహణ బాధ్యతలు తెలుసుకోవాలి : తక్కువ మెయింటెనెన్స్ మరియు ముఖ్యంగా జాగ్రత్త కొన్ని రోజులు సురక్షితంగా ఉండేవి ఎంపిక చేసుకోవాలి . స్టెయిన్ రెసిస్టెన్స్ కార్పెట్ ను ఎంపిక చేసుకోవాలి. ఖరీ వాటికి దూరంగా ఉండాలి.

వారెంటీస్ : అందంగా కనబడుతున్నాయి కదా అని ప్రత్యేకమైన కార్పెట్స్ ను , లాంగ్ వ్యారెంటీ కార్పెట్స్ ను కొనుగోలు చేయకూడదు. చాలా వరకూ ఇలాంటి కార్పెట్స్ అరిగా ఇన్ స్టాల్ చేసి ఉండరు . కాబట్టి, వ్యారెంటీని చూడకుండా మీకు నచ్చినది ఎంపిక చేసుకోవాలి.

ఎలాంటి కార్పెట్ ను ఎంపిక చేసుకోవాలి : వాలిటైల్ సబ్ స్టాన్స్ లేని ఫార్మల్ డీహైడ్ కార్పెట్ ను మరియు కెమికల్స్ ప్రభావం లేని కార్పెట్ ను ఎంపిక చేసుకోవాలి. కార్పెట్ ను ఆర్గానికి మరియు ఉలెన్ వంటి నేచురల్ పదార్థాలతో తయారుచేసిన వాటిని ఎంపిక చేసుకోవాలి.

శరీర ఛాయ కోసం ఇంట్లో ఉండే ఔషదాలతో చిట్కాలు…

images (11)

నిమ్మరసంలో కొంచెం ఆవనూనె, కొంచెం కర్పూరం కలిపి, ఒంటికి రాసుకుని, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే శరీర ఛాయ పెరుగుతుంది.

ఇంట్లో ఉండే ఔషధాలతో బెల్లీఫాట్‌కు చెక్ పెట్టండి.

images (2)

చిన్న చిన్న చిట్కాలను పాటించి ఇంట్లో ఉండే ఔషధాలతో బెల్లీఫాట్‌ను తగ్గించుకోవచ్చు.

1. రోజును నిమ్మరసంతో ప్రారంభం: ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం కలుపుకుని కొద్దిగా ఉప్పు కలుపుకుని తాగాలి. బెల్లీఫాట్‌ను కరిగించడంలో ఇది చాలా మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.

2. తెల్ల అన్నంకి దూరం: తినే ఆహారంలో సాధ్యమైనంత వరకు తెల్ల అన్నాన్ని దూరంగా ఉంచాలి. తెల్ల అన్నంకి బదులుగా గోధుమ రంగు అన్నం (బ్రౌన్‌రైస్), బ్రౌన్ బ్రెడ్, ఓట్స్ లాంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.     

3. చక్కెర పదార్దాలకు దూరం: వీలైనంతవరకు చక్కెర పదార్దాలకు, పానీయాలకు మరియు తీపి వస్తువులకు దూరంగా ఉండటం మంచిది.

4. ఎక్కువ నీటిని త్రాగడం: రోజులో కొంత కొంత విరామంతో నీటిని ఎక్కువగా త్రాగడం వలన బెల్లీఫాట్‌ను నివారించవచ్చు.

5. వెల్లుల్లి రెబ్బలను నమలడం: రోజూ ఉదయాన్నే నిమ్మరసం తీసుకునే ముందు 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలను నమలడం వలన శరీర రక్తప్రసరణను సాఫీగా జరిగేలా చేసి అనవసర కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

6.  పండ్లు మరియు కూరగాయలతో: రోజూ ఉదయం మరియు సాయంత్రం ఒక గిన్నె నిండా పండ్లు లేదా కూరగాయలు తినాలి.

కనురెప్పలు బ్యూటిఫుల్ గా కనపించేందుకు మార్గాలు…

images (64)

మస్కరా:

మీరు పార్టీ కోసం బయట వెళుతున్నప్పుడు మీకు ఒక మందపాటి ఐలాష్ తక్షణం వేసుకోవాలంటే, మంచి మన్నికైన మస్కరాను ఉపయోగించడం ఉత్తమమైన పద్దతి. ఐలాష్ మందగా కనిబడుటకు మహిళల కోసం మస్కరా ఒక బ్యూటీ టిప్.ఇది చాలా సమర్థవంతంగా మరియు ప్రజాదరణ పొందిన పద్ధతి. మస్కరా వివిధ రకాల్లో పొడవు మరియు పొట్టి ఐలాష్ లుగా దొరుకుతుంది. ఇంకా ఇవి వివిధ రంగుల్లో లభ్యమవుతున్నాయి . అందువల్ల , తక్షణం మస్కరా వేసుకోవాలంటే అది ఎక్కువ సమయం నిలిచి ఉండాలంటే మస్కరా ఉత్తమమైన ఐలాష్.

మధుమేహం వ్యాధికి నేరేడు, వేపాకు రసంతో వైద్యం…

download (63)

షుగరు వ్యాధి ఉన్నవారు ప్రతిరోజూ పరగడుపున వేపాకురసం అరగ్లాసు తీసుకుంటే షుగర్ తగ్గుతుంది.

– అలాగే నేరేడు చెక్కను కాల్చి ఆ పొడి భద్రపరచుకుని, రోజూ పరగడుపున ఓ చెంచా పొడిని ఒక గ్లాసు నీళ్లతో కలిపి తాగితే షుగరు తగ్గుతుంది.

కిడ్నీ స్టోన్స్ నివారించే ఆయుర్వేదిక్ రెమెడీస్…

images (29)

– తులసి ఆకులు: తులసి వల్ల మూత్రపిండాలకు ఒక పటిష్టమైన ప్రభావం కలిగి ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్ళతో బాధపడుతున్నట్లైతే ఒక టీస్పూన్ తులసి రసం మరియు తేనె మిక్స్ చేసి తీసుకోవాలి. ఈ మూలిక వైద్యం వల్ల రెగ్యులర్‌గా ఆరునెలలపాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కిడ్నీలోని రాళ్ళునివారించిబడుతాయి. మరియు కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిపోయేందుకు సహాయపడుతుంది.

– కోకనట్ వాట్: కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి కోకనట్ వాటర్ గ్రేట్‌గా సహాయపడుతుంది. కోకనట్ వాటర్‌ను ప్రతి రోజూ తాగడం వల్ల కిడ్నీస్టోన్స్ మరియు ఇతర వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. రోజులో రెండు మూడు సార్లు కోకనట్ వాటర్‌ను కాలీ పొట్టతో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీ స్టోన్స్ తొలగింపబడుతుంది. భోజనానికి అరగంట ముందు తీసుకోవడం మంచిది.

– అలోవెర: కిడ్నీ స్టోన్స్‌ను క్లియర్ చేయడానికి కలబంద రసం చాలా అద్భుతంగా సహాయపడుతుంది. అలోవెరా జ్యూస్‌ను త్రాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా సహాయపడుతుంది.

స్పైసీ అండ్ టేస్టీ ఆనియన్ చికెన్ గ్రేవీ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (16)

కావల్సిన పదార్థాలు:

చికెన్ – 500 g

ఉల్లిపాయలు – 2 cups (finely chopped)

టమోటో – 1 cup (finely chopped)

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 teaspoon

పచ్చిమిర్చి – 5 to 6

పెరుగు – 1 cup

కారం – 1/2 teaspoon

నూనె: తగినంత

ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.

2. నూనె వేడి అయ్యాక అందులో ఉల్లిపాయలు ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

3. తర్వాత అందులోనే టమోటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించుకోవాలి.

4. టమోటో మెత్తబడే వరకూ 10 నిముషాలు వేగించుకోవాలి.

5. మరో పాన్‌లో ఆయిల్ వేసి, చికెన్ ముక్కలు వేసి షాలో ఫ్రై చేసుకోవాలి.

6. పది నిముషాల తర్వాత ముందుగా వేపుకుంటున్న పోపులో చికెన్ ముక్కలను ట్రాన్స్ ఫర్ చేయాలి. మొత్తం మిశ్రమం కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.

7. ఇప్పుడు అందులోనే పెరుగు, కారం వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు మొత్తం మిశ్రమం చిక్కగా మారే వరకూ ఉడికించుకోవాలి. అంతే ఆనియన్ చికెన్ గ్రేవీ రిసిపి రెడీ.

కంటి అద్దాల వలన ఏర్పడే మచ్చలను తొలగించే ఔషదాలు…

images

కంటి అద్దాలను వాడటం వలన ముక్కుపై మరియు కంటి కింద మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. కంటి అద్దాలు బరువుగా ఉండటం వలన ముక్కుపై మచ్చలు ఏర్పడతాయి. ఇలాంటి మచ్చలను తొలగించే సమర్థవంతమైన ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.

కలబంద

కలబంద చర్మానికి శీతలీకరణ ఏజెంట్ గా పని చేస్తుంది. ఈ మచ్చలను సహజంగా తగ్గించుకోటానికి, తాజా కలబంద గుజ్జును తీసుకొని, మచ్చలు ఉన్న ప్రాంతంలో నేరుగా అప్లై చేయండి. ఈ గుజ్జు ఎండే వరకు వేచి ఉండి, తరువాత చల్లటి నీటితో కడిగి వేయండి.

బంగాళదుంప

తురిమిన బంగాళదుంపను పేస్ట్ లా చేసి ముక్కుపై ఉండే నల్లటి మచ్చలపై నేరుగా అప్లై చేయండి. కంటి అద్దాల వలన ముక్కుపై ఏర్పడిన మచ్చలు తొలగిపోయే వరకు రోజు ఈ పద్దతిని అనుసరించండి.

దోసకాయ

తాజా దోసకాయ నుండి సన్నగా రెండు ముక్కలను కత్తిరించి, నల్లటి మచ్చలపై ఉంచండి. ఈ దోసకాయ ముక్కలు శీతలీకరణ ఏజంట్ గా పని చేసి, నల్లటి మచ్చలను సమర్థవంతంగా తగ్గిస్తాయి. లేదా కత్తిరించిన దోసకాయ ముక్కలను కంటి చుట్టూ రాయటం ద్వారా వీటి నుండి ఉపశమనం పొందుతారు.

నిమ్మ

తాజా నిమ్మపండు నుండి రసాన్ని తీసుకొని, తగినంత నీటిని కలపండి. ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్ సహాయంతో నల్లటి మచ్చలు ఉన్న ప్రాంతంలో అప్లై చేయండి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచి నీటితో కడిగి వేయండి.

తేనె

తేనెను పాలు మరియు ఓట్స్ లో కలపండి. ఈ మిశ్రమాన్ని, నల్ల మచ్చలపై అప్లై చేసి, 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచండి. ఈ మిశ్రమం ముఖం నుండి తొలగించిన తరువాత కలిగే మార్పులను గమనించండి.