కళ్లు హెల్తీగా, ఫ్రెష్ గా, అందంగా కనబడటానికి సింపుల్ హోం రెమెడీస్…

232425094_9923eddd17_o

కీరదోసకాయ: కీరదోసకాయ ముక్కలను కళ్లకు అప్లై చేయడం వల్ల ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కళ్ళ ఉబ్బును తగ్గిస్తుంది. కళ్లకు కావల్సిన హైడ్రేషన్ అందిస్తుంది. రెండు పల్చని కీరదోసకాయ ముక్కలను రెండు కళ్ళ మీద ఉంచి, కొంత సేపు రిలాక్స్ అవ్వాలి. కీరదోసకాయలో ఉండే వాటర్ కంటెంట్ వల్ల , కళ్ళమీద చర్మంను పునరుత్తేజపరుస్తుంది. కళ్లు చూడటానికి ఫ్రెష్ గా కనబడుతాయి.

ఐస్ వాటర్: ఐస్ వాటర్ తో ముఖం కడుక్కోవడం వల్ల చర్మంలో స్ట్రెస్ తగ్గిస్తుంది. చర్మం కాంతివంతంగా పునరుత్తేజితం అవుతుంది. ఐస్ క్యూబ్స్ తీసుకుని, కళ్ళ చుట్టూ అప్లై చేస్తూ మసాజ్ చేయాలి. కొద్దిసేపు మసాజ్ చేసిన తర్వాత నేచురల్ గా డ్రైగా మారనివ్వాలి. రాత్రి నిద్రించడానికి ముందు ఐస్ వాటర్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల, నిద్రలేచే సమయానికి కళ్లకు విశ్రాంతి అందడం వల్ల కళ్ళు ఫ్రెష్ గా కనబడుతాయి.

కన్సీలర్ ను ఉపయోగించాలి: కళ్ల అలసటను, నీర్జీవంగా మారిన కళ్ళకు కన్సీలర్ ఒక ఈజీ రెమెడీ. ఇది కళ్ళు అందంగా కనబడేలా చేస్తుంది. కళ్ల ఉబ్బును తగ్గిస్తుంది. డార్క్ సర్కిల్స్ ను నివారిస్తుంది. కన్సీలర్ ను ఉపయోగించడం వల్ల కళ్ల వద్ద చర్మం బ్రైట్ గా మారుతుంది. డార్క్ స్పాట్స్ ను హైడ్ చేస్తుంది. కాబట్టి, మీ స్కిన్ టోన్ కు సరిపోయే కన్సీలర్ ను ఎంపిక చేసుకోవడం మంచిది.

బంగాళ దుంప ముక్కలు: ఒక బంగాళదుంప తీసుకుని, కొద్ది సేపు ఫ్రిజ్ లో ఉంచాలి. అరగంట తర్వాత బయటకు తీసి, సన్నని స్లైస్ గా కట్ చేయాలి. రెండు స్లైస్ తీసుకుని కళ్ళ మీద పెట్టి, విశ్రాంతి తీసుకోవాలి. ఈ కోల్డ్ పొటాటో స్లైస్ కళ్ళను కాంతివంతంగా మార్చుతుంది. కళ్ళ క్రింద చర్మానికి తేమను అందిస్తుంది. ఫ్రెష్ అంగ్ యంగ్ లుక్ ను అందిస్తుంది. కళ్ల ఉబ్బును తగ్గిస్తుంది. డార్క్ సర్కిల్స్ ను నివారిస్తుంది.

ఎగ్ వైట్: ఎగ్ వైట్ ను కళ్లకు అప్లై చేయడం వల్ల కళ్ళ చుట్టూ ఉన్న డార్క్ స్కిన్ తొలగిపోతుంది. ఒక గుడ్డు తీసుకుని, అందులోని వైట్ మాత్రమే తీసుకుని దానికి కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, రెండూ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల కళ్ళక్రింద చర్మాన్ని టైట్ గా మార్చుతుంది, నేచురల్ యంగ్ ఫ్రెష్ లుక్ ను అందిస్తుంది.

Be the first to comment

Leave a Reply