పాలక్ మష్రుమ్ కాంబినేషన్ రిసిపి ఎలా తయారు చేయాలో చూద్దాం…

7874fcfc6e98f54bf3ceb7b09d424e3c

కావల్సిన పదార్థాలు:

బటన్ మష్రుమ్(పుట్టగొడుగులు): 15

ఉల్లిపాయ:1(సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి)

జీలకర్ర: 1tsp

కొత్తిమీర పొడి: 1tsp

గరం మసాలా పొడి: ½tsp

నిమ్మరసం: 1tbsp

నూనె: 1tbsp

ఉప్పు: రుచికి సరిపడా

నీళ్ళు: 1/2cup

పాలక్ పేస్ట్ కోసం:

పాలకూర: 1కట్ట (శుభ్రం చేసి కడిగి, తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)

అల్లం: ఒక అంగుళం

పచ్చిమిరపకాయలు: 2-4

దాల్చిన చెక్క: 1

గ్రీన్ యాలకులు: 4

లవంగాలు : 4

స్టార్ యానీస్: 1

కొత్తిమీర: ½cup(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

తయారు చేయు విధానం:

1. ముందుగా బటన్ మష్రుమ్ ను నీటిలో శుభ్రంగా కడిగి, తర్వాత వాటిని రెండు లేదా మూడు భాగాలుగా కట్ చేసుకోవాలి.

2. తర్వాత పాలక్ పేస్ట్ కోసం సిద్దం చేసుకొన్న మసాలాలన్నింటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నీళ్ళు కలపకుండా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

3. తర్వాత పాన్ లో నూనె వేసి వేడి చేసి అందులో, జీలకర్ర వేసి ఒక నిముషం వేగించుకోవాలి.

4. ఇప్పుడు అందులోనే సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి 5నిముషాలు మీడియం మంట మీద, ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

5. తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకొన్న పుట్టగొడుగులను వేసి 5-6నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో గ్రైండ్ చేసి పెట్టుకొన్న పాలక్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి.

6. తర్వాత అందులోనే ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా పౌడర్, వేసి మరో మూడు నిముషాలు వేగించుకోవాలి.

7. ఇప్పుడు అందులో అరకప్పు నీళ్ళు పోసి పది నిముషాల పాటు మీడియం మంటలో ఉడికించాలి.

8. మష్రుమ్ పూర్తిగా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసి, స్టౌవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఈ రిసిపి అన్నం, మరియు రోటీలకు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది.

Be the first to comment

Leave a Reply