చికెన్‌ గారెలు ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (9)

కావలసిన పదార్థాలు:

బోన్‌లెస్‌ చికెన్‌ – 1/2kg

శనగపప్పు – 3cups

గరం మాసాలా – 2 tsp

కారం – 2 tsp

అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – 2tbsp

పచ్చిమిరిపకాయలు – 4(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

ఉల్లిపాయలు – 3(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

పసుపు – 1/4tsp

కొత్తిమీర కట్ట – 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

నూనె: డీఫ్ ఫ్రై చేయడానికి సరిపడా

ఉప్పు – రుచికి సరిపడా

తయారు చేయు విధానం:

1. ఒక గిన్నెలో శనగపప్పు వేసి నీళ్లలో నానబెట్టుకోవాలి.

2. తర్వాత చికెన్‌ ముక్కలు శుభ్రంగా కడిగి కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పసుపు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి.

3. ఇప్పుడు ముందుగా నానబెట్టిన శనగపప్పును మెత్తగా రుబ్బుకోవాలి.

4. తర్వాత పేస్ట్ చేసుకొన్న శెనగపప్పు ముద్దలో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన చికెన్‌, మసాలా, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

5. ఇప్పడు పాన్ స్టౌ మీద పెట్టి నూనె సోపి వేడి అయ్యాక అందులో కొద్దిగా చికెన్‌ ముద్దను అరచేతిలో తీసుకుని మధ్యలో రంధ్రం చేసి నూనెలో వేయించాలి.అంతే చికెన్ గారెలు రెడీ.

Be the first to comment

Leave a Reply