వంకాయ మరియు టమోటో రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (1)

కావల్సిన పదార్థాలు:

వంకాయ: 4 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)

ఉల్లిపాయ : 1(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)

ఆయిల్ : ¼tsp

వెల్లుల్లి రెబ్బలు: 4- 5

టొమాటోస్ : 4 (సన్నగా తరిగినవి)

నీళ్ళు :1cup

కారం : 1 tbsp

దాల్చిన : చిన్నముక్క

బే ఆకు: 1

ఉప్పు : రుచికి సరిపడా

పసుపు పొడి :1tsp

జీలకర్ర పొడి : 1 tsp

గరం మసాలా పొడి : ½tsp

కొత్తిమిర : సన్నగా తరిగి పెట్టుకోవాలి

పచ్చిబఠానీలు : ½cup(ఉడికించినవి)

తయారుచేయు విధానం:

1. ముందుగా వంకాయలను ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి కొద్దిసేపు ఉండనిచ్చి తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి.

2. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. వేడిఅయ్యాక అందులో సన్నగా కట్ చేసుకొన్న ఉల్లిపాయముక్కలు మరియు వెల్లుల్లి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

3. 10నిముషాల తర్వాత అందులో సన్నగా తరిగిన టమోటో, వంకాయ ముక్కలు వేసి మరో 5నిముషాలు ఫై చేయాలి. తర్వాత కొద్దిగా నీరు, కారం, ఉప్పు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా మరియు కొత్తిమీర తరుగు వేసి ,మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలియబెట్టి, తర్వాత మూత పెట్టి 10నిముషాలు ఉడకనివ్వాలి.

4. పదినిముషాల తర్వాత మూత తీసి, అందులో ముందుగా ఉడికించుకొన్న పచ్చిబఠానీలను వేసి, మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి అంతే గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించి తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి.

Be the first to comment

Leave a Reply