డ్రై ఫ్రూట్ పులావ్ ఎలా తయారుచేయాలో చూద్దాం…కిడ్స్ స్పెషల్…

download (11)

కావల్సిన పదార్థాలు:

బియ్యం: 2cups,

బాదం: 10

ద్రాక్ష: 10

జీడిపప్పు: 10

నెయ్యి: 2tbsp

పెప్పర్ కార్న్: 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

బిర్యానీ ఆకు: 2

యాలకలు: 1

లవంగాలు: 1

దాల్చిన చెక్క: 1 Small

కుంకుమ పువ్వు: చిటికెడు

1. ముందుగా నాన్ స్టిక్ పాన్ లో కొద్దిగా నీళ్ళు పోసి వేడి చేయాలి.

2. అంతలోపు మరో నాన్ స్టిక్ పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో బిర్యానీ ఆకు, యాలకలు, లవంగాలు, దాల్చిన చెక్క, పెప్పర్ కార్న్స్, బాదం, జీడిపప్పు, ద్రాక్ష, నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి.

3. తర్వాత అందులోనే బియ్యం కూడా కడిగి వేసి మరో 2-3నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

4. ఇప్పుడు అందులో ఉప్పు, మరియు కుంకుమ పువ్వు వేసి మొత్తం మిశ్రమాన్ని మరో అరనిముషం పాటు ఫ్రై చేసి తర్వాత 3 కప్పులు హాట్ వాటర్ ను ఇందులో పోయాలి.

5. మొత్తం మిశ్రమం ఉడకడం ప్రాంభమవగానే, మూత పెట్టి బియ్యం మెత్తగా ఉడికే వరకూ ఉడికించుకోవాలి. అంతే రుచికరమైన ఈజీ డ్రై ఫ్రూట్ పులావ్ పిల్లల కోసం రెడీ. ఈ డ్రై ఫ్రూట్ పులావ్ కు స్వీట్ లేదా రైతాను సైడ్ గా సర్వ్ చేయవచ్చు.

Be the first to comment

Leave a Reply