టేస్టీ క్యాప్సికమ్ వ్రాప్ ఎలా తయారుచేయాలో చూద్దాం…హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి…

images (18)

కావల్సిన పదార్థాలు:

గోధుమలు పిండి: 2 cups

క్యాప్సికమ్: 2 (పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి)

టమోటాలు: 2(మీడియంసైజువి సన్నగా తరిగినవి)

ఉల్లిపాయలు: 1 (చిన్న, చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)

పచ్చిమిర్చి: 2 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)

బ్లాక్ మిరియాలు పొడి: 1tsp

జీలకర్ర పొడి: 1tsp

పసుపు పొడి: ½ tsp

టమోటో కెచప్: 1tbsp

ఉప్పు : రుచికి సరిపడా

నూనె: 2tbsp

నీరు- 2 cups

తయారుచేయు విధానం:

1. ముందుగా గోధుమపిండిలో కొద్దిగా ఉప్పు నీళ్ళు పోసి మృదువుగా కలిపి పెట్టుకోవాలి.

2. 10-15నిముషాల తర్వాత పిండి నుండి కొద్దిగా తీసుకొని, చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీల ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి.

3. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లి పాయ ముక్కలు వేసి 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

4. తర్వాత అందులోనే క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, పెప్పర్ పౌడర్, జీలకర్ర, పసుపు వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.

5. తర్వాత టమోటో, పచ్చిమిర్చి మరియు టమోటో కెచప్ కూడా వేసి మరో రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

6. మొత్తం ఫ్రై అయిన తర్వాత అరకప్పు నీళ్ళు పోసి , మూత పెట్టి 5నిముషాలు ఉడికించుకోవాలి.

7. ఒకసారి ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.

8. తర్వాత పాన్ ను వేడి చేసి రుద్దిపెట్టుకొన్న చపాతీలను ఒక టీస్పూన్ నూనె చిలకరిస్తూ పాన్ మీద రెండు వైపులా కాల్చుకోవాలి.

9. ఒక వైపు కాలిన తర్వాత ఆ చపాతీని మరో వైపు కూడా రెండు నిముషాలు కాల్చుకోవాలి.

10. చపాతీ రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్ లోకి తీసుకొని ఈ చపాతీ రోల్ ల్లో ముందుగా రెడీ చేసి పెట్టుకొన్న క్యాప్సికమ్ స్టఫ్ ను పెట్టి రోల్ చేయాలి.తర్వాత చేత్తో రెండు వైపులా కవర్ చేయాలి.

11. ఇలా మొత్తం చపాతీలను స్టఫ్ చేసి క్యాప్సికమ్ రోల్స్ తయారుచేసుకోవచ్చు. అంతే టేస్టీ క్యాప్సికమ్ రిసిపి రెడీ.

Be the first to comment

Leave a Reply