వంటగదిలోని కత్తిని ఇలా శుభ్రపరచండి…

images (30)

1. సోప్: కత్తి వాడిన తర్వాత డిష్ వాష్ సోప్ ను కత్తిమీద రుద్ది, వేడినీళ్ళతో కడిగి శుభ్రం చేయాలి. వేడినీళ్ళు వల్ల క్రిములు చాలా త్వరగా నశిస్తాయి. మరియు కత్తి మీద మరకలను శుభ్రపరుస్తుంది.

2. నిమ్మకాయ: బాగా మురికి పట్టిన కత్తిని నిమ్మరసంతో శుభ్రం చేయాలి. నిమ్మ ఉత్తమ క్లీనింగ్ ఏజెంట్, మరియు స్ట్రాంగ్ ఆరోమా వాసన కలిగి ఉంటుంది, కత్తి కార్నర్స్ లో మురికిని తొలగించడాని బాగా సహాయపడుతుంది. కొన్ని చుక్కల నిమ్మరసంను నీటిలో వేసి మరిగించి ఆనీటితో శుభ్రం చేయాలి.

3. వెనిగర్: వంటగది వస్తువైన కత్తిని శుభ్రం చేయడానికి ఇదొక ఉత్తమ చిట్కా. వేడి నీళ్ళలో కొన్ని చుక్కల వెనిగర్ వేసి, కొద్ది సేపు నానబెట్టాలి. తర్వాత పాత టూత్ బ్రెష్ తో బాగా రుద్ది, తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

4. ఉడికించాలి: ప్లాస్టిక్ హ్యాండిల్ లేకుండా ఉంటే, వేడినీళ్ళలో వేసి, ఒక నిముషం ఉడికించాలి. వేడినీళ్ళు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది మరియు మరకలను వదలగొడుతుంది . వేడినీళ్ళతో రుద్ది కడగడం వల్ల కత్తికి ఉన్న ఆయిల్ , జిడ్డు మరకలు తొలగిపోతాయి.

Be the first to comment

Leave a Reply