ఆరోగ్యానికి, అందానికీను… నెయ్యి మేలు…

images (85)
సువాసనలు వెదజల్లే నెయ్యి ఆహారంలో రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి, సౌందర్యానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కొంచెం నెయ్యిని గోరువెచ్చగా వేడి చేసి, చిట్లిన జుట్టుకు రాసుకోవాలి. ఓ గంట తరువాత కడగాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకల్లో పగుళ్లు పోయి జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది. పొడిబారిన చర్మం ఉన్న వాళ్లకి నెయ్యి మంచి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది.
పెదవులు బాగా పొడిబారినప్పుడు పడుకునే ముందు పెదాలకు నెయ్యి రాసుకోవడం వల్ల అవి చాలా మృదువుగా తయారవుతాయి. ప్రతి రోజూ స్నానానికి ముందు రెండు చుక్కల నెయ్యితో ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ముఖం ఫేషియల్ చేసుకున్నట్టుగా మెరిసిపోతుంది.
నెయ్యి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. స్నానం చేయడానికి ముందు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవలసిన అవసరం ఉండదు. నిద్ర సరిపోకపోవడం వలన కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. పడుకునే ముందు కళ్ల చుట్టూ ఉండే బాగాన్ని నెయ్యితో మసాజ్ చేసుకోవాలి. పొద్దున్నే లేచిన తరువాత ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు చాలా త్వరగా పోతాయి.
కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్‌కి కొన్ని చుక్కలు గోరువెచ్చని నెయ్యి కలిపి, ఆ నూనెను మాడుకు మసాజ్ చేయాలి. తరువాత జుట్టుకు రాసుకోవాలి. పావు గంట తర్వాత తలస్నానం  చేయాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన జుట్టును మృదువుగా, ఆరోగ్యవంతంగా చేసుకోవచ్చు. కొంచెం శెనగ పిండిలో కొన్ని చుక్కలు నెయ్యి, పాలు పోసి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడుక్కోవాలి.

Be the first to comment

Leave a Reply