గ్లిట్టర్ ఐ షాడో ను అప్లై చేసే పద్దతులు…

images (91)

ఎక్కువ శ్రమ లేకుండా కళ్ళకు గ్లిట్టర్ ఐషాడోను ఎలా అప్లై చేయాలనే కొన్ని సులభ చిట్కాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి వాటిని పరిశీలించండి…

గ్లిట్టర్ సెలక్షన్: కళ్ళ మేకప్ వేసుకోవడానికి ఎంపిక చేసుకొనే, ఐషాడోలు మరియు గ్లిట్టర్ కలర్స్ రెండు ఒకే విధంగా ఉండాలి. గోల్డ్, సిల్వర్, బ్లాక్, మరియు పింక్ ఐషాడోలు చాలా మంచి ఎంపికలు. గ్లిట్టర్ నాణ్యమైనది ఎంపిక చేసుకోవడం లో కాస్త జాగ్రత్త పాటించాలి.ఎక్కువ సమయం నిలిచి ఉండే నాణ్యమైన ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాలి. అందుకు బ్రాండ్ ఐషాడోలను ఎంపిక చేసుకోవాలి.

ఐషాడోకు ముందు ప్రిమియర్ ను ఉపయోగించాలి: ఒక మంచి ఐషాడో ప్రిమియర్ ను ఎంపిక చేసుకవడం ఫర్ ఫెక్ట్ గా ఉంటుంది . ఇది మీరు గ్లిట్టర్ ఐషాడో అప్లై చేయడానికి ముందు ఇది సహాయపడుతుంది.

జెల్ లేదా వాసెలిన్ ను అప్లై చేయాలి: ఐషాడో వేయడానికి ముందు జెల్ లేదా వాజిలైన్ తో పాటు ఐలాష్ లైన్ అప్లై చేయడం వల్ల , ఐషాడో మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది. తగినంత జెల్ అప్లై చేయడం వల్ల ఐషాడో బాగా అతుక్కోవడానికి సహాయపడుతుంది. ఇది మీకు పరిపూర్ణ ఫర్ ఫెక్షన్ ను ఇస్తుంది.

క్రీమ్ ఐషాడోను ఉపయోగించండి: గ్లిట్టర్ ఐషాడో అప్లై చేయడానికి ముందు ఏదైనా క్రీమ్ బేస్డ్ ఐషాడో అప్లై చేయడం మంచిది. ఇది గ్లిట్టర్ మీ ముఖం మొత్తం వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది.

బేస్ కలర్స్ తో ప్రారంభించాలి: ఐషాడో వేయడానికి ముందు బేస్ కలర్స్ అప్లై చేసి, తర్వాత ఐషాడోను అప్లై చేయడం వల్ల మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. బేస్ కలర్ అప్లై చేసిన తర్వాత గ్లిట్టర్ ను అప్లై చేయాలి. అధికంగా అప్లై చేయకండి.

ఫైనల్ టచ్: మేకప్ పూర్తి అయిన తర్వాత కూడా కొంచెం గ్లిట్టర్ మీ ముఖంలో మిగిలి ఉండిపోయినట్లైతే, శాంతంగా మాస్కింగ్ టేప్ ను ముఖం మీద వేసి నిధానంగా తొలగించాలి.

Be the first to comment

Leave a Reply