ఓట్స్ మీల్ ను బ్యూటికి ఏవిధంగా ఉపయోగించుకోవాలి?

 

download (26)

ముఖానికి ఓట్ మీల్: చర్మానికి తగినంత తేమను అందించి మాయిశ్చరైజ్ గా సహాయపడుతుంది. మరియు చర్మ రంద్రాల్లోని మురికిని ఎక్సెస్ ఆయిల్ ను తొలగించి, డీప్ గా శుభ్రపరుస్తుంది.

ఫేస్ వాష్: ఓట్ మీల్లో సపోనిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది చర్మంలో మురికిని మరియు ఆయిల్ ను తొలగిస్తుంది. మీరు చాలా త్వరగా ఓట్ మీల్ తో క్లెన్సర్ ను తయారు చేసుకోవచ్చు. అందుకు రెండు చెంచాలా ఓట్ మీల్, ఒక చెంచ గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి గుండ్రంగా ముందుకు వెనకు మర్దన చేయాలి . 10 నిముషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తేనె బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది మరియు మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

స్పాట్ ట్రీట్మెంట్: మొటిమలు మరియు మచ్చలతో బాధపడుతున్నట్లైతే ఓట్స్ మీల్ మీ సమస్యను నివారిస్తుంది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. చర్మంలోని అదనపు ఆయిల్ గ్రహిస్తుంది మరియు చర్మానికి చల్లదనాన్ని తీసుకొస్తుంది. కొద్దిగా ఓట్ మీల్ ను నీటిలో వేసి ఉడికించి చల్లబడిన తర్వాత ముఖానికి పట్టించాలి. 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మరియు సన్ బర్న్ వంటి సమస్యలను నివారిస్తుంది.

Be the first to comment

Leave a Reply