చికెన్ స్పినాచ్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images

కావల్సిన పదార్థాలు:

చికెన్ : 1kg

ఆకు కూర: 1కట్ట

ఉల్లిపాయ: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

వెల్లుల్లి రెబ్బలు : 4

నూనె: 2tbsp

పసుపు: 1tsp

కారం: 1tsp

జీలకర్ర: 1tsp

ధనియాలపొడి: 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా చికెన్ కు స్కిన్ తొలగించి శుభ్రంగా కడిగి, పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత ఆకుకూరలను విడిపించుకొని, మంచినీటిలో వేసి శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా వంపేసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు ఉల్లిపాయ మరియు వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకోవాలి.

4. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.

5. తర్వాత సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

6. అలాగే మసాల దినుసులన్నీ కూడా వేసి మరో 2నిముషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు నీళ్ళు పోసి, గ్రేవీ చిక్కగా మారే వరకూ కలియబెట్టుకోవాలి.

7. పాన్ లో మీకు చికెన్ ముక్కలతో పాటు సరిపడా మసాలా ఉన్నదని నిర్ధారించుకొన్న తర్వాత మంటను ఎక్కువగా పెట్టి చికెన్ మెత్తబడే వరకూ ఉడికించుకోవాలి.

8. చికెన్ పూర్తిగా ఉడికిందని నిర్ధారించుకొనే సమయంలో ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకొన్న ఆకుకూరను సన్నగా తరిగి ఉడుకుతున్న చికెన్ లో వేసి మూత పెట్టి, మీడియం మంట మీద ఉడికించుకోవాలి. అంతే స్పినాచ్ చికెన్ రిసిపి రెడీ.

Be the first to comment

Leave a Reply