కంప్యూటర్లు – ల్యాప్ టాప్ లు ఎక్కువ కాలం మన్నాలంటే…

pc-laptop-tablet-repairs

1. కంప్యూటర్ మీద ఇంట్లో పనిచేసేటప్పుడు వేరే పని మీద లేచి వెళ్ళిపోవడం, మళ్లీ ఇప్పుడే వచ్చి పని చేసుకుంటాం కదాని కంప్యూటర్‌ని అలానే వదిలి వెళ్ళడం జరుగుతుంది, అలా చెయ్యడం సరి కాదు. కంప్యూటర్ వాడకం అయ్యాక తప్పనిసరిగా షట్ డౌన్ చేయాలి. తరచూ అలా చేస్తే పాడవుతుందన్నది అపోహ మాత్రమే. నిజానికి మన్నిక కాలం పెరుగుతుంది.

2. అందమైన స్క్రీన్ సేవర్ పెట్టుకుంటే కంప్యూటర్ చూడటానికి బాగానే ఉంటుంది. కాని, దాని వల్ల చాలా విద్యుత్ వృధా అయిపోతుంది. కొన్ని గంటలు అలా వదిలేస్తే ఖర్చయ్యే శక్తి…రోజంతా ఓ రిఫ్రిజిరేటర్ నడపడానికి కావాల్సిన విద్యుత్తుతో సమానం.

3. మరీ చిన్నపాటి విరామానికే షట్ డౌన్ చేయడం ఎందుకూ అనుకుంటే కనీసం మానిటర్ ని కట్టేయాలి. ఇలా చేస్తే సగం విద్యుత్ ఆదా అవుతుంది. ఎందుకంటారా? కంప్యూటర్ వినియోగించుకొనే శక్తిలో సగం మానిటరే ఉపయోగించుకుంటుంది కనుక. కంప్యూటర్, మానిటర్, కాపీయర్… వీటికి స్లీప్ మోడ్ ఆప్షన్ ఉంటే తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. దీనివల్ల నలభై శాతం విద్యుత్ ఆదా అవుతుంది.

4. ల్యాప్‌టాప్‌ని ఉపయోగించుకొన్న తర్వాత చాలా మంది ఛార్జర్ ని అలాగే ప్లగ్ బోర్డులకి ఉంచేస్తారు. ఆ సమయంలోనూ అది విద్యుత్ ని స్వీకరిస్తుందని గ్రహించాలి. ఇలా అయ్యే వృథా నెలాఖరులో మీ బిల్లుని తడిసి మోపడయ్యేట్లు చేస్తుంది. ఒక్క ల్యాప్ టాప్ విషయంలోనే కాదు… సెల్ ఫోన్, డిజిటల్ కెమెరాలకి ఉపయోగించే ఛార్జర్ల విషయంలోనూ ఈ జాగ్రత్త కచ్చితంగా పాటించాలి.

5. ల్యాప్‌టాప్, మొబైల్, డిజిటల్ కెమెరా చార్జింగ్ అవడం పూర్తి అయిన వెంటనే చార్జర్‌ను తీసెయ్యాలి. ఇలా చెయ్యడం వలన బ్యాటరీ ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. లేకపోతే బ్యాటరీ త్వరగా చెడిపోయే వీలు ఉంది.

Be the first to comment

Leave a Reply