ప్రాణాయామములో శ్వాసక్రియను తీసుకునే విధానం…

images

ప్రాణాయామములో శ్వాసను వజ్రాసనం లేదా సుఖాసనంలో కూర్చొని వెన్నెముక నిటారుగా ఉంచి చేయాలి.

1. పూరక: శబ్దం చేయకుండా సుదీర్ఘ శ్వాస తీసుకోవాలి.

2. కుంభక: తీసుకున్న శ్వాసను ఊపిరితిత్తులలో కాసేపు ఆపాలి.

3. రేచక: ఊపిరితిత్తులలో ఉన్న శ్వాసను కంఠం ద్వారా శబ్దం చేస్తూ నిదానముగా ముక్కు ద్వారా వదలాలి.

4. సూన్యక: ఊపిరితిత్తులను కాసేపు ఖాళీగా ఉంచాలి.

మన భారతదేశ ఉష్ణోగ్రతల ప్రభావం ప్రకారం ప్రాణాయమమును క్రింది నిష్పత్తిలో చెయ్యాలి.

          పూరక 4 సెకన్లు : కుంభక 2 సెకన్లు

రేచక 5 సెకన్లు : సూన్యక 2 సెకన్లు

సూచనలు:- 

– సూన్యకతో ప్రారంభించి, సూన్యకతో ఆపాలి.

– శ్వాసమీద ధ్యాస ఉంచి ప్రాణాయామము చేయాలి.

– కళ్ళుమూసుకుని నోరు తెరవకుండా చిరునవ్వు ముఖంతో ప్రశాంతంగా ప్రాణాయామము చేయాలి.

Be the first to comment

Leave a Reply