టమాటా పెప్పర్ చికెన్ కర్రీ తయారు చేసే విధానం…

images (1)

కావలసిన పదార్దాలు :

చికెన్; 1/2kg

ఉల్లిపాయ: 1

టమాటా: 1

పచ్చిమిర్చి: 2

కరివేపాకు: ఒక రెమ్మ

అల్లంవెల్లుల్లి పేస్ట్: 2tbsp

గరం మసాలా పొడి: 1tbsp

కొత్తిమీర: కొద్దిగా

మిరియాలపొడి: 1/4tsp

ఉప్పు,కారం:రుచికి తగినంత

నూనె: సరిపడా

తయారు చేసే విధానం:

1. నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి.

2. తర్వాత అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగిన తరువాత టమాటా ముక్కలు వేసి వేయించాలి.

3. ఇప్పుడు చికెన్ వేసి కలిపి మూతపెట్టి సన్నని సెగపై ఉడికించాలి.కొంచెం ఉడికిన తరువాత పసుపు,కారం,ఉప్పు,వేసి కొంచెం నీరు పోయాలి.

4. చికెన్ మెత్తగా ఉడికిన తరువాత గరంమసాల పొడి,మిరియాలపొడి, కొత్తిమీర వేసి కలిపి బాగా ఫ్రై చెయ్యాలి.

5. ఒక బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర చల్లి ఉల్లి చక్రాలతో అలంకరించుకోవాలి. అంతే టమోటో పెప్పర్ చికెన్ కర్రీ రెడీ.

Be the first to comment

Leave a Reply