మృదువైన మరియు మెరిసే జుట్టు కోసం సహజ హెయిర్ మాస్క్ లు…

images (2)

పాలు మరియు తేనె: జుట్టు సంరక్షణ ఉత్పత్తులు మరియు చికిత్సలలో రసాయనిక క్రీములను వాడటం వలన వెంట్రుకల ఆరోగ్యం ప్రమాదానికి గురవుతుంది. పాలు మరియు తేనె కలిపి తయారు చేసిన మాస్క్ ద్వారా జుట్టులో కలిగే సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ హెయిర్ మాస్క్ వెంట్రుకల మందాన్ని మెరుగుపరచుటలో కూడా సహాయపడుతుంది.

స్ట్రాబెర్రీ, గుడ్లు & ఆలివ్ ఆయిల్ మాస్క్: స్ట్రాబెర్రీ మంచి రుచికరమైన పండు మాత్రమేకాదు, జుట్టు ఆరోగ్యాన్ని పెంచే మంచి ఉత్పత్తిగా చెప్పవచ్చు. ఒక కప్పు నిండా స్ట్రాబెర్రీ తీసుకొని, గుడ్డు యొక్క పచ్చసొన మరియు 2 చెంచాల ఆలివ్ ఆయిల్ కలిపి, గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయండి. మాస్క్ ను అప్లై చేసిన 20 నిమిషాల తరువాత గాడత తక్కువగా గల షాంపూతో కడిగి వేయండి.

అవకాడో: అవకాడో మరియు ఆలివ్ ఆయిల్ మాస్క్, ప్రమాదానికి గురైన జుట్టుపై సమర్థవంతంగా పని చేస్తుంది. అవకాడోను దంచి, ఒక చెంచా ఆలివ్ ఆయిల్ కలపండి. ఈ పేస్ట్ ను బ్రెష్ సహాయంతో పూర్తి జుట్టుకు అప్లై చేయండి. ఈ పేస్ట్ ను వెంట్రుకల చివరల, వెనకాల నుండి నుదుటి వైపుగా అప్లై చేయండి. తరువాత షవర్ క్యాప్ తో కప్పి, కనీసం 30 నిమిషాల పాటు వేచి ఉండి, గాడతలు తక్కువగా గల షాంపూతో కడిగి వేయండి.

బేకింగ్ సోడా మాస్క్: బేకింగ్ సోడాలో ఉండే సోడియం బై-కార్బోనేట్ లు, వెంట్రుకలలో ఉండే ఆమ్లాలను విచ్చిన్నం చేస్తాయి. రెండు చెంచాల బేకింగ్ సోడాను, ఒక చెంచా నీటిలో కలిపి ఒక పేస్ట్ లా తయారు చేయండి. ఈ పేస్ట్ ను తడిగా ఉండే జుట్టుకు అప్లై చేసి, 15 నిమిషాల తరువాత గాడత తక్కువ గల షాంపూతో కడగటం వలన జుట్టులో కలిగే సాధారణ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

జోజోబా ఆయిల్: అద్భుతమైన మరియు స్నానపు గదులలో తప్పక ఉంచుకోవలసిన ఆయిల్ జోజోబా. కొద్ది చుక్కల ఈ నూనెను తలపై పోసి, మర్దన చేయటం వలన వెంట్రుకలు మృదువుగా మరియు ప్రకాశవంతంగా మారతాయి.

Be the first to comment

Leave a Reply