శరీర ఉష్ణోగ్రత సమతుల్యానికి & పలు శరీర భాగాల ఆరోగ్యానికి మునగాకు.

images (12)

మునగాకులో ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. మునగాకు ఉడికించి ఆ నీరును తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రత సక్రమంగా ఉంటుంది. మునగాకు శరీరానికి కావలసిన శక్తినిస్తుంది. మునగాకును ఉడికించి ఆ రసంలో కాస్త మిరియాలు చేర్చి తీసుకుంటే చేతి, మోకాలి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మునగాకును నేతిలో వేయించి తీసుకుంటే రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు, దంత సమస్యలను దూరం చేసుకోవచ్చు, జుట్టుకు బలాన్నిస్తుంది మరియు చర్మ వ్యాధులతో పాటు ఉదర సంబంధిత రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చు. విరేచనాలు, కడుపులో మంట, తలనొప్పి, నోటిపూత, కంటిచూపుకు మునగాకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. వారంలో ఒకసారి లేదా రెండుసార్లు మునగాకును ఉపయోగించడం ద్వారా రక్తంతో పాటు కిడ్నీలను శుద్ధి చేసుకోవచ్చు. మునగాకు సూప్‌ జ్వరం నుంచి ఊరటినిస్తుంది. ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులను మునగాకు సూప్‌తో నయం చేసుకోవచ్చు.

Be the first to comment

Leave a Reply