వృద్ధాప్య ఛాయలు దరి చేరనివ్వని రాగులు.

download (3)

రాగులను రోజు వారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.మిల్లెట్ అనే రాగుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటుంది.రాగుల్లో అమినోయాసిడ్స్ ఆకలిని తగ్గిస్తాయి.ఇంకా బరువును నియంత్రిస్తాయి.రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రించుకోవచ్చు.రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది.దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది.అమితపుష్టిని కలిగిస్తుంది.అలాగే వయస్సు పెరిగే వారికి కూడా ఇందులోని కాల్షియం బాగా సహాయపడుతుంది.ఇంకా మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది.రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది.నిద్రలేమి పరిస్థితులను దూరం చేస్తుంది.రాగి మైగ్రేన్ సమస్యను నివారించడం కోసం కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply