చక్కెర వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన ఆహారం…

images (22)

రోజూ తాజా పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవాలి. యాపిల్స్, పియర్స్, బెర్రీస్, బొప్పాయి వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఈ పండ్లలో కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

మరో ముఖ్యమైనది కూరగాయలు. మధుమేహంతో బాధపడేవాళ్లు.. నిత్యం తాజా కూరగాయలు తీసుకోవాలి. బీన్స్ వంటి కూరగాయలు ఎక్కువగా తినాలి. వీటిల్లో తక్కువ కొవ్వు శాతం, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. రోజూ తీసుకునే ఆహారంలో గ్రీన్ లీఫీ కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. కేల్, పాలకూర, బచ్చలికూర, క్యాబేజీ వంటి వాటిని నిత్యం తీసుకోవడం మంచిది.

ధాన్యాలకు ఎక్కవ ప్రాధాన్యత ఇవ్వాలి. బ్రౌన్ రైస్, జొన్నలు, బార్లీ వంటివి నిత్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఓట్స్ సరైన ఆహారం. వీటిని నిత్యం ఏ రూపంలోనైనా తీసుకుంటూ ఉండాలి.

చక్కెర లేని కాఫీ, టీ డయాబెటిక్ పేషెంట్లు తీసుకోవచ్చు. అయితే పాలల్లో కొవ్వు శాతం తక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. సోడాలకు దూరంగా ఉండటం మంచిది.. వెజిటబుల్ ఆయిల్స్, వెన్న వంటి వాటిని తీసుకోవచ్చు. కాకపోతే కొవ్వు శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

చేపలు, కోడిగుడ్లు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. కానీ.. డీప్ ఫ్రై చేయని ఆహారాలే తీసుకోవాలి. మటన్ ని ఉడకబెట్టిన రూపంలో తీసుకోవాలి. బేక్ చేసినవి, ఫ్రై చేసిన వాటికి మధుమేహ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండాలి. షుగర్ వ్యాధిగ్రస్తులు మూడు మీల్స్, రెండు స్నాక్స్ ని రోజూ ఫాలో అవ్వాలి. పైన చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ.. రోజువారీ ఆహారం తీసుకోవడం వల్ల డైయాబెటిస్ నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు.

Be the first to comment

Leave a Reply