ఆకులతో నిగనిగలాడే కురుల సోయగం…

images (13)

కరివేపాకు: కొబ్బరినునేలో కరివేపాకు వేసి మరిగించి, చల్లారక జుట్టు కుదుళ్ళకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తుంటే జుట్టురాలడం, వెంట్రుకలు తెల్లబడడం తగ్గుతుంది. జుట్టు షైనీగా మారుతుంది.

మందారం ఆకులు: మందార ఆకులను నానిన మెంతులతో కలిపి మెత్తగా నూరి తలకు ప్యాక్‌గా వేసి ఆరిన తర్వాత కుంకుడు కాయలతో తల స్నానం చేస్తే జట్టు మృదువుగా మారుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.

తులసి: తులసి ఆకులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది. గుప్పెడు తులసి ఆకుల్ని మెత్తగా పేస్ట్ చేసి అరలీటర్ నీళ్లలో వేసి కాచాలి. ఆ నీళ్లు చల్లారాక తలకు బాగా పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీని వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. వెంట్రుకలు రాలడం తగ్గిపోతుంది.

Be the first to comment

Leave a Reply