బెండకాయ ఫ్రై ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (39)

సాధారణంగా చాలా మందికి బెండకాయ తినడం అంటే ఇష్టం ఉండదు. అయితే బెండకాయలను సరైన పద్దతిలో అనుసరించినట్లైతే, బెండకాయలను క్రిస్పిగా తయారుచేయవచ్చు.
కావల్సిన పదార్థాలు:

బెండకాయ: 250grms(చివర్లు కట్ చేసి, మద్యలో నుండి కట్ చేసుకోవాలి)

ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసుకోవాలి)

కారం: tsp

ఆమ్చూర్ పౌడర్ (డ్రై మ్యాంగో పౌడర్): 1tsp

గరం మసాల: 1tsp

కాలౌంజి: 1/2tsp

ఇంగువ: చిటికెడు

శెనగపిండి: 2tbps

నూనె: 2tbsp

ఉప్పు: రుచికి సరిపడా

యారుచేయు విధానం:

1.ముందుగా బెండాకాయలను శుభ్రం చేసి మీకు కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి.

2.ఇప్పుడు బెండకాయలకు ఉప్పు,మసాలా పౌడర్, కారం, ఆమ్య్చూర్ పౌడర్ మరియు గరం మసాలా వేసి కలిపి పెట్టుకోవాలి.

3. ఇలా కలిపి పెట్టుకొన్న బెండకాయల ముక్కలను 10-15నిముషాలు పక్కన పెట్టుకోవాలి. అంతలోనూ ఉల్లిపాయలు మరియు టమోటోలు వంటి వాటిని కట్ చేసి పెట్టుకోవాలి.

4. 15నిముషాల తర్వాత పాన్ లో నూనె వేసి వేడి అయ్యక , చిటికెడు ఇంగువ మరియు క్యారమ్ సీడ్స్(అజినోమ్యాటో)వంటివి వేసి వేగించుకోవాలి.

5. ఇప్పుడు ఉల్లిపాయ వేసి మీడియం మంట మీద 2-3నిముషాలు వేగించుకోవాలి.

6. తర్వాత కలిపి పెట్టుకొన్న బెండకాయ ముక్కల మీద శెనగపిండి చిలకరించి బాగా మిక్స్ చేయాలి, వీటిని వేగుతున్న మసాలాలో వేసి 10 నిముషాలు బాగా ఫ్రై చేసుకోవాలి.

7. బెండకాయ ముక్కలు 10నిముషాలు వేగిన తర్వాత అందులో ఉప్పు వేసి 5 నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. మెత్తగా ఉడికేవరకూ మంటను సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అంతే ఇండియన్ స్టైల్ బెండకాయ ఫ్రై రెడీ రోటీలకు సైడ్ డిష్ గా సర్వ్ చేయవచ్చు.

Be the first to comment

Leave a Reply