స్పైసీ థాయ్ చికెన్ వింగ్స్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

images

కావల్సిన పదార్థాలు:

చికెన్ వింగ్స్ – 250 g

జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ – 1 teaspoon

ఆలివ్ ఆయిల్ – 1 teaspoon

ఫిష్ ఆయిల్ – 1 teaspoon

సోయా సాస్ – 2 teaspoons

చిల్లీ సాస్ – 2 teaspoons

చిల్లీఫ్లేక్స్ – 1 teaspoon

లెమన్ జ్యూస్ – 1 teaspoon

ఉప్పు: రుచికి సరిపడా

పామ్ షుగర్

నూనె: డీఫ్ ఫ్రైకి సరిపడా

తయారుచేయు విధానం:

1. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, లెమన్ జ్యూస్, సాల్ట్, పామ్ షుగర్, ఆలివ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, సోయా సాస్, చిల్లీ సాస్, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసి, మొత్తం పదార్థాలను మిక్స్ చేసుకోవాలి.

2. ఇప్పుడు చికెన్ వింగ్స్ తీసుకొని నీట్‌గా వాటర్లో శుభ్రంగా కడిగి పక్కన తీసి పెట్టుకొని పూర్తిగా నీరు డ్రై అవ్వనివ్వాలి.

3. నీరు పూర్తిగా వంపేసిన తర్వాత చికెన్ వింగ్స్‌ను ముందుగా మసాలాలు కలిపి పెట్టుకొన్న పెద్ద బౌల్లోనికి చికెన్ వింగ్స్ కూడా వేయాలి.

4. ఈ మసాలా దినుసులన్నీ చికెన్ వింగ్స్‌కు పూర్తిగా పట్టేలా చేయాలి .

5. ఇలా మసాలాలతో మిక్స్ చేసి పెట్టుకొన్న చికెన్ వింగ్స్‌ను 3 నుండి 4గంటల సేపు రిఫ్రిజరేటర్లో పెట్టాలి.

6. 4 గంటల తర్వాత బయటకు తీసి పెట్టి, పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక, చికెన్ వింగ్స్ మీద కొద్దిగా కార్న్ ఫ్లోర్ చల్లి ఒక్కొక్కటిగా కాగే నూనెలో వేసి డీఫ్ ఫ్రై చేసుకోవాలి.

7. చికెన్ వింగ్స్ నూనెలో బాగా ఫ్రై అయి, బ్రౌన్ కలర్లోకి మారే వరకూ ఫ్రై చేసుకోవాలి. అంతే థాయ్ స్టైల్ చికెన్ వింగ్స్ రెడీ. మీకు నచ్చిన సాస్ తో సర్వ్ చేయడమే ఆలస్యం.

Be the first to comment

Leave a Reply