రంజాన్ స్పెషల్ బటర్ ఖీమా మసాల రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం…

butter-kheema

కావల్సిన పదార్థాలు:

బీఫ్ లేదా మటన్: 1kg

పెరుగు: 1cup

బటర్: 1cup

అల్లం పేస్ట్: 3tsp

వెల్లుల్లి పేస్ట్ : 3tsp

ఉల్లిపాయలు: 3పీసెస్

లవంగాలు: 5-7

దాల్చిన చెక్క: 1

బ్లాక్ యాలకలు: 2

గ్రీన్ యాలకలు: 2

పచ్చిమిర్చి: 8

బిర్యానీ ఆకు: 1

ఉప్పు: రుచికి సరిపడా

కారం: 3tsp

కొత్తిమీర తరుగు: కొద్దిగా

తయారుచేయు విధానం:

1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.

2. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో ఒక కప్పు నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలి.

3. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత ఖీమా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.

4. తర్వాత అందులో సన్నగా తరిగిపెట్టుకొన్ని టమోటో ముక్కలు కూడా వేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి.

5. ఈ కీమా మిశ్రమానికి బటర్ జోడించి బాగా మిక్స్ చేయాలి.

6. ఇప్పుడు ఈ ఖీమా మిశ్రమానికి ముందుగా తయారుచేసుకొన్న మసాలా మిశ్రమం మిక్స్ చేయాలి.

7. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలి, తర్వాత అందులో ఉప్పు, కారం డ్రై అయ్యే వరకూ ఫ్రై చేసుకోవాలి.

8. తర్వాత అందులో పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి. మంట తగ్గించి, పెరుగు వేసి ఖీమా మొత్తం అబ్జార్బ్ అయ్యే వరకూ ఉడికించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, మరియు ఎండు మిర్చి మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే బటర్ ఖీమా మసాలా రెడీ. దీన్ని నాన్ మరియు చపాతీతో సర్వ్ చేయాలి.

Be the first to comment

Leave a Reply