దూద్ డులరీ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (40)

కావల్సిన పదార్థాలు:

పాలు – 2 ltr

కండెన్స్డ్ మిల్క్ (వెన్న తీసిన పాలు): ½ cup

మొక్కజొన్న పిండి – 1tsp

సేమియా: ½cup

స్ట్రాబెర్రీ జెల్లీ – 50grm

గ్రీన్ జెల్లీ – 50grms

రబ్రి – 250grms

తాజా క్రీమ్ – 200grms

మిక్స్ ఫ్రూట్ కాక్ టైల్: 200ml

చం చం – 250gm

తయారుచేయు విధానం:

1. ముందుగా పాన్‌లో పాలు పాసి బాగా వెన్న మీగడ పట్టేలా మరిగించాలి.

2. పాలు బాగా మరిగిన తర్వాత అందులో సేమియా, కార్న్ ఫ్లోర్ వేసి మిక్స్ చేయాలి(కార్న్ ఫ్లోర్‌ను ముందుగా చల్లటి పాలలో వేసి మిక్స్ చేయాలి)

3. ఇప్పుడు అందులోనే కండెన్స్డ్ మిల్క్, ఫ్రూట్ కాక్ టైల్ మరియు పంచదార వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. తర్వాత చల్లరనివ్వాలి .

4. తర్వాత అందులోనే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్, చమ్ చమ్ మరియు రబ్రిని మిల్క్ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.

5. ఒక ప్లేట్‌లో కొద్దిగా కొద్దిగా నీళ్ళు పోసి, అందులో జెల్లి వేసి కరిగించుకోవాలి. పక్కన పెట్టడం వల్ల ఇది చిన్న చిన్న క్యూబ్‌గా సెటిల్ అవుతుంది.

6. ఇలా అయిన జెల్లీని మిల్క్ మిశ్రమంలో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.

7. దూద్ డులరి రిసిపి రెడీ. చల్లగా చల్లగా సర్వ్ చేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది.

Be the first to comment

Leave a Reply