రా మ్యాంగో- బనానా షర్బత్ ఎలా తయారుచేయాలో చూద్దాం… సమ్మర్ స్పెషల్…

download (1)

కావలసిన పదార్థాలు :

పచ్చి మామిడికాయ: 1

అరటిపండు : 1

పంచదార : 1/2cup

జీలకర్ర పొడి : 1/2 tsp

మిరియాల పొడి : 1/2 tsp

ఉప్పు: రుచికి తగినంత

తయారుచేయు విధానం :

1. ముందుగా అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత మామిడి కాయ తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేదా తురుము కోవచ్చు.

3. ఇప్పుడు ఈ ముక్కలు, పంచదార కలిపి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

4. తర్వాత నీరు పోసి పల్చని జ్యూస్‌లా బ్లెండ్ చేయాలి.

5. దీన్ని గ్లాసులోకి వడపోసుకుని అరటిపండు ముక్కలు వేయాలి.

6. ఆపైన జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేయాలి. వేసవిలో ఈ షర్బత్ శరీరాన్ని చల్లబరుస్తుంది. డీహైడ్రేషన్ సమస్యను నివారిస్తుంది.

Be the first to comment

Leave a Reply