క్యాప్సికమ్ ఎగ్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (31)

కావల్సిన పదార్థాలు:

గుడ్లు: 4

నూనె: 2tbsp

వెల్లుల్లి: 1tbsp

ఉల్లిపాయలు: 3(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

పచ్చిమిర్చి: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

చిల్లీ సాస్: 1tbsp

టమోటో సాస్: 1tbsp

పెప్పర్: 1tbsp

క్యాప్సికమ్: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

అజినోమోటో: ఒక చిటికెడు

ఉప్పు: కొద్దిగా

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గుడ్డు పగులకొట్టి పోయాలి. తర్వాత అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి తర్వాత ఫ్లాట్‌గా ఉండే పాన్ మీద వేసి లైట్‌గా కాలిన తర్వాత ఈ స్క్రాబుల్డ్ ఎగ్‌ను ఒక బౌల్లో తీసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి.

2. అదే పాన్ లేదా వేరే పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో సన్నగా కట్ చేసుకొన్న వెల్లుల్లి రెబ్బలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

3. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.

4. ఆ తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మొత్తం మిశ్రమం మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.

5. ఇప్పుడు స్క్రాంబుల్డ్ ఎగ్‌ను అందులో వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అందులోనే చిల్లీ సాస్ మరియు టమోటో సాస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.

6. చివరగా అందులో చిటికెడు అజినామోటో, పెప్పర్ పౌడర్ చిలకరించి ఒక నిముషం ఫ్రై చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే క్యాప్సికమ్ ఎగ్ రిసిపి రెడీ.

Be the first to comment

Leave a Reply