బెంగాలీ స్వీట్ పులావ్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (31)

కావల్సిన పదార్థాలు:

బాస్మతి బియ్యం: 2cups

పసుపు: 2tsp

పంచదార 3tbsp

లవంగాలు -4

గ్రీన్ యాలకులు -4

బే ఆకు -1

జీడిపప్పు: 2tbsp (పలుకులుగా చేయాలి)

ఎండుద్రాక్ష: 2tbsp

నెయ్యి: 1tbsp

నీరు: 4 cups

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా బియ్యంను శుభ్రం చేసి నీటిలో అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత బియ్యంలోని నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత పాన్‌లో నెయ్యి వేసి, కాగిన తర్వాత అందులో యాలకులు, బిర్యానీ ఆకు వేసి మరో నిముషం వేయించుకోవాలి.

3. ఇప్పుడు అందులో నానబట్టుకొన్న బియ్యం, పసుపు, పంచదార మరియు ఉప్పు వేసి వేయించుకోవాలి.

4. లైట్‌గా మిక్స్ చేస్తు 5నిముషాల పాటు మీడియం మంట మీద వేయించుకోవాలి.

5. తర్వాత సరిపడా నీరు పోసి అందులో జీడిపప్పు మరియు ద్రాక్ష వేసుకోవాలి.

6. మంటను మీడియంగా పెట్టి మూత పెట్టి 15నిముషాలు బియ్యం పూర్తిగా ఉడికే వరకూ ఉడికించుకోవాలి.

7. ఒకసారి ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, పులావ్‌ను సర్వింగ్ ప్లేట్‌లోనికి మార్చుకోవాలి. అంతే బెంగాలీ మిష్టి పులావ్(స్వీట్ పులావ్) సర్వ్ చేయడానికి రెడీ. ఈ స్పెషల్ పులావ్‌ను అలాగే ప్లెయిన్‌గా తినవచ్చు లేదా చికెన్ లేదా మటన్ కర్రీ కాంబినేషన్ తో తినవచ్చు.

Be the first to comment

Leave a Reply