
గుడ్డు: రెండు గుడ్లను పగులగొట్టి సొనను బాగా గిలకొట్టాలి, ఈ సొనను తలకు బాగా పట్టించి ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూ ఉపయోగించి గోరువెచ్చిని నీటితో తలస్నానం చేయడం వల్ల చుండ్రు మరియు హెయిర్ ఫాల్‌ను అరికడుతుంది. ఇది మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది.
పెరుగు: మీ కేశాలకు పెరుగును బాగా పట్టించి ఒక గంట పాటు అలాగే వదిలేయాలి. ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
Leave a Reply
You must be logged in to post a comment.