రేచీకటిని(నైట్ విజన్‌ని) నివారించే హెల్తీ ఫుడ్స్…

download (9)

రెగ్యులర్ డైట్‌లో గ్రీన్ వెజిటేబుల్స్: గ్రీన్ వెజిటేబుల్స్, ఆకుకూరలు, మొలకలు, క్యారెట్ మరియు బీట్ రూట్ వంటివి చేర్చుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ Aను పుష్కలంగా పొందవచ్చు. ఇది కంటిలోని కార్నియాకు రక్షణ కల్పిస్తుంది. నైట్ విజన్ మెరుగుపరుస్తుంది.

రేచీకటిని దూరం చేసే విటమిన్ C రిచ్ ఫ్రూట్స్: విటమిన్ C అధికంగా ఉండే బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్ప్బెర్రీస్, దానిమ్మ, జామ, ద్రాక్ష, కివి ఫ్రూట్స్, పైనాపిల్, జామ, మొదలగునవి అధికంగా తీసుకోవాలి. వీటిలో విటమిన్ Cకి పవర్ హౌస్ వంటిది ద్రుష్టిలోపాలను నివారించడంలో ఇది బాగా సహాయపడుతుంది.

డ్రై ఫ్రూట్స్: డ్రై ఫ్రూట్స్‌లో బాదం, ఆప్రికాట్, వాల్ నట్స్ మరియు డేట్స్‌లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. వీటిలో విటిమన్ E కూడా అధికంగా ఉన్నాయి. ఈ రెండూ రేచీకటి నివారించడంతో పాటు, మొత్తం ఆరోగ్యానికి ఉపయోగపడుతాయి.

సెరెల్ మీల్స్: ఓట్స్, మిల్లెట్స్, బార్లీ మొదలగునవి పొట్టనింపడం మాత్రమే కాదు ఐసైట్ ఫ్రెండ్లీ ఫుడ్స్. ఈ ఫోర్టిఫైడ్ ఫుడ్స్‌ను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల కంటి సమస్యలన్నీ పరిష్కరింపబడుతాయి.

గ్రీన్ టీ తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది: గ్రీన్ టీ తీసుకోవడం ఆక్సిడేటివ్ స్ట్రె నుండి విముక్తి కలిగిస్తుంది. ఇందులో విటమిన్ C , E మరియు కెటచిన్స్ అధికంగా ఉండటం వల్ల రేచీకటి నివారించబడుతుంది.

పాలు: పాలలో విటమిన్ D అధికంగా ఉంటుంది. ఇది నైట్ విజన్ మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా అవసరం.

నైట్ విజన్ మెరుగుపరిచే ఫిష్: సీఫిష్‌లో సాల్మన్ మరియు ఇండియన్ రాస్, ఇండియన్ మెకరెల్, సార్డిన్స్, తున మొదలగు వాటిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . ఇది మాస్కులార్ డీజనరేషన్ మరియు డ్రై ఐస్ సిండ్రోమ్ నుండి రక్షణ కల్పిస్తుంది. దాంతో నైట్ విజన్ మెరుగుపడుతుంది. ఇంకా ఓయిస్ట్రెస్, షెల్ ఫిస్, మొదలగు వాటిని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలి. వీటిలో జింక్ అధికంగా ఉంటుంది. ఇది విటమిన్ Aగా మారడానికి సహాయపడుతుంది.

Be the first to comment

Leave a Reply