రోజంతా అలసిపోతున్న ఫీలింగ్ వెంటాడటానికి కారణాలు…

download (25)

– సరిగ్గా నీళ్లు తాగకపోవడం: మనుషులకు చాలా ముఖ్యమైన వాటిలో నీళ్లు ఒకటి. ఎప్పుడైతే మీరు డీహైడ్రేట్‌కి లోనవుతారో అప్పుడు అలసిపోయినట్టు ఫీలవుతారు. శరీరం డీహైడ్రేట్‌ అయినప్పుడు బ్లడ్ వాల్యూమ్ తగ్గుతుంది, ఆక్సిజన్, న్యూట్రియంట్స్ శరీరానికి సరైన మోతాదులో అందవు. దీనివల్ల అలసిపోతారు.

– ఐరన్ తీసుకోకపోవడం: ఐరన్ లోపం వల్ల కేవలం నీరసం, అలసట మాత్రమే కాదు చిరాకుకి కారణమవుతుంది. శరీరంలో ఐరన్ తగ్గితే ఆక్సిజన్ కండరాలు, కణాలకు తక్కువగా అందుతుంది. అలాగే అనీమియాకి దారితీస్తుంది. కాబట్టి కిడ్నీ బీన్స్, ఎగ్స్, గ్రీన్ వెజిటబుల్స్, నట్స్ తీసుకోవడం మంచిది.

– బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం: మనందరికీ తెలుసు బ్రేక్ ఫాస్ట్ ఎంత అవసరమో. మెటబాలిజంను పెంచడానికి బ్రేక్ ఫాస్ట్ సహాయపడుతుంది. బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే చాలా అలసటగా అనిపిస్తుంది. మంచి ఫ్యాట్, ప్రొటీన్స్ ఉన్న బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. 2 స్లైస్‌ల వోల్ వీట్ బ్రెడ్, ఒక గ్లాసు స్కిమ్డ్ మిల్క్ తీసుకుంటే మంచిది.

– వ్యాయామం: ఉదయం నిద్రలేవగానే జిమ్, వాకింగ్ ఏదో ఒకటి చేయడం వల్ల చాలా ఫ్రెష్‌గా ఫీలవుతారు. వర్కవుట్ చేయడం వల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయి రోజంతా ఎనర్జిటిక్‌గా ఫీలవుతారు.

– ఎక్కువగా కష్టపడటం: వర్క్ గురించి ఎక్కువగా చింతించడం, ఒత్తిడికి లోనవడం, ఎక్కువ సమయం పనిచేయడానికి టైం స్పెండ్ చేయడం వల్ల మీరు అలసిపోతారు. ఒత్తిడి సైలెంట్ కిల్లర్ అని మరిచిపోకండి.

– ఫోన్, ఈమెయిల్స్: మీరు ఎల్లప్పుడూ మీ ఫోన్, ఈమెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉంటారా ? ఎక్కువగా స్క్రీన్ చూడటం వల్ల మీ నిద్రపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల మీరు ఎక్కువగా అలసిపోతున్నట్టు ఫీలవుతారు.

Be the first to comment

Leave a Reply