ప్రాన్ మలై కర్రీ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (3)

కావల్సిన పదార్థాలు:

ప్రాన్స్: 1kg

ఉల్లిపాయలు: 1+1(కట్ చేసి పేస్ట్ చేయాలి)

వెల్లుల్లి: 8(పేస్ట్ చేయాలి)

కలౌంజి(ఉల్లిపాయ విత్తనాలు): 1/2tsp

పచ్చిమిర్చి: 2+6(మద్యకు కట్ చేసి పస్ట్ చేయాలి)

కొబ్బరి పాలు: 1cup

మస్టర్డ్ పేస్ట్: 2tbsp

పసుపు: 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

మస్టర్డ్ ఆయిల్: 2tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా ప్రాన్స్‌ను శుభ్రం చేసి పసుపు మరియు ఉప్పు వేసి మ్యారినేట్ చేయాలి. తర్వాత మస్టర్డ్ ఆయిల్‌లో వేసి 3-4నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత అదే నూనెలో ఉల్లిపాయ విత్తనాలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయాలి.

3. అంతలోపు ఒక ఉల్లిపాయను, వెల్లుల్లి మరియు మిగిలిన పచ్చిమిర్చిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.

4. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.

5. తర్వాత అందులో మస్టర్డ్ పేస్ట్, ఉప్పు, పసుపు చిలకరించి ఒక 5నిముషాల పాటు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.

6. చివరగా కొబ్బరి పాలు కూడా వేసి మిక్స్ చేసి 2నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.

7. తర్వత ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న ప్రాన్స్ వేసి, మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి 10నిముషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అంతే ప్రాన్ మలై కర్రీ రెడీ. దీన్ని వేడి వేడి అన్నంతో తీసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది.

Be the first to comment

Leave a Reply