టైల్స్ మద్య మురికిని తొలగించడానికి క్లీనింగ్ టిప్స్…

images (2)

వెనిగర్: వెనిగర్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి బాగా మిక్స్ చేసి స్ప్రేబాటిల్‌లో పోసి టైల్స్ మధ్య మురికి పేరుకున్న చోట స్ప్రే చేయాలి. ఐదు నిముషాల తర్వాత బ్రష్‌తో రుద్దితే మురికి వదలిపోయి ఫ్లోర్ శుభ్రంగా తయారవుతుంది.

బేకింగ్ సోడా: బేకింగ్ సోడాకు అరకప్పు లిక్విడ్ బ్లీచ్ మిక్స్ చేసి పేస్ట్‌లా చేసి దీన్ని టైల్స్ మధ్య రాసి 10 నిముషాల తర్వాత టూత్ బ్రష్‌తో రుద్దితే మురికి వదిలిపోతుంది. తర్వాత తడిబట్టతో తుడిస్తే సరిపోతుంది.

హైడ్రోజన్ పెరాక్సైడ్: దెబ్బలు తగినప్పుడు ఆ భాగాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించే హైడ్రోజన్ పెరాక్సైడ్ సైతం టైల్స్ మధ్య చేరిన మురికిని పోగొట్టడానికి ఉపయోగించవచ్చు. దీన్నే నేరుగా ఫ్లోర్‌ని శుభ్రం చేయడానికి వాడుకోవచ్చు. లేదంటే దీనిలో బేకింగ్ సోడాను కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారుచేసి టైల్స్ మద్య రాసి ఆ తర్వాత నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బ్లీచింగ్ పౌడర్: కొన్ని సార్లు టైల్స్ మధ్య చేరిన మురికి పసుపు రంగులో కనబడుతుంది. దీన్ని పోగొట్టడానికి బ్లీచ్‌తో తయారుచేసుకున్న మిశ్రమాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆక్సిజనేటెడ్ బ్లీచింగ్ పౌడర్‌ను రెండు కప్పుల వేడినీటిలో వేసి మిశ్రమంగా చేసుకుని దీనిలో పాత టూత్ బ్రష్‌ని ముంచి మురికి ఉన్న చోట బాగా రుద్దితే వెంటనే అది వదిలిపోతుంది.

నిమ్మరసం: నిమ్మరసాన్ని నీటిలో కలిపి మురికిగా ఉన్న చోట స్ప్రే చేయాలి. ఆ తర్వాత స్ర్కబ్బర్‌తో రుద్ది శుభ్రం చేస్తే మురికి వదిలిపోతుంది. అయితే నిమ్మరసం వల్ల టైల్స్‌ నునుపుదనం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి, కాస్త ఎక్కువ నీటిలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపితే సరిపోతుంది.

అమ్మోనియా: బకెట్ నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా, వైట్ వెనిగర్ , అమ్మోనియా లిక్విడ్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో పోసి టైల్స్ మధ్య మురికిగా ఉన్న చోట స్ప్రే చేసుకోవాలి. 5నిముషాల తర్వాత బ్రష్‌తో రుద్ది తర్వాత తడి వస్త్రంతో లేదా మాప్‌తో నేలను తుడిస్తే సరిపోతుంది.

Be the first to comment

Leave a Reply