వెజిటేబుల్ లెమన్ పెప్పర్ సూప్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download

కావల్సిన పదార్థాలు:

క్యారెట్ – 1 cup (Chopped)

ఉల్లిపాయలు -1 cup (Chopped)

క్యాప్సికమ్-1 cup (Chopped)

స్ప్రింగ్ ఆనియన్స్ – 1 cup (Chopped)

క్యాబేజ్ -1 cup (Chopped)

వెల్లుల్లి- 1/4 Teaspoon

అల్లం – 1/4 Teaspoon (Chopped)

కార్న్ ఫ్లోర్ – 3 Teaspoon

పెప్పర్ – 1/2 Teaspoon

లెమన్ జ్యూస్- 2 Teaspoon

వెజిటేబుల్ స్టాక్- 2 Cups(వెజిటేబుల్స్ ఉడకించిన నీళ్ళు)

నూనె: తగినంత

ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిముషం వేగించుకోవాలి.

2. తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ మరియు స్ప్రింగ్ ఆనియన్స్ వేసి 10 నిముషాలు వేగించుకోవాలి.

3. వేజిటేబుల్స్ వేగిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్ స్టాక్ పోయాలి.

4. ఇప్పుడు అందులోనే పెప్పర్ మరియు సాల్ట్ కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.

5. మీడియం మంట మీద ఉడికించాలి. ఉడుకుతన్నప్పుడు అందులో కార్న్ ఫ్లోర్‌ను కొద్దిగా నీటిలో వేసి మిక్స్ చేసి ఉడికే మిశ్రమంలో పోయాలి.

6. తర్వాత నిమ్మరసం వేసి మొత్తం మిశ్రమాన్ని కలియబెడుతూ 10 నిముషాలు, మీడియం మంట మీద ఉడికించాలి.

7. చివరగా కొత్తిమీర తరుగు చిలకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే వెజిటేబుల్ పెప్పర్ లెమన్ సూప్ రెడీ.

Be the first to comment

Leave a Reply