మొటిమలను ఎట్టి పరిస్థితుల్లో గిల్లకూడదనడానికి కారణాలు…

images (16)

మచ్చ: మొటిమను గిల్లడం వల్ల తర్వాత మచ్చ ఏర్పడుతుంది. అలా ఏర్పడిన మచ్చను కాస్మొటిక్స్‌తో కనపడకుండా చేయడం కూడా కష్టమే. కాబట్టి పింపుల్స్‌ని న్యాచురల్‌గా తొలగించే ప్రయత్నం చేస్తే ఎలాంటి మచ్చలు లేని ఫేస్ సొంతం చేసుకోవచ్చు.

ఇన్ఫెక్షన్‌: మొటిమను గిల్లడం వల్ల చీము బయటకు వస్తుంది. ఇది చుట్టూ ఉండే చర్మంపై దుష్ర్పభావం చూపుతుంది. దీని ద్వారా వచ్చే బ్యాక్టీరియా స్కిన్ ఇన్ఫెక్షన్‌కి కారణమవుతుంది.

ఇన్ల్ఫమేషన్: మొటిమను బాగా పిండటం వల్ల చర్మం చాలా డ్యామేజ్ అవుతుంది. మొటిమ చుట్టూ వాపు ఇంకా పెరిగి అది మరింత పెద్దగా కనిపిస్తుంది. ఇది మొటిమ కంటే అసహ్యంగా ఉంటుంది.

పొక్కులు ఏర్పడవచ్చు: మొటిమలను గిల్లడంతో అయిపోతే తర్వాత దానిపై పొక్కులా ఏర్పడి మీ ఆకర్షణను మొత్తం అసహ్యంగా మారుస్తాయి. ఇలా ఏర్పడిన దాన్ని కాస్మొటిక్స్ కూడా ఏం చేయలేవు.

ఉపశమనానికి సమయం: సాధారణంగా మొటిమ మాయం అవడానికి వారం పడుతుంది. కానీ గిల్లడం వల్ల అది తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఎక్కువ మొటిమలకు కారణం: పింపుల్స్‌ని గిల్లకూడదు అనడానికి ప్రధాన కారణం అవి ఎక్కువ అవుతాయి. ఒక పింపుల్‌ని సింపుల్‌గా న్యాచురల్ రెమిడీతో తొలగిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ దాన్ని గిల్లడం వల్ల ఇన్ఫెక్షన్ చుట్టూ వ్యాపించి కొత్తగా మొటిమలు రావడానికి కారణమవుతుంది.

చర్మం పూర్తీగా మారిపోవచ్చు: చాలామంది చేసే పొరపాటు వల్ల చేతులపై ఉండే బ్యాక్టీరియా చర్మానికి తగిలి చర్మం డార్క్‌గా మారుతుంది. మొటిమలు గిల్లిన తర్వాత చర్మం పిగ్మెంటేషన్‌కి గురవుతుంది.

Be the first to comment

Leave a Reply