చుండ్రు తగ్గించుకోవడానికి ఆయుర్వేద చిట్కాలు…

images (8)

– హాట్ ఆయిల్ మసాజ్: తలకు నూనె అప్లై చేయడానికి ముందు నూనెను కొద్దిగా వేడి చేాయలి. దీన్ని జుట్టులోపలి వరకూ అప్లై చేయాలి. 10నిముషాలు మసాజ్ చేసి తర్వాత ఒక గంట రెండు గంటల పాటు అలాగే వదిలేసి తర్వాత తలస్నానం చేయాలి.

– కర్పూరం-కొబ్బరి నూనె: ఇది అమ్మమ్మల కాలం నాటి రిసిపి. కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం వేసి మిక్స్ చేసి స్టోర్ చేసి పెట్టుకోవాలి. అవసరమయినప్పుడు, రాత్రుల్లో నిద్రించడానికి ముందు అప్లై చేసుకోవాలి. కర్పూరం తలను కూల్‌గా ఉంచుతుంది. చుండ్రు నివారిస్తుంది.

– కోకనట్-లెమన్: హెయిర్ కేర్ రెమెడీస్‌లో లెమన్ ఒక గ్రేట్ రెమెడీ. కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

– పెరుగు-నిమ్మరసం: చుండ్రు నివారించుకోవడానానికి ఆయుర్వేదంలో చాలా మెడిసిన్స్ ఉన్నాయి. పెరుగులో కొద్దిగా నిమ్మరసం పిండి తలకు పట్టించడం వల్ల తల శుభ్రం చేస్తుంది. క్లియర్ అవుతుంది. నిమ్మరసం చుండ్రును నివారించడంలో బాగా సహాయపడుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్ టిప్. పెరుగు జుట్టుకు మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. తలను కూల్‌గా ఉంచుతుంది.

Be the first to comment

Leave a Reply