అల్లం జ్యూస్ తో పొందే అద్భుతమైన హెల్త్ బెన్ఫిట్స్…

download (13)

అల్లం జ్యూస్ తయారు చేసేవిధానం: కొద్దిగా అల్లం తీసుకుని శుభ్రం చేసుకుని, ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొన్ని నీళ్లు కలిపి మిక్సర్ లో వేసి క్రష్ చేయాలి. తర్వాత వడకట్టి దానిలోకి అరనిమ్మకాయ రసం కలపాలి. అవసరమైతే తేనె కలుపుకుని తీసుకోవాలి. అంతే అల్లం జ్యూస్ రెడీ.

డయాబెటిస్: అల్లంలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. డయాబెటిస్ తో బాధపడేవాళ్లలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో అల్లం జ్యూస్ సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే ఇది నాన్ డయాబెటిక్ వాళ్లకు కూడా మంచిది.

బ్రెయిన్ హెల్త్: అల్లంలో ఫెనోల్స్, ఫ్లేవనాయిడ్స్ ఉండటం వల్ల న్యూరోప్రొటెక్టర్ గుణాలు పొందవచ్చు. అలాగే అల్లం జ్యూస్ లో బ్రెయిన్ లో ప్రొటీన్ లెవెల్స్ పెంచే సత్తా ఉంటుంది. దీనివల్ల బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది. ముఖ్యంగా వయసు పెరిగిన వాళ్లలో అల్జీమర్స్, మెంటల్ డిజార్డర్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.

క్యాన్సర్: అల్లంలో బయో యాక్టివ్ ఫెనోలిక్స్, నాన్ వొలాటైల్ ఉంటాయి. అధ్యయనాల ప్రకారం అల్లంలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నట్టు, ప్రొస్టేట్ క్యాన్సర్ నివారించడానికి సహాయపడుతుందని తేలింది.

గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్ నివారణకు: అల్లంను వికారం, హార్ట్ బర్న్, అలసట, డయేరియా, ఆకలి పెంచడానికి, ఇన్ఫెక్షన్స్, దగ్గు నివారించడానికి ఉపయోగిస్తారు. అలాగే అల్లంలో ఉండే గుణాలు గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్ నుంచి కాపాడతాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

కొలెస్ట్రాల్ తగ్గించడానికి: గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా తగ్గించడంతో పాటు, అల్లం జ్యూస్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా ఎఫెక్టివ్ గా తగ్గించవచ్చు.

కీళ్ల నొప్పులు: అల్లం జ్యూస్ తీసుకోవడం వల్ల నొప్పి నివారించే గుణాలు ఉంటాయి. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

Be the first to comment

Leave a Reply