హెయిర్ కలర్ ఎక్కువ రోజులు ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్…

download (18)

డీప్ కండిషనింగ్: హెయిర్ కలర్ ఎక్కువ రోజులు ఉండటానికి ఫాలో అవ్వాల్సిన బేసిక్ టిప్ డీప్ కండిషనింగ్. డీప్ కండిషనింగ్ వల్ల కుదుళ్లకు పోషణ అంది హెయిర్ పోకుండా ఉంటుంది. ముఖ్యంగా హెయిర్ కలర్ ఎక్కువ కాలం ఉండటానికి సహాయపడుతుంది.

హాట్ వాటర్ బాత్ చేయకూడదు: హెయిర్ కలర్ జుట్టుకి అలానే ఉండాలంటే తలస్నానానికి మరీ వేడి నీటిని ఉపయోగించకూడదు. దీనివల్ల జుట్టుకి ఉన్న రంగు షేడ్ అవుతుంది. హాట్ వాటర్ బాత్ వల్ల కేవలం జుట్టుకే కాదు, జుట్టుకున్న రంగుపై కూడా దుష్ర్పభావం చూపుతుంది. హెయిర్ కలర్ త్వరగా పోవడానికి కారణమవుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్: ఈ ట్రెడిషనల్ పద్ధతి పాటించడం వల్ల జుట్టుకి వేసుకున్న కలర్ ఎక్కువ కాలం ఉండటానికి సహాయపడుతుంది. 1టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ని, అరకప్పు నీటిలో కలిపి జుట్టుని ఈ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలకు ఒకసారి చేయాలి. దీనివల్ల హెయిర్ కలర్ షేడ్ అవకుండా జాగ్రత్త పడవచ్చు.

తరచుగా తలస్నానం చేయడం: తరచుగా తలస్నానం చేస్తూ ఉండటం వల్ల జుట్టుకి ఉన్న కలర్ కూడా పోతుంది. అలాగే ఎక్కువగా షాంపూ చేసుకోవడం వల్ల కూడా జుట్టుకున్న కలర్ పోతుంది.

హీటింగ్ టూల్స్: మరీ ఎక్కువగా హీటింగ్ టూల్స్ ఉపయోగించడం వల్ల జుట్టు నిర్జీవంగా మారడం, చిట్లిపోవడమే కాదు జుట్టుకి ఉన్న కలర్ పోతుంది. ఇలా హీటింగ్ టూల్స్ ఉపయోగించడం కంటే న్యాచురల్ టిప్స్ ఫాలో అవడం మంచిది.

సన్ ప్రొటెక్షన్: ఎస్ పీ ఎఫ్ అనేది కేవలం చర్మానికి మాత్రమే కాదు జుట్టుకి కూడా చాలా అవసరం. ముఖ్యంగా జుట్టుకి కలర్ వేసుకున్న వెంటనే జుట్టుకి యూవీ కిరణాలు హానిచేస్తాయి. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు జుట్టుని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా అవసరం.

హెయిర్ ప్రొటెక్టింగ్ ప్రొడక్ట్స్: హెయిర్ కలర్ ని ప్రొటెక్ట్ చేసే హెయిర్ కలర్ ప్రొటెక్టింగ్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం చాలా అవసరం. వీటిలో ఉండే పదార్థాలు జుట్టుకి వేసుకున్న కలర్ పోకుండా చేస్తాయి. షాంపూ, కండిషనర్ రూపంలో వీటిని ఉపయోగించవచ్చు.

Be the first to comment

Leave a Reply