రోజ్ మిల్క్ షేక్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (13)

కావల్సిన పదార్థాలు:

పాలు: 2cups

వెనీల ఐస్ క్రీమ్: 2big scoops

సిరఫ్ కోసం:

పంచదార: 3/4cup (150grms)

నీళ్ళు: 100ml

రోజ్ మిల్క్ ఎసెన్స్: 1tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక చిన్న గిన్నెలో పంచదార వేసి స్టౌ మీద పెట్టి తగినన్ని నీళ్ళు పోయాలి.

2. మీడియం మంట మీద బాగా మరిగించాలి. పంచదార బాగా కరిగిపోయి, సిరప్ తయారయ్యే ప్పుడు అందులో రోజ్ మిల్క్ ఎసెన్స్ ను జోడించి బాగా మిక్స్ చేయాలి.

3. ఇప్పడు స్టౌ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని ఒక గ్లాసులో పోసి ఫ్రిజ్ లో స్టోర్ చేసి అవసరం అయినప్పుడు ఉపయోగించుకోవచ్చు.

4. ఇప్పుడు బ్లెండర్ లో పాలు పోసి , తర్వాత ఒక టేబుల్ స్పూస్ రోజ్ సిరఫ్ వేసి, దాంతో పాటు ఐస్ క్రీమ్ కూడా వేసి బ్లెడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల స్మూతీ షేక్ తయారవుతుంది.

5. అంతే రోజ్ మిల్క్ షేక్ రెడీ. గ్లాసులో పోసి చల్లచల్లగా సర్వ్ చేయాలి.

Be the first to comment

Leave a Reply