కాజు(జీడిపప్పు) హల్వా ఎలా తయారుచేయాలో చూద్దాం…

kaju-halwa-recipe-cashew-halwa-recipe-458x258

కావల్సిన పదార్థాలు:

కాజు(జీడిపప్పు): 250grms(సన్నగా తరగాలి)
పాలు: 1ltr
పంచదార: 3-4tbsp
నెయ్యి లేదా బట్టర్: 2tbsp
కుంకుమపువ్వు:కొద్దిగా

తయారుచేయు విధానం:

1. ముందుగా పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకొని తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
2. అంతలోపు పాలను గిన్నెలో పోసి, తక్కువ మంట మీద వేడిచేసుకోవాలి.
3. పాలు మరిగి పొంగు రాగానే, అందులో పంచదార వేసి 2-3నిముషాలు బాగా మిక్స్ చేస్తూ మరిగించాలి. అంతలోపు చల్లారిన జీడిపప్పును మిక్సిలో వేసి మొత్తగా పౌడర్ చేసుకోవాలి.
4. తర్వాత అందులో కుంకుమ పువ్వు వేసి కొన్ని నిముషాలు బాగా మిక్స్ చేయడం వల్ల ఒక డిఫరెంట్ కలర్ వస్తుంది.
5. ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకొన్న జీడిపప్పు పౌడర్ ను అందులో వేసి, మరో 5 నిముషాలు నిధానంగా మిక్స్ చేస్తుండాలి.
6. తక్కువ మంట మీద పాలు-జీడిపప్పు మిశ్రమాన్ని బాగా ఉడికించడం వల్ల హల్వా చిక్కగా మారుతుంది. అంతే కాజు హల్వా రెడీ.

Be the first to comment

Leave a Reply