వారానికి 2 సార్లు చేపలు తింటే కంటి చూపు సురక్షితం…

images
చాలామంది డయాబెటిక్‌ రెటినోపతి సమస్యతో బాధపడుతుంటారు. దీనివల్ల కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటివారు వారానికి రెండుసార్లు చేపలు ఆరగించడం వల్ల కంటి చూపును కాపాడుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది.
వారానికి రెండుసార్లు ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉండే చేపలను తింటే చాలు ఈ ముప్పు 48 శాతం తగ్గుతుంది.
సాధారణంగా మన కంటిలోని రెటీనాలో ఒమెగా-3 పాలీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. మధుమేహం వల్ల రెటీనా దెబ్బతినకుండా ఈ కొవ్వు ఆమ్లాలు కాపాడతాయని పరిశోధనలో తేలింది.

Be the first to comment

Leave a Reply